Politics

రోజుకి 10లక్షల మందికి టీకా వేసే సత్తా ఉంది

రోజుకి 10లక్షల మందికి టీకా వేసే సత్తా ఉంది

రాష్ట్రంలో వ్యాక్సిన్ల కొరతపై తెలంగాణ మంత్రి కేటీఆర్‌ స్పందించారు. డిమాండ్‌కు తగినట్లు సరఫరా లేదన్నారు. రాష్ట్రంలో రోజుకు 10 లక్షల మందికి టీకాలు వేసే సామర్థ్యం ఉందని చెప్పారు. చాలా దేశాలు 2020 మే నుంచి టీకాలకు ఆర్డర్లు ఇచ్చాయని, భారత్ మాత్రం 2021 జనవరిలో టీకాలకు ఆర్డర్‌ ఇచ్చిందని తెలిపారు. అమెరికా, కెనడా వంటి దేశాల్లో 50 కోట్ల డోసులు నిల్వ చేసుకున్నాయని చెప్పారు. మిగులు టీకాలు ఉన్న దేశాలతో కేంద్రం సంప్రదింపులు జరపాలని విజ్ఞప్తి చేశారు. వీలైనంత త్వరగా రాష్ట్రాలకు టీకాల సరఫరా పెంచాలన్నారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణలో టీకాల వృథా తక్కువని కేటీఆర్‌ వెల్లడించారు.