Movies

100కుటుంబాలకు పూజా హెగ్డే సాయం

100కుటుంబాలకు పూజా హెగ్డే సాయం

కరోనా కష్టకాలంలో పనులు దొరక్క ఇబ్బందులు పడుతున్న నిరుపేదలను ఆదుకునేందుకు పూజాహెగ్డే ముందుకొచ్చారు. కొవిడ్‌ లాక్‌డౌన్‌తో ముంబైలో ఉపాధి లేక ఇబ్బందులు పడుతున్న 100 నిరుపేద కుటుంబాలకు నెలకు సరిపడా నిత్యావసరాలను ఆమె పంపిణీ చేశారు. ఆహార పదార్థాలను స్వయంగా పూజా ప్యాక్‌ చేసి పేదలకు అందించారు. ‘ఈ కష్టకాలంలో జీవితంపై ఆశలు కోల్పోవద్దు. త్వరలోనే మళ్లీ మంచి రోజులు వస్తాయి’ అని పూజాహెగ్డే ఽధైర్యం చెప్పారు. కరోనా బారినపడిన పూజాహెగ్డే ఇటీవల కోలుకున్నారు. ప్రస్తుతం బాలీవుడ్‌లో ‘సర్కస్‌’, ‘కభీ ఈద్‌ కభీ దివాలీ’ ‘రాధేశ్యామ్‌’, ‘ఆచార్య’ సహా పలు చిత్రాల్లో ఆమె కథానాయికగా నటిస్తున్నారు.