NRI-NRT

డెట్రాయిట్‌లో…సందడిగా నిరంజన్ విజయోత్సవ సభ

Niranjan Team Victory Celebrations In Detroit

తానా 2021-23 కార్యనిర్వాహక ఉపాధ్యక్షుడు శృంగవరపు నిరంజన్ విజయోత్సవ సభ డెట్రాయిట్‌లో శనివారం నాడు సందడిగా నిర్వహించారు. కార్యక్రమంలో మాజీ అధ్యక్షులు ముత్యాల పద్మశ్రీ, బండ్ల హనుమయ్యలతో పాటు ఎంపీ సీ.ఎం.రమేష్, ప్రవాస తెలుగు ప్రముఖులు యడ్ల హేమ ప్రసాద్, పెద్దిబోయిన జోగేశ్వరరావు, కోయా రమాకాంత్, తానా బోర్డు ఛైర్మన్ కోయా హరీష్, తానా అధ్యక్షుడు తాళ్లూరి జయశేఖర్, తదుపరి అధ్యక్షుడు లావు అంజయ్య చౌదరి తదితరులు పాల్గొని నిరంజన్ ప్యానెల్ గెలుపుకు అభినందనలు తెలిపారు. నిరంజన్ హయాంలో తానా మరింతగా బలోపేతం కావాలని ఆకాంక్షించారు. నిరంజన్ ప్యానెల్ నుండి గెలుపొందిన సభ్యులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. తమ విజయానికి కృషి చేసినవారికి, తోడ్పడిన వారందరికీ నిరంజన్ ధన్యవాదాలు తెలిపారు.

డెట్రాయిట్‌లో...సందడిగా నిరంజన్ విజయోత్సవ సభ...Niranjan Team Victory Celebrations In Detroit