NRI-NRT

న్యూజెర్సీలో ఎస్పీబీకి ఘన నీరాజనం

Telugu Associations Tribute To SPB In New Jersey

అమెరికాలో కూడా గాన గంధర్వుడు ఎస్.పి.బాల సుబ్రహ్మణ్యం పాటలు మరింత మారుమ్రోగేలా చేసేందుకు అమెరికాలో కళావేదిక అనే స్వచ్ఛంద సంస్థ బాలు స్వరఝరి అనే కొత్త విభాగాన్ని ఏర్పాటు చేసింది. బాల సుబ్రహ్మణ్యం జయంతి సందర్భంగా న్యూజెర్సీలో ఈ విభాగాన్ని ప్రారంభించింది. బ్రిడ్జ్‌వాటర్‌లోని శ్రీ వేంకటేశ్వర ఆలయంలో జరిగిన ఈ ప్రారంభ కార్యక్రమం సంగీత దర్శకుడు కోటి, స్టెర్లీ ఎస్. స్టాన్లీ (న్యూజెర్సీ జనరల్ అసెంబ్లీ సభ్యుడు), ఉపేంద్ర చివుకుల (కమిషనర్, న్యూజెర్సీ బోర్డ్ ఆఫ్ పబ్లిక్ యుటిలిటీస్) పలువురు తెలుగు ప్రముఖుల సమక్షంలో జరిగింది. ఉత్తర అమెరికా తెలుగు సంఘం (నాట్స్), తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా (తానా), అమెరికన్ తెలుగు అసోసియేషన్ (ఎటిఎ), తెలంగాణ అమెరికా తెలుగు అసోసియేషన్ (టాటా), తెలుగు ఫైన్ ఆర్ట్స్ సొసైటీ (టిఎఫ్ఎఎస్) మరియు తెలుగు లిటరరీ అండ్ కల్చరల్ అసోసియేషన్ (టిఎల్‌సిఎ) సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.
తొలుత, స్థానిక సాయి దత్త పీఠం వ్యవస్థాపకులు, ప్రధాన అర్చకులు రఘుశర్మ శంకరమంచి వేద స్వస్తి తో ప్రారంభం
అయిన తర్వాత స్థానిక ప్రముఖ గాయకుడు ప్రసాద్ సింహాద్రి గానం చేసిన శంకరా నాద శరీరా పరా పాటతో ఘన నివాళి సమర్పించారు. అనంతరం పలువురు స్థానిక నాయకులు బాలు గారితో తమ తమ అనుబంధాలను నెమరు వేసుకున్నారు.
గాన గంధర్వుడు ఎస్.పి.బాల సుబ్రహ్మణ్యం వారసత్వాన్ని మరింత ముందుకు తీసుకెళ్లడమే లక్ష్యంగా బాలూ స్వరఝరి యొక్క లక్ష్యం అని కళా వేదిక అధ్యక్షులు మరియు వ్యవస్థాపకురాలు స్వాతి అట్లూరి అన్నారు. స్వరఝరి కార్యక్రమం ద్వారా కళాకారులు తమ ప్రతిభను ప్రదర్శించడానికి, మరింత ఎత్తుకు ఎదగడానికి దోహదం చేస్తుందని తెలిపారు. అదే సమయంలో ఎస్.పి. బాలు స్మరణ నిరంతరం ఉండేలా చేస్తుందని అన్నారు.
అలాగే తమ స్వచ్చంద సంస్థ ద్వారా ఈ కరోనా కష్ట కాలంలో ఇబ్బందులు పడుతున్న పలువురు చిన్న చిన్న సినీ కళాకారులకు తమవంతు సాయం అందచేస్తామని ప్రకటించారు స్వాతి అట్లూరి.
బాలుతో కలిసి 2 వేలకు పైగా పాటల్లో పనిచేశానని ప్రముఖ సంగీతదర్శకుడు కోటి అన్నారు. కోటి ఎస్.పి.బి యొక్క హిట్ నంబర్లను పాడటం ప్రేక్షకులను బాగా అలరించింది. ప్లేబ్యాక్ సింగర్ ఉష, SPB కి “ఫాదర్ ఫిగర్, గురువు” అని పేర్కొంటూ గొప్ప నివాళులు అర్పించారు., ఉషా స్వరఝరి సంస్థకు కార్యదర్శిగా కూడా వ్యవహరించనున్నారు. ఎస్పీ చరణ్, ఎస్పీ శైలజ, హరీష్ శంకర్ గౌరవ సలహాదారులుగా వ్యవహరించనున్నారు. ఈ స్వరఝరి సలహా బోర్డులో ప్రముఖ వ్యక్తులు కూడా ఉంటారు. ఈ కార్యక్రమానికి ప్రముఖ దర్శకుడు కె విశ్వనాథ్, దేవి శ్రీ ప్రసాద్, అనుప్ రూబెన్స్, పలువురు టాలీవుడ్ గాయకులు బృందానికి తమ శుభాకాంక్షలు తెలిపారు.
న్యూజెర్సీలో ఎస్పీబీకి ఘన నీరాజనం-Telugu Associations Tribute To SPB In New Jersey
న్యూజెర్సీలో ఎస్పీబీకి ఘన నీరాజనం-Telugu Associations Tribute To SPB In New Jersey