NRI-NRT

విజయవాడకు శాశ్వత విదేశీ సర్వీసులు

విజయవాడకు శాశ్వత విదేశీ సర్వీసులు

ఇకపై విజయవాడ శాశ్వత అంతర్జాతీయ విమానాశ్రయంగా రూపుదిద్దుకోనున్నట్లు విమానాశ్రయ డైరెక్టర్ మధుసూధనరావు తెలిపారు. ఈ ఏడాది ఏప్రిల్ 3న తాత్కాలికంగా నిలిచిన వందేభారత్ మిషన్ విదేశీ సర్వీసులు తిరిగి జూన్-2వ తేదీ పున: ప్రారంభం కానున్నట్లు చెప్పారు. సాయంత్రం 6.10 గంటలకు దుబాయ్ నుంచి తరలిరానున్న ప్రత్యేక విమానంతో సర్వీసులు ప్రారంభం కానున్నాయని వివరించారు. మరోవైపు ఇప్పటివరకు దాదాపు 500 మేర విదేశీ సర్వీసులు విజయవాడ వేదికగా రాష్ణ్రానికి చేరుకున్నాయన్న ఆయన.. ఇకపై గల్ఫ్ దేశాలైన మస్కట్, సింగపూర్, కువైట్ నుంచి నిరంతరం ఈ ప్రక్రియ కొనసాగుతుందన్నారు. ఇప్పటికే ప్రయాణికుల సౌకర్యం దృష్ట్యా అంతర్జాతీయ టెర్మినల్ భవనంలో కొవిడ్ సౌలభ్య మార్పు, చేర్పులు చేపట్టామన్నారు. మరోవైపు విజయవాడ నుంచి డిపార్చర్ సేవలు కూడా ప్రయాణికులకు అందించేందుకు సన్నాహాలు చేస్తున్నామని.. రానున్న జులై నుంచి ఈ సేవలు కొనసాగే చర్యలు జరుగుతున్నాయని తెలిపారు. 2వ తేదీతో ప్రారంభమయ్యే అంతర్జాతీయ సర్వీసులు గల్ఫ్ దేశాల్లో నిబంధనల కారణంగా జులై వరకే మాత్రమే కేంద్రం మార్గనిర్దేశకం చేసినప్పటికీ రానున్న అక్టోబర్ వరకు ఈ సర్వీసులు కొనసాగనున్నట్లు చెప్పారు. వారానికి ఆదివారం మినహా మిగిలిన అన్ని రోజుల్లో దాదాపు పది విదేశీ సర్వీసులు తరలిరానున్నటుల పేర్కొన్నారు. ఇప్పటికే రాష్ట్ర కస్టమ్స్, ఆరోగ్యశాఖతో సంప్రదింపులు జరిపామన్న మధుసూదనరావు సర్వీసుల విజయవంతానికి అన్ని ఏర్పాట్లు చేశామని వివరించారు. వందే భారత్ మిషన్లో భాగంగా గతేడాది మే 20వ తేదీ నుంచి ఇప్పటివరకు చేరుకున్న 500 విదేశీ సర్వీసులు విజయవాడకు చేరుకున్నాయి. ఆయా విమానాల్లో దాదాపు 18 దేశాల నుంచి రాష్ట్రానికి 55 వేల మంది ప్రయాణికులు ప్రవాసాంధ్రులు తరలివచ్చారు. దేశంలో విదేశీ సర్వీసుల రాకకు అనుమతులున్న 18 నగరాలకు ధీటుగా విజయవాడ విమానాశ్రయం పోటీపడి అబ్బుర పరిచింది. మిషన్ తో విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయానికి విదేశీ సర్వీసుల అవసరతను కేంద్ర పౌరవిమానయాన శాఖ ఇప్పటికే గుర్తించడం విశేషం.