WorldWonders

శంషాబాద్‌లో ₹78కోట్ల హెరాయిన్-తాజావార్తలు

శంషాబాద్‌లో ₹78కోట్ల హెరాయిన్-తాజావార్తలు

* నుంచే సీఎం కేసీఆర్‌పై వైఎస్ షర్మిల ట్వీట్ల వర్షం కురిపిస్తున్నారు. రోజుకో ట్వీట్ చేస్తూ కేసీఆర్‌పై విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. తాజాగా కేసీఆర్‌పై మరో దుమారం రేపే ట్వీట్ చేశారు. ‘తలాపున సముద్రమున్నా చాప దూపకేడ్చినట్టు. వ్యాక్సిన్ల తయారీ సంస్థలు గీడ‌నే ఉన్నా మీకు మాత్రం దొరకటం లేదా? ప్రభుత్వాస్పత్రుల్లో ఫస్ట్ డోస్ బందుపెట్టి నెలరోజులైంది. ప్రైవేట్‌కు మాత్రం దొరుకుతున్నయ్‌. ఇప్పటికైనా మీ రీతి మార్చుకొని, ప్రజ‌ల‌కు ఉచితంగా వ్యాక్సిన్ అందించండి. ప్రభుత్వానికి దొరకని కరోనా వ్యాక్సిన్లు ప్రైవేట్‌కు ఎలా దొరుకుతున్నయి కేసీఆర్ సారూ…? మీకు చేతకాకనా? ప్రజల ప్రాణాలంటే పట్టింపు లేకనా? కమీషన్లకు ఆశపడా? లేక వ్యాక్సిన్ల భారం తగ్గించుకునేందుకా? ఇంకెన్నాళ్లు దొరా మూత‌కండ్ల‌ ప‌రిపాల‌న‌..?’ అని కేసీఆర్‌పై షర్మిల ఘాటు ట్వీట్ చేశారు. కాగా.. కేసీఆర్ గురించి ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడినా, బహిరంగ సభలో విమర్శలు గుప్పించినా.. ట్విట్టర్ వేదికగా ఈ రేంజ్‌లో విమర్శనాస్త్రాలు గుప్పిస్తున్నా ఇంతవరకూ గులాబీ బాస్ నుంచి ఒక్కసారి కూడా రియాక్షన్ రాలేదు.

* లద్దాక్‌ ప్రాంతంలో దళాలను మోహరించిన తరచూ వారిని అక్కడి నుంచి మార్చేస్తోంది. 50వేల మందిని తరలించిన ఏడాది లోపే దాదాపు 90శాతం మందిని మార్చేసినట్లు సమాచారం . ఇక్కడి అత్యంత దారుణమైన వాతావరణ పరిస్థితుల దెబ్బకు చైనా సేనలు కుదురుకోలేకపోతున్నాయి. దీంతో ఇక్కడ విధులకు వచ్చిన సైనికులు కనీసం ఏడాది పాటు కూడా ఉండలేకపోతున్నారు. దీంతో వారిని పంపించి రిజర్వు దళాల్లో లేదా ఇతర ప్రాంతాల్లో డ్యూటీ చేస్తున్న వారిని ఇక్కడకు తరలిస్తోంది. గతేడాది శీతాకాలం వారికి నిజంగా నరకం కనిపించింది. చాలా ఈ వాతావరణం తట్టుకోలేక గాయపడటమో, అస్వస్థతకు గురికావడమో జరిగింది. వాస్తవానికి భారత్‌ కూడా అక్కడ దళాలను మారుస్తుంది. కానీ, చైనాలా 90శాతం కాదు.. దాదాపు 40శాతం వరకు మారుస్తుంది. ఈ ప్రాంతంలో విధుల్లోకి వచ్చిన సైనికులు కనీసం రెండేళ్లపాటు కొనసాగుతాడు. భారత సైనికులకు పర్వత యుద్ధతంత్రంలో మంచి శిక్షణ లభిస్తుంది. దీంతో వారు అక్కడ ఎటువంటి ఇబ్బంది లేకుండా కొనసాగుతారు.

* కరోనా నేపథ్యంలో గతేడాది రైళ్లు నడిచింది పరిమితంగానే. తర్వాత ప్రారంభమైనా అది కూడా పూర్తి స్థాయిలో కాదు. దీనికి తోడు రైల్వే స్టేషన్‌లో ప్రవేశించాలంటే కన్ఫామ్‌ టికెట్‌ తప్పనిసరి. వెయిటింగ్‌ లిస్ట్‌ టికెట్‌ ఉన్న వారికి లోపలికి నో ఎంట్రీ. కరోనా లక్షణాలు ఉంటే ప్రయాణానికి అనుమతి లేదు. ఇన్ని ఆంక్షల నేపథ్యంలో రైల్వేస్టేషన్లకు జనాల తాకిడి తగ్గిందనే చెప్పాలి. అలాంటి సమయంలోనూ టికెట్‌ లేకుండా రైళ్లలో ప్రయాణించిన ‘మహానుభావులు’ ఉన్నారంటే నమ్ముతారా? నమ్మకశక్యంగా లేకపోయినా ఇది నిజం. గతేడాది దేశవ్యాప్తంగా 27 లక్షల మంది టికెట్‌ లేకుండా ప్రయాణించారని రైల్వే శాఖ చెబుతోంది. మధ్యప్రదేశ్‌కు చెందిన చంద్రశేఖర్‌ గౌర్‌ అనే ఆర్టీఐ కార్యకర్త దాఖలు చేసిన స.హ. దరఖాస్తుకు ఈ మేరకు సమాధానం ఇచ్చింది.

* ప్రకాశం జిల్లా కారంచేడు పీహెచ్‌సీ వైద్యుడు డాక్టర్‌ ఎన్‌.భాస్కర్‌రావు చికిత్సకు సీఎం సహాయనిధి నుంచి సాయం చేస్తున్నట్లు ఏపీ వైద్యఆరోగ్యశాఖ మంత్రి ఆళ్ల నాని తెలిపారు. చికిత్సకు అవసరమైన రూ.1.5కోట్లు మంజూరు చేస్తున్నట్లు చెప్పారు. కరోనా బారిన పడిన భాస్కర్‌రావుకు ఊపిరితిత్తులు బాగా దెబ్బతిన్నాయి. ప్రస్తుతం ఆయన సికింద్రాబాద్‌ కిమ్స్‌లో చికిత్స పొందుతున్నారు. ఊపిరితిత్తుల మార్పిడి చికిత్సకు రూ.1.5కోట్లు ఖర్చు అవుతుందని వైద్య నిపుణులు చెప్పడంతో ఈ విషయాన్ని మంత్రి బాలినేని శ్రీనివాస్‌రెడ్డి సీఎం జగన్‌ దృష్టికి తీసుకెళ్లారు. స్పందించిన సీఎం.. భాస్కర్‌రావు చికిత్సకు నిధులు మంజూరు చేయాలని ఆదేశించారు.

* శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో ఆదివారం డీఆర్‌ఐ అధికారులు భారీగా హెరాయిన్‌ స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరు మహిళా ప్రయాణికుల నుంచి 12 కిలోల హెరాయిన్‌ స్వాధీనం చేసుకున్నట్టు అధికారులు వెల్లడించారు. స్వాధీనం చేసుకున్న హెరాయిన్‌ విలువ రూ.78 కోట్లు ఉంటుందని అంచనా వేశారు. ఉగాండా, జాంబియా నుంచి వచ్చిన ఇద్దరు మహిళా ప్రయాణికుల లగేజీ తనిఖి చేయగా బ్యాగ్‌, పైప్‌ రోల్‌ దాచిన 12 కిలోల హెరాయిన్‌ బయటపడిందని డీఆర్‌ఐ అధికారులు తెలిపారు.

* నెల్లూరు జిల్లా కృష్ణ‌ప‌ట్నానికి చెందిన ఆనంద‌య్య ఇస్తున్న క‌రోనా మందుకు ప్ర‌భుత్వం నుంచి అనుమ‌తి రావ‌డంతో ఇవాళ పంపిణీ చేప‌ట్టారు. స‌ర్వేప‌ల్లి నియోజ‌క‌వ‌ర్గానికి చెందిన‌ ప్ర‌జ‌ల‌కు ఔష‌ధాన్ని ఇస్తున్నారు. క్యూలో నిల్చున్న వారికి ఇబ్బందులు లేకుండా ఆనంద‌య్య సోద‌రుడు, బృందం మందును పంపిణీ చేస్తున్నారు. ఈ ఔష‌ధం కోసం నియోజ‌క‌వ‌ర్గం నుంచి ప్ర‌జ‌లు పెద్ద సంఖ్య‌లో త‌ర‌లివ‌చ్చారు. ఈ సంద‌ర్భంగా ఆనంద‌య్య మాట్లాడుతూ.. తొలుత సర్వేపల్లి నియోజకవర్గంలోని ఇంటింటికీ ఔష‌ధం అందేలా ప్రత్యేక చర్యలు తీసుకుంటామన్నారు. ఇతర ప్రాంతాల వారికి త‌ర్వాత ఇస్తామ‌ని.. ఇక్కడకు వచ్చి ఇబ్బందులు పడొద్దని సూచించారు.

* ఏపీ సీఐడీ క‌స్ట‌డీలో త‌న‌ను కొట్టారంటూ న‌ర్సాపురం ఎంపీ ర‌ఘురామ కృష్ణ‌రాజు రాసిన లేఖ‌పై కేర‌ళ ఎంపీ ప్రేమ్‌చంద్ర‌న్ స్పందించారు. ర‌ఘురామ‌పై పోలీసులు థ‌ర్డ్ డిగ్రీ ప్ర‌యోగించ‌డం దారుణ‌మన్నారు. ఏపీ సీఐడీ తీరును ఆయ‌న ఖండించారు. ఎంపీగా ఉన్న ర‌ఘురామ‌ను కొట్ట‌డ‌మంటే పార్ల‌మెంట్‌ను అవ‌మానించ‌డ‌మే అని అన్నారు. ఈ అంశాన్ని పార్ల‌మెంట్‌లో త‌ప్ప‌కుండా లేవ‌నెత్తుతాన‌ని ప్రేమ్ చంద్ర‌న్ చెప్పారు. ఏపీ ప్ర‌భుత్వ ప్ర‌తిష్ఠ‌కు భంగం క‌లిగేలా వ్యాఖ్య‌లు చేశార‌ని గ‌త నెల ఎంపీ రఘురామ కృష్ణ‌రాజును ఏపీ సీఐడీ అధికారులు హైద‌రాబాద్‌లో అరెస్టు చేసి గుంటూరు తీసుకెళ్లారు. అక్క‌డ పోలీస్ కస్ట‌డీలో ఉంచి విచారించారు. ఎంపీ హైకోర్టులో బెయిల్ పిటిష‌న్ దాఖ‌లు చేయ‌గా.. మంజూరు కాక‌పోవ‌డంతో సుప్రీంను ఆశ్ర‌యించారు. అక్క‌డ ఆయ‌న‌కు ష‌ర‌తుల‌తో కూడిన బెయిల్ మంజూరైంది.

* రాష్ట్రంలో వ్యాక్సినేషన్‌ కార్యక్రమం చురుగ్గా కొనసాగుతోందని తెలంగాణ ఐటీ శాఖ ముఖ్యకార్యదర్శి జయేశ్‌ రంజన్‌ అన్నారు. అపార్ట్‌మెంట్లు, గేటెడ్‌ కమ్యూనిటీల్లో వ్యాక్సినేషన్‌ డ్రైవ్‌ కోసం యునైటెడ్‌ ఫెడరేషన్‌ ఫర్‌ రెసిడెన్షియల్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ (యూఎఫ్‌ఆర్‌డబ్ల్యూఏ) ఆధ్వర్యంలో రూపొందించిన యాప్‌ను ఆయన వర్చువల్‌గా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జయేశ్‌ రంజన్‌ మాట్లాడుతూ ప్రస్తుతం వ్యాక్సిన్ల కొరత ఉందని.. జులైలో దాన్ని అధిగమిస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు. వ్యాక్సినేషన్‌ డ్రైవ్స్‌ కోసం భారత్‌ బయోటెక్‌ ఈనెలలో 4లక్షల డోసులు రాష్ట్రానికి ఇచ్చేందుకు అంగీకరించిందని చెప్పారు.

* కొవిడ్‌ కారణంగా ప్రపంచ వ్యాప్తంగా జరిగిన నష్టానికి చైనా పరిహారం చెల్లించాలని అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ డిమాండ్‌ చేశారు. శనివారం ఆయన ఉత్తర కరోలినాలోని రిపబ్లికన్‌ కన్వెన్షన్‌ సెంటర్‌లో మాట్లాడుతూ‘‘అమెరికా, మిగిలిన ప్రపంచానికి ఇప్పుడు సమయం ఆసన్నమైంది. వారు చైనాను పరిహారం కోరాలి. కరోనా మహమ్మారికి కమ్యూనిస్టు పార్టీ ఆఫ్‌ చైనా బాధ్యత స్వీకరించాలి. పరిణామాలను చైనా అనుభవించాలని ప్రపంచం మొత్తం ముక్తకంఠంతో చెప్పాలి. అన్ని దేశాలు కలిసి పనిచేసి చైనాకు కనీసం 10 ట్రిలియన్‌ డాలర్లకు తక్కువ కాకుండా పరిహారం చెల్లించాలని బిల్లు ఇవ్వాలి. వారు చేసిన నష్టానికి అది కూడా చాలా తక్కువ’’ అని వ్యాఖ్యానించారు.

* దిల్లీలో రేషన్ డోర్‌ డెలివరీని కేంద్ర ప్రభుత్వం అడ్డుకుంటోందని శుక్రవారం ఆరోపించిన ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్.. మోదీ సర్కార్‌పై నేడు స్వరం మరింత పెంచారు. రేషన్‌ మాఫియాకు తలొగ్గే కేంద్రం రేషన్‌ డోర్‌ డెలివరీకి మోకాలడ్డుతోందని ఆరోపించారు. మహమ్మారి సమయంలో పిజ్జా డెలివరీకి అనుమతించినప్పుడు రేషన్‌ను ఎందుకు అనుమతించరని ప్రశ్నించారు. రేషన్‌ మాఫియాకు చెక్‌ పెట్టాలని దిల్లీ ప్రభుత్వం తీసుకున్న చర్యలకు కేంద్రం అడ్డుపడుతోందన్నారు. దీన్ని బట్టి దిల్లీలోని రేషన్‌ మాఫియా ఎంత శక్తిమంతమైందో తెలుస్తోందన్నారు. కేవలం కొన్ని వారాల్లోనే పథకాన్ని నిలిపివేయించే స్థాయిలో ఉన్నారని వ్యాఖ్యానించారు.

* కొవిడ్‌-19 బారినపడిన అనేక మందిలో రోగ నిరోధక స్పందన దారితప్పి వారి సొంత కణజాలం, అవయవాలను లక్ష్యంగా చేసుకుంటున్నట్లు బ్రిటన్‌ శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. వారిలో కనిపిస్తున్న అనేక ఆరోగ్య సమస్యలకు ఇదే కారణం కావొచ్చని తెలిపారు. కొవిడ్‌ బాధితులకు మెరుగైన చికిత్స అందించేందుకు ఈ పరిశోధన దోహదపడుతుందని చెప్పారు. కరోనా మహమ్మారి వల్ల అనూహ్య లక్షణాలు తలెత్తుతున్నాయి. అవి ఇన్‌ఫెక్షన్‌ సమయంలోను, అది తగ్గిన కొన్ని నెలల తర్వాత కూడా ఉంటున్నాయి. వీటికి కారణాలేంటన్నది శాస్త్రవేత్తలకు పూర్తిగా బోధపడటంలేదు. ఆటోఇమ్యూన్‌ ప్రక్రియను కొవిడ్‌ ప్రేరేపిస్తుండటం దీనికి కారణమై ఉండొచ్చని భావిస్తూ వచ్చారు.

* పులి కంటపడితే ఎంతటి మృగమైన సరే.. పరుగులుపెట్టాల్సిందే. అలాంటి పులిని చూసి ఓ బాతు భయపడలేదు సరికదా.. ఏకంగా దాన్ని ముప్పు తిప్పలు పెట్టింది. ఇందుకు సంబంధించిన ఓ వీడియో నెట్టింట్లో నవ్వులు పూయిస్తోంది. చిన్న బాతే కదా.. చటుక్కున్న ఆరగించేద్దామని నీటిలోకి దిగిన పులిని ఆ బాతు ఓ ఆట ఆడుకున్న దృశ్యాలు నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. పులిని తనవైపునకు ఆకర్షిస్తూనే.. అంతలోనే నీటిలోకి మునిగి చాకచక్యంగా తప్పించుకుంటున్న బాతు తెలివిని చూసి నెటిజన్లు ఫిదా అవుతున్నారు.