Devotional

జూన్ 20 నుండి తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఏకాంత తెప్పోత్సవాలు

జూన్ 20 నుండి తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఏకాంత తెప్పోత్సవాలు

జూన్ 20 నుండి 24వ తేదీ వరకు తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆల‌యంలో ఏకాంతంగా తెప్పోత్సవాలు

తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి వార్షిక తెప్పోత్సవాలు జూన్ 20 నుండి 24వ తేదీ వరకు ఐదు రోజుల‌ పాటు ఆల‌య ప్రాంగణంలో ఏకాంతంగా జ‌రుగ‌నున్నాయి.

కోవిడ్‌-19 నిబంధనలు అమల్లో ఉన్న నేపథ్యంలో ఉత్సవమూర్తుల‌ను పుష్కరిణి వరకు ఊరేగింపుగా తీసుకొచ్చే అవకాశం లేనందున ఆల‌య ప్రాంగణంలో ఏకాంతంగా అభిషేకం నిర్వహిస్తారు.
           
ఈ 5 రోజుల‌ పాటు ఆల‌యంలోని శ్రీ‌కృష్ణ ముఖ మండ‌పంలో మధ్యాహ్నం 2.30 నుండి 4 గంటల‌ వరకు ఉత్స‌వ‌మూర్తుల‌కు తిరుమంజ‌నం(అభిషేకం) చేపడతారు.