Politics

హరీష్‌రావు కారుపైకి యువకులు-నేరవార్తలు

హరీష్‌రావు కారుపైకి యువకులు-నేరవార్తలు

* ప్రగతి భవన్ వద్ద యువకుల హల్ చల్.వేగంగా వస్తున్న కారు కింద పడి ఆత్మహత్యాయత్నం.కారు డ్రైవర్ అప్రమత్తత తో తప్పిన ప్రమాదం.ఒంటి పై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేసుకునేందుకు ప్రయత్నించిన మరో యువకుడు.యువకులు ఇద్దరూ అన్నతమ్ములుగా గుర్తింపు. మంత్రి హరీష్ రావు కాన్వాయ్ మీదకు దూసుకు వెళ్లిన యువకులు. ఇద్దరిని అరెస్ట్ చేసి బేగంపేట పోలీస్ స్టేషన్ కి తరలింపు.

* జిల్లా పరిధిలోని అరవపల్లి తుంగతుర్తి పోలీస్ స్టేషన్ పరిధిలో నకిలీ పత్తి విత్తనాలు తరలిస్తున్న ఆరుగురు సభ్యులను సూర్యాపేట జిల్లా పోలీసులు అరెస్టు చేయగా, ఒకరు పరారీలో ఉన్నాడు. మంగళవారం సూర్యాపేట జిల్లా పోలీస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఏసీపీ మోహన్ కుమార్ తో కలిసి జిల్లా ఎస్పీ ఆర్ భాస్కర్ వివరాలను వెల్లడించారు.వీరు రెండు ముఠాలుగా ఏర్పడి నకిలీ విత్తనాలు సరఫరా చేస్తున్న వారి వద్దనుండి 2.92 టన్నుల నకిలీ పత్తి విత్తనాలు, ఒక ఇరిటీగా కారు, 1 ద్విచక్ర వాహనం,7 సెల్ ఫోన్ లు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. వీటి విలువ సుమారు 70 లక్షల వరకు ఉంటుందని అంచనా వేస్తున్నారు.

* పశ్చిమ గోదావరి జిల్లా కామవరపుకోట మండలం ఉప్పలపాడు సమీపంలో గోనెసంచిలో శవం, కామవరపుకోట మండలం తడికలపూడికి చెందిన రమేష్ గా పోలీసులు గుర్తింపు. ఇటీవల కరోనాతో మృతి చెందిన కామవరపుకోట గ్రామానికి చెందిన అడ్వకేట్ ప్రకాష్ ఇంటి వద్ద పనిచేస్తున్న రమేష్ ను అతి కిరాతకంగా గొంతు కోసి హత్య చేసి గోనెసంచిలో మూటకట్టి కామవరపుకోట శివారులో పడేసిన గుర్తు తెలియని వ్యక్తులు. సంఘటనా స్థలాన్ని పరిశీలించి, దర్యాప్తు ముమ్మరం చేసిన జంగారెడ్డిగూడెం డిఎస్పి రవికిరణ్.

* నకిలీ క్యాస్ట్‌ సర్టిఫికేట్‌పై పోటీ చేసి గెలిచినట్లు ఆరోపణలు. సర్టిఫికేట్‌ రద్దుతో పాటు జరిమానా విధించిన బాంబే హైకోర్టు. మహారాష్ట్రలోని అమరావతి నుంచి స్వతంత్ర అభ్యర్థిగా గెలిచిన సినీనటి నవనీత్‌ కౌర్‌ రాణాకు బాంబే హైకోర్టు షాక్‌ ఇచ్చింది. ఆమె క్యాస్ట్‌ సర్టిఫికేట్‌ను రద్దు చేయడంతో పాటు 2 లక్షల రూపాయల జరిమానా విధించింది. నవనీత్ కౌర్ ఎస్సీ సామాజిక వర్గానికి చెందినవారు కాదని, నకిలీ క్యాస్ట్‌ సర్టిఫికేట్‌తో ఆమె పోటీచేసి గెలుపొందారని ఆరోపిస్తూ మాజీ ఎంపీ, శివసేన నేత ఆనందరావు అదసూల్ దాఖలు చేసిన పిటిషన్‌పై బాంబే హైకోర్టు మంగళవారం విచారణ చేపట్టింది. విదర్భ ప్రాంతంలోని అమరావతి నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన నవనీత్‌ కౌర్‌.. తొలిసారి ఎంపీగా ఎన్నికైన విషయం తెలిసిందే. బాంబే హైకోర్టు ఇచ్చిన తాజా తీర్పుతో ఆమె లోక్‌సభ సభ్యత్వం ప్రమాదంలో పడినట్లైంది.