Health

ఆసుపత్రిలో స్పీకర్ తమ్మినేని-TNI కోవిద్ బులెటిన్

ఆసుపత్రిలో స్పీకర్ తమ్మినేని-TNI కోవిద్ బులెటిన్

* స్పీకర్ తమ్మినేని సీతారాంకు అస్వస్థత…తాడేపల్లి మణిపాల్ ఆసుపత్రిలో కొనసాగుతున్న చికిత్స…గత రెండు రోజులుగా జ్వరం తో బాధపడుతున్న స్పీకర్.

* తూ.గో.జిల్లా ……రాజోలు ……సఖినేటిపల్లి మండలం మోరి గ్రామంలో విషాదం…కరోనాతో వైద్య విద్యార్థిని మృతి…MBBS ఫస్ట్ క్లాస్ లో పాసై ఏలూరు ఆశ్రమంలో కరోనా పేషెంట్ లకు సేవలు చేస్తున్న విద్యార్థిని…పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు ఆశ్రమంలోనే MBBS చదివి అక్కడే కోవిడ్ పేషెంట్ లకు చికిత్స చేసే క్రమంలో అనారోగ్యానికి గురైన విద్యార్థిని…స్వగ్రామం మోరి చేరుకుని నిన్న మోరి లోని సుబ్బమ్మ కోవిడ్ స్టెబిలైజేషన్ సెంటర్ లో చేరిన విద్యార్థిని….పరిస్థితి విషమించడంతో ఈరోజు సుబ్బమ్మ హాస్పిటల్ లో మృతి.

* కొవిడ్ బారినపడి ఆసుపత్రిలో చేరిన మాజీ సీఎస్ ఎస్వీ ప్రసాద్ కన్నుమూశారు. నేదురుమల్లి జనార్దన్రెడ్డి, కోట్ల విజయభాస్కరరెడ్డి, నారా చంద్రబాబు నాయుడు వద్ద ముఖ్య కార్యదర్శిగా పనిచేసిన ఆయన కుటుంబం మొత్తం మహమ్మారి బారినపడింది. దీంతో వారంతా హైదరాబాద్లోని యశోద ఆసుపత్రిలో చేరారు. ప్రసాద్ పెద్ద కుమారుడు ఐసీయూలో చికిత్స పొందుతుండగా, చిన్న కుమారుడు కోలుకుంటున్నాడు. ప్రసాద్ దంపతుల ఆరోగ్యం విషమంగా ఉన్నట్టు ఆసుపత్రి వర్గాలు ఇటీవల తెలిపాయి. పరిస్థితి విషమించడంతో ఈ ఉదయం ఆయన కన్నుమూశారు. ప్రసాద్ భార్య పరిస్థితి కూడా విషమంగానే ఉందని సమాచారం.1975 ఐఏఎస్ బ్యాచ్కు చెందిన ప్రసాద్ నెల్లూరు జిల్లా సబ్ కలెక్టర్గా కెరియర్ మొదలుపెట్టారు. ఆ తర్వాత కడప, విశాఖపట్టణం జిల్లాల కలెక్టర్గానూ పనిచేశారు. ఆ తర్వాత పలు ప్రభుత్వ విభాగాలకు చైర్మన్గా, కార్యదర్శిగా, ముఖ్యకార్యదర్శిగా పనిచేసి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి స్థాయికి చేరుకున్నారు.

* గతేడాది లాక్‌డౌన్‌ వేళ గాయపడ్డ తండ్రిని వెనుక కూర్చోబెట్టుకుని 1200 కిలోమీటర్లు సైకిల్ తొక్కి సొంతూరికి తీసుకొచ్చిన జ్యోతి కుమారి ప్రతి ఒక్కరికీ సుపరిచతమే. అయితే ఆమె సాహసం ఎంతోకాలం నిలువలేదు. ఏడాది తిరగకముందే జ్యోతి తండ్రి మెహన్‌ సోమవారం గుండెపోటుతో మరణించారు. మోహన్ మృతి పట్ల దర్భంగ జిల్లా అధికారులు సానుభూతి ప్రకటించారు. జ్యోతి కుటుంబానికి అన్ని విధాల అండగా ఉంటామన్నారు.బిహార్‌లోని దర్భంగ జిల్లా సిర్హులి గ్రామానికి చెందిన మోహన్‌ పాస్వాన్‌ కుటుంబ పోషణ కోసం గురుగ్రామ్‌లో ఆటో నడిపేవారు. ఆయనకు ముగ్గురు పిల్లలు. గతేడాది దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ ప్రకటించడానికి కొద్ది రోజుల ముందు మోహన్‌ రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారు. దీంతో తండ్రిని చూసుకునేందుకు పెద్ద కుమార్తె జ్యోతి కుమారి గురుగ్రామ్‌కు వచ్చింది. ఆ తర్వాత మార్చిలో లాక్‌డౌన్‌ ప్రకటించడంతో ఈ తండ్రీకూతుళ్లు అక్కడే చిక్కుకుపోయారు. మోహన్‌ నడవలేని స్థితిలో ఉండటం, ఇంటి అద్దె చెల్లించే పరిస్థితి లేకపోవడంతో యజమాని ఖాళీ చేయమని ఒత్తిడి తెచ్చాడు. పూట గడవడమే కష్టంగా మారింది. అలా దాదాపు నెలన్నర రోజుల పాటు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారు.ఇక లాభం లేదనుకున్న జ్యోతి ఎలాగైనా తండ్రిని సొంతూరు తీసుకెళ్లాలని నిర్ణయించుకుంది. కానీ, లాక్‌డౌన్‌తో వాహనాలు రోడ్డెక్కే పరిస్థితి లేదు. దీంతో తన వద్ద ఉన్న కొద్దిపాటి డబ్బుతో ఓ పాత సైకిల్‌ కొని దానిపై తండ్రిని ఎక్కించుకుని దాదాపు 1200 కిలోమీటర్లు ప్రయాణం సాగించిందా బాలిక. ఎన్నో కష్టాలను ఓర్చుకుని ఏడు రోజుల తర్వాత స్వగ్రామానికి చేరింది. జ్యోతి గురించి అప్పట్లో ‘సైకిల్‌ గర్ల్’ పేరుతో మీడియాలో కథనాలు రావడంతో దేశమంతా ఆమె పేరు మార్మోగింది. అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్‌ కుమార్తె ఇవాంకా కూడా బాలికను ప్రశంసించారు.జ్యోతి సాహసాన్ని దేశ ప్రజలతో పాటు భారత సైక్లింగ్‌ ఫెడరేషన్‌ కూడా గుర్తించి.. ఆమెకు సైక్లింగ్‌లో శిక్షణ ఇచ్చేందుకు ముందుకొచ్చింది. ఈ ఏడాది జనవరిలో ప్రధానమంత్రి బాలల పురస్కారాన్ని కూడా అందుకుంది. అంతేగాక, ఆత్మనిర్భర్‌ పేరుతో నిర్మిస్తున్న ఓ సినిమాలో జ్యోతి కథను కూడా తెరకెక్కిస్తుండగా అందులో తన పాత్రను తానే పోషిస్తోంది.