Health

టీకా తీసుకున్నా ధీమాగా ఉండవద్దు-TNI కోవిద్ బులెటిన్

టీకా తీసుకున్నా ధీమాగా ఉండవద్దు-TNI కోవిద్ బులెటిన్

* రాష్ట్రం​లో స్వల్పంగా తగ్గుతున్న కరోనా కేసుల నమోదు.రాష్ట్రంలో కొత్తగా 11,421 కరోనా కేసులు, 81 మరణాలు.రాష్ట్రంలో కరోనా నుంచి కోలుకున్న మరో 16,223 మంది బాధితులు.రాష్ట్రంలో ప్రస్తుతం 1,38,912 కరోనా యాక్టివ్‌ కేసులు.రాష్ట్రంలో 24 గంటల్లో 86,223 మందికి కరోనా పరీక్షలు.కరోనాతో అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 13 మంది మృతి.కరోనాతో అనంతపురం, శ్రీకాకుళం జిల్లాల్లో 9 మంది చొప్పున మృతి.అత్యధికంగా తూ.గో. జిల్లాలో 2,308 కరోనా కేసులు నమోదు.చిత్తూరు జిల్లాలో 1,658, అనంతపురం జిల్లాలో 1,041 కరోనా కేసులు.

* కరోనా కట్టడి చర్యల్లో భాగంగా కర్ణాటక ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంది. రాష్ట్రంలో లాక్‌డౌన్‌ను జూన్ 14 ఉదయం 6 గంటల వరకు పొడిగించినట్లు కర్ణాటక సీఎం బిఎస్ యెడియరప్ప ఈ రోజు ప్రకటించారు.

* గన్నవరం విమానాశ్రయంకి చేరుకున్న కోవీషిల్డ్ & కోవిక్సిన్ వాక్సిన్లు. 19 బాక్సుల్లో సుమారుగా 97,280 వేల డోసులు భారత్ బైయోటెక్ నుంచి వ్యాక్సిన్లు చేరుకున్నాయి.

* కోవిడ్‌-19 నివారణ చర్యల్లో భాగంగా సహాయ చర్యల కోసం ముఖ్యమంత్రి సహాయ నిధికి పశ్చిమగోదావరి జిల్లా ఉండి నియోజకవర్గం తరపున రూ.1 కోటి 5 లక్షలు విరాళం.

* రెండు డోసుల ఇంజక్షన్ తీసుకున్న సీనియర్ ఐఏఎస్ అధికారి ఎస్ వి ప్రసాద్ దంపతులు caronaతొ మృతిచెందారు. వారి ఇరువురు కుమారులు ప్రస్తుతం కరోనా సోకి వారి పరిస్థితి విషమంగానే ఉంది. కనుక ఇంజక్షన్ తీసుకున్న వారు చాలా మంది తమకు carona సొకదని అశ్రద్ధగా ఉంటున్నారు. జాగ్రత్తగా ఉండండి ఇంజక్షన్లు తీసుకున్న చాలామంది అశ్రద్ధగా ఉండి తమ ప్రాణాలను కోల్పోతున్నారు.