Agriculture

మధ్యప్రదేశ్ నూర్జహాన్ మామిడి…కిలో ₹1000

మధ్యప్రదేశ్ నూర్జహాన్ మామిడి…కిలో ₹1000

పండ్లలో రారాజు మామిడి పండు అంటారు. ఏటా వేసవికాలంలో అందుబాటులోకి వచ్చే ఈ పండ్లను తినని వారు ఉండరు అనడంలో అతిశయోక్తి లేదు. ప్రపంచవ్యాప్తంగా 1400కుపైగా మామిడి పండ్ల రకాలు ఉన్నాయట. అందులో వెయ్యి రకాలు మన దేశంలోనే పండటం విశేషం. వాటిల్లో మధ్యప్రదేశ్‌కు చెందిన ‘నూర్జాహన్‌’ రకం మామిడి పండు మరింత ప్రత్యేకం. ఎందుకంటే ఆ పండ్ల బరువు గ్రాముల్లో కాదు.. కిలోల్లో ఉంటుంది. దీంతో ఒక్కో పండు ధర వెయ్యి రూపాయలు పలుకుతోంది. అఫ్గానిస్థాన్‌ మూలాలు ఉన్న ఈ రకం మామిడి పండ్లను మధ్యప్రదేశ్‌లోని అలీరాజ్‌పూర్‌ పరిసర ప్రాంతాల్లో మాత్రమే పండిస్తారు. ఈ ఏడాది మంచి దిగుబడి రావడం, ఒక్కో మామిడి పండు కనీసం 2కిలోల నుంచి 3.5కిలోల బరువుతో భారీ సైజులో ఉండటంతో అధిక ధర పలుకుతోంది. బరువును బట్టి ఒక్కో పండు రూ.500 నుంచి రూ.వెయ్యి వరకు ఉంటుంది. మధ్యప్రదేశ్‌ వ్యాప్తంగా ఈ మామిడి పండ్లకు మంచి డిమాండ్‌ ఉంది. ఎంతలా అంటే.. ఈ పండ్ల కోసం ప్రజలు ముందుగానే బుకింగ్‌ చేసుకుంటారు. తన తోటలోని మూడు చెట్లకు ఈ ఏడాది 250 మామిడి కాయలు కాసాయని, అమ్మకాలు కూడా జరిగిపోయాయని ఓ రైతు వెల్లడించారు.