Movies

బాలయ్య కోసం అనీల్ రావిపూడి కథ

బాలయ్య కోసం అనీల్ రావిపూడి కథ

అగ్ర కథానాయకుడు బాలకృష్ణతో సినిమాలు చేయడం కోసం యువ దర్శకులు పోటీపడుతున్నారు. ఇప్పటికే గోపీచంద్‌ మలినేని దర్శకత్వంలో సినిమాకి పచ్చజెండా ఊపారు బాలయ్య. త్వరలోనే పట్టాలెక్కనున్న ఆ చిత్రం కోసం నిజ జీవిత సంఘటనలతో ఓ స్క్రిప్టు సిద్ధమవుతోంది. మరో యువ దర్శకుడు అనిల్‌ రావిపూడి కూడా బాలయ్య కోసం కథ సిద్ధం చేశారు. తాజాగా ఆ వరసలో మరో దర్శకుడు చేరినట్టు తెలిసింది. వరుసగా ప్రేమకథల్ని తెరకెక్కించిన ఆ దర్శకుడు బాలకృష్ణ కోసం కథ సిద్ధం చేసినట్టు సమాచారం. మాస్‌లో తిరుగులేని కథానాయకుడు బాలకృష్ణ. ఆయన నటనకీ, శైలికీ ఒక ప్రత్యేకత ఉంది. అందుకే ఆయనతో సినిమాలు చేయడం కోసం ఉత్సాహం చూపిస్తున్నారు యువతరం. ప్రస్తుతం ఆయన బోయపాటి శ్రీను దర్శకత్వంలో ‘అఖండ’ చేస్తున్నారు.