Movies

సోనూ ఈజ్ సూపర్ హీరో-కేటీఆర్

సోనూ ఈజ్ సూపర్ హీరో-కేటీఆర్

కరోనా సంక్షోభ సమయంలో కష్టాల్లో ఉన్నవారికి సాయం చేస్తూ సినీనటుడు సోనూసూద్‌ రియల్‌ హీరోగా నిలుస్తున్నారు. తాజాగా ఆయన్ను తెలంగాణ ఐటీశాఖ మంత్రి కేటీఆర్‌ సైతం సూపర్‌ హీరో అంటూ కొనియాడారు. తాము అడగ్గానే ఆక్సిజన్‌ కాన్సంట్రేటర్లను సమకూర్చి సాయం చేసిన కేటీఆర్‌ను నిజమైన సూపర్‌ హీరో అంటూ నందకిశోర్‌ అనే వ్యక్తి ట్విటర్‌లో ప్రశంసించగా.. దానికి మంత్రి స్పందించారు. ఈ సందర్భంగా కేటీఆర్‌ చేసిన ట్వీట్‌ ఆసక్తికరంగా మారింది. ఎన్నికైన ప్రజాప్రతినిధిగా తన వంతు బాధ్యతను నిర్వర్తించినట్టు కేటీఆర్‌ తెలిపారు. సోనూసూద్‌ను సూపర్‌ హీరోగా పిలవడం సరైనదంటూ పేర్కొన్నారు. అంతేకాకుండా తన ట్వీట్‌కు సోనూసూద్‌ని ట్యాగ్‌ చేశారు. ఆపదలో ఉన్నవాళ్లకు ‘మీరూ సాయం చేయండి బ్రదర్‌’ అంటూ ఆ వ్యక్తికి కేటీఆర్‌ సూచించారు.