ScienceAndTech

శాస్త్రవేత్తలకు ప్రధాని అభినందన-TNI కోవిద్ బులెటిన్

Narendra Modi Appreciates Researchers For COVID Vaccine

* హ్యుందాయ్ ఇంజనీరింగ్ కార్పొరేషన్ ఇండియా కంపెనీ వారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి విరాళంగా ఇస్తున్న రూ.1 కోటి విలువైన 100 ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు మరియు 50 BiPAP యంత్రాలను ఆ కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ Mr Kuen Han Yi శుక్రవారం బి.ఆర్.కె.ఆర్ భవన్ లో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శ్రీ సోమేశ్ కుమార్ కు అందచేశారు.

* కరోనా ఉధృతి నేపథ్యంలో మార్కెట్లలో రద్దీని నియంత్రించేందుకు 6వ తేదీ ఆదివారం నగరంలోని చేపల హోల్‌సేల్ మార్కెట్, రిటైల్ వ్యాపారానికి ఉదయం 6 నుంచి 10 గంటల వ‌ర‌కు మాత్రమే అనుమతి ఇస్తున్నామని వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ డాక్టర్ రవిచంద్ ప్రకటనలో తెలిపారు.

* అనంతపురం జిల్లా తాడిపత్రిలో 500 పడకల తాత్కాలిక కొవిడ్ ఆస్పత్రిని సీఎం జగన్​ ప్రారంభించారు.

* బ్లాక్ ఫంగస్ ఇంజెక్షన్ల కొరతపై హైకోర్టు విచారణ. బ్లాక్ ఫంగస్ రోగులకు అవసరమైన ఆంఫోటెరిసిన్-బి ఇంజక్షన్లు సమకూర్చటంలో కేంద్ర ప్రభుత్వం సరిగా వ్యవహరించటం లేదని హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది.

* కేవలం ఒక్క సంవత్సరంలో కరోనా టీకాను తయారు చేసినందుకు భారత శాస్త్రవేత్తలపై ప్రధాని నరేంద్ర మోదీ ప్రశంసల వర్షం కురిపించారు.