Politics

జగన్‌ను వదిలేసిన రఘురామ-తాజావార్తలు

జగన్‌ను వదిలేసిన రఘురామ-తాజావార్తలు

* జగన్‌ మినహా అన్ని రాష్ట్రాల సీఎంలకు రఘురామ లేఖ…ఎంపీ రఘురామకృష్ణ ఇప్పుడు దేశవ్యాప్తంగా ఓ సంచలనంగా మారుతున్నారు.★ ఏపీ ప్రభుత్వం చేపడుతున్న ప్రజా వ్యతిరేక విధానాలను మీడియా సమావేశాల్లో తప్పుబట్టారు.★ అయితే రఘురామ అరెస్ట్ తర్వాత ఆయనకు సుప్రీంకోర్టు బెయిలిచ్చింది.★ ఆయనకు సుప్రీంకోర్టు కొన్ని షరతులు విధించింది.★ మీడియాతో సమావేశాలు నిర్వహించకూడదని చెప్పింది.★ అయితే రమురామ కోర్టు షరతులకు లోపడి ఏపీ ప్రభుత్వంపై తనదైన శైలిలో మరో పంథాలో పోరాటాన్ని సాగిస్తున్నారు.★ తన అరెస్ట్‌, తదనంతర పరిణామాలను వివరిస్తూ అన్ని రాష్ట్రాల సీఎంలకు రఘురామ లేఖ రాశారు.★ జగన్‌‌ తప్ప అన్ని రాష్ట్రాల సీఎంలకు రఘురామ లేఖలు రాయడం గమనార్హం.★ పోలీసులు తనపై థర్డ్‌ డిగ్రీ ప్రయోగించిన విషయాన్ని లేఖలో ఆయన ప్రస్తావించారు.★ జగన్‌ బెయిల్‌ రద్దు చేయాలని సీబీఐ కోర్టులో పిటిషన్‌ వేసినందుకే.. కక్ష సాధింపులో భాగంగా తనను అరెస్ట్‌ చేయించారని రఘురామకృష్ణరాజు తెలిపారు.★ ఈ విషయంపై పార్లమెంట్‌లో తనకు మద్దతిచ్చేలా వారి ఎంపీలకు సూచించాలని సీఎంలను కోరారు.

* ఏపీ రైతులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ రాజమండ్రి- బిజేపీ కార్యాలయ ఆవరణలో బిజేపీ నిరసన దీక్ష

* టీడీపీ అచ్చెన్నాయుడు పాయింట్స్…..కర్నూలు జిల్లా పెద్దకడుబూరు మండం బసలదొడ్డిలో టీడీపీ సానుభూతిపరులకు తాగునీరు నిలిపివేయడం హేయమైన చర్య.

* దుర్గగుడి లో నకిలీ సర్టిఫికెట్లు కలకలం.దుర్గ గుడి లో పనిచేస్తున్న ఉద్యోగులకు నకిలీ సర్టిఫికెట్లు కలకలం.నకిలీ సర్టిఫికెట్లు తో పదోన్నతి పొందిన ఇద్దరు ఆలయ ఉద్యోగులు.దుర్గ గుడిలో రికార్డు అసిస్టెంట్ గా పని చేస్తున్న రాజు జూనియర్ అసిస్టెంట్ లక్ష్మణులను సస్పెండ్ చేసిన ఈ ఓ.అధికారుల విచారణలో బయటపడిన నకిలీ సర్టిఫికెట్లు బాగోతం.సస్పెండ్ చేసిన ఇద్దరు పైన కేసు నమోదు చేసే అవకాశం.

* ఉత్తర్‌ప్రదేశ్‌లోని బారబంకీ జిల్లా మల్లాపుర్‌ గ్రామంలో శనివారం అమానుష ఘటన జరిగింది. ఓ వ్యక్తి తన కోడలిని కొందరు వ్యక్తులకు అమ్మేశాడు. ఇందుకోసం గుజరాత్‌కు చెందిన పలువురితో రూ.80వేలకు ఒప్పందం కూడా కుదుర్చుకున్నాడు. విషయం తెలుసుకున్న బాధితురాలి భర్త పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అప్రమత్తమైన పోలీసులు బాధితురాలితో సహా రైల్వేస్టేషన్‌లో తిరుగు ప్రయాణానికి సిద్ధంగా ఉన్న పలువురు నిందితులను అరెస్టు చేశారు. వారి చెర నుంచి బాధితురాలిని విడిపించారు. అరెస్టు చేసిన 8 మంది నిందితులలో ముగ్గురు మహిళలు కూడా ఉన్నారు. పరారీలో ఉన్న ప్రధాన నిందితుడు, బాధితురాలి మామగారైన చంద్రరామ్‌ సహా మరో నిందితుడు రాము గౌతమ్‌ల కోసం ప్రస్తుతం గాలిస్తున్నారు. వస్తువులను కొనుగోలు చేసి అమ్మినట్లు ప్రధాన నిందితుడు చంద్రరామ్‌ మహిళలతో వ్యాపారం చేస్తాడు. ఇప్పటివరకు 300 మంది మహిళలను కొనుగోలు చేసి వారిని వివిధ వ్యక్తులకు విక్రయించినట్లు సమాచారం. ఓ హత్యకేసులో కూడా చంద్రరామ్‌ ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు.

* కరోనాపై పోరుకు రక్షణరంగ సాంకేతికతతో 2డీజీ ఔషధం అభివృద్ధి, ఆక్సిజన్‌ ప్లాంట్లను ఏర్పాటు చేస్తున్నట్టు డీఆర్‌డీవో ఛైర్మన్‌ సతీష్‌రెడ్డి తెలిపారు. 2డీజీ ఔషధంపై ఫెడరేషన్ ఆఫ్‌ తెలంగాణ చాంబర్స్‌ ఆఫ్‌ కామర్స్‌ అండ్‌ ఇండస్ట్రీస్‌, డాక్టర్‌ రెడ్డీస్‌ సంయుక్తంగా నిర్వహించిన వెబినార్‌లో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. మధ్యస్త, తీవ్ర లక్షణాలు ఉన్న కరోనా రోగులపై ప్రభావవంతంగా 2 డీజీ ఔషధం పనిచేస్తుందని, ఆక్సిజన్‌ వినియోగాన్ని తగ్గిస్తుందని సతీష్‌రెడ్డి వివరించారు.

? దేశంలో కరోనా సెకండ్‌ వేవ్‌ ఉద్ధృతి తగ్గుతోంది. రోజువారీ కేసులు 63రోజుల కనిష్ఠానికి చేరాయి. సోమవారం 18.7లక్షల మందికి పైగా టెస్ట్‌ చేయగా.. 86వేల కేసులు వచ్చాయి. అలాగే, ఒక్కరోజే 33.6లక్షల మందికి వ్యాక్సిన్‌ పంపిణీ చేశారు. ఏప్రిల్‌ 3 తర్వాత అత్యల్పంగా రోజువారీ కేసులు నమోదయ్యాయి. 322 జిల్లాల్లో నెల నుంచి కేసులు తగ్గుదల కనబడుతోందని కేంద్ర ఆరోగ్యశాఖ సంయుక్త కార్యదర్శి లవ్‌ అగర్వాల్‌ తెలిపారు. దేశంలో రికవరీ రేటు 94.3శాతం గా ఉంది. 15 రాష్ట్రాల్లో వీక్లీ పాజిటివిటీ రేటు 5శాతం కంటే దిగువనే ఉండగా.. రోజువారీ పాజిటివిటీ రేటు 4.62శాతంగా ఉంది. కేసుల్లో గత వారం 33శాతం క్షీణత కనిపించింది. 209 జిల్లాల్లో 100 చొప్పున రోజువారీ కేసులు నమోదవుతున్నట్టు కేంద్రం తెలిపింది.

? థర్డ్‌ వేవ్‌లో కరోనా వైరస్‌ ప్రభావం చిన్నారులపై అధికంగా ఉంటుందని నిరూపించేందుకు ఎలాంటి ఆధారాల్లేవని దిల్లీ ఎయిమ్స్‌ డైరెక్టర్‌ రణ్‌దీప్‌ గులేరియా అన్నారు. సెకండ్‌ వేవ్‌లో కొవిడ్‌ సోకిన పిల్లల్లో స్వల్ప లక్షణాలే ఉన్నాయని చెప్పారు. మున్ముందు కరోనా తీవ్రత చిన్నారులపై అధికంగా ఉంటుందని తాము భావించడం లేదన్నారు.

? కరోనా రోగులు త్వరగా కోలుకొనేందుకు తాము రూపొందించిన 2-డీజీ ఔషధం ఉపయుక్తంగా ఉంటుందని డీఆర్‌డీవో ఛైర్మన్‌ సతీశ్‌ రెడ్డి అన్నారు. మధ్యస్థ, తీవ్ర లక్షణాలు ఉన్న రోగులకే ఇది వాడాలని, తద్వారా ఆక్సిజన్‌ అవసరం బాగా తగ్గుతుందన్నారు. జులై చివరి నాటికి 850 ఆక్సిజన్‌ ప్లాంట్లు నిర్మిస్తామని చెప్పారు. డీఆర్‌డీవో రూపొందించిన 2డీజీ ఔషధంపై ఎఫ్‌టీసీసీఐ, డాక్టర్‌ రెడ్డీస్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన వెబినార్‌లో ఆయన మాట్లాడారు.

? దేశవ్యాప్తంగా 18ఏళ్లు పైబడిన అందరికీ ఉచితంగా టీకా పంపిణీ చేస్తామని ప్రకటించిన కేంద్రం భారీగా టీకాల తయారీ కోసం ఆర్డర్లు ఇచ్చింది. మొత్తం 44 కోట్ల డోసుల తయారీ కోసం (కొవిషీల్డ్‌ 25కోట్లు; కొవాగ్జిన్‌ 19కోట్ల డోసులు) ఆర్డర్లు ఇచ్చినట్టు నీతి ఆయోగ్ సభ్యుడు వీకే పాల్‌ మంగళవారం వెల్లడించారు. ఇప్పటికే బయోలాజికల్‌-ఇ సంస్థకు 30 కోట్ల డోసులకు కేంద్రం ఆర్డర్‌ చేసిన విషయం తెలిసిందే.

? తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసులు భారీగా తగ్గాయి. గత 24 గంటల్లో రాష్ట్రంలో 1,33,134 మందికి కరోనా నిర్థారణ పరీక్షలు నిర్వహించగా… కొత్తగా 1,897 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. అలాగే కొత్తగా 15 మంది మరణించినట్టు రాష్ట్ర వైద్యశాఖ బులిటెన్‌లో వెల్లడించింది.

? రాష్ట్రాలు/ కేంద్రపాలిత ప్రాంతాల వద్ద ఇంకా 1.19కోట్ల టీకా డోసులు పంపిణీకి సిద్ధంగా అందుబాటులో ఉన్నట్టు కేంద్రం ప్రకటించింది. ఇప్పటివరకు 24కోట్లకు పైగా వ్యాక్సిన్‌ డోసులను రాష్ట్రాలకు పంపిణీ చేయగా.. వీటిలో 23.47కోట్ల డోసులు వినియోగం (వృథాతో కలిపి) జరిగినట్టు తెలిపింది. ప్రస్తుతం 1,19,46,925 డోసులు రాష్ట్రాల వద్ద ఉన్నట్టు వెల్లడించింది.

? కరోనా కష్టకాలంలో అవస్థలు పడుతున్న వీధి వ్యాపారుల కోసం ఒడిశా సీఎం నవీన్‌ పట్నాయక్‌ కరోనా సహాయ ప్యాకేజీని ప్రకటించారు. రూ.26కోట్లతో ప్రకటించిన ఈ ప్యాకేజీతో 87,657మంది వీధివ్యాపారులు లబ్ధి పొందనున్నారు.

? థర్డ్‌ వేవ్‌ చిన్నారులకు ఎక్కువ ముప్పు ఉందంటూ హెచ్చరికల నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఐదేళ్ల లోపు వయసు కలిగిన పిల్లలు ఉన్న తల్లులను గుర్తించి వారికి ప్రాధాన్య క్రమంలో టీకా వేయించాలని నిర్ణయించింది. అర్హులైనవారి జాబితాను గ్రామాల వారీగా తయారు చేయాలని అధికారులను వైద్యశాఖ ఆదేశించింది. లబ్దిదారులను ఏఎన్‌ఎం, ఆశా కార్యకర్తలు లబ్ధిదారులను గుర్తించి ఆయా వ్యాక్సిన్‌ కేంద్రాల వద్దకు తీసుకురావాలని సూచించింది.

? కరోనా నివారణకు దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్‌ కార్యక్రమం కొనసాగుతున్న విషయం తెలిసిందే. అయితే, జమ్మూకశ్మీర్‌లోని ఓ కుగ్రామంలో ప్రతిఒక్కరూ టీకా వేసుకొని ఆదర్శంగా నిలుస్తున్నారు. బందిపొరాలోని వేయాన్‌ గ్రామం దేశంలోనే 18 ఏళ్లు పైబడిన ప్రతిఒక్కరూ టీకా వేసుకున్న తొలి గ్రామంగా నిలిచింది. ఈ గ్రామంలో 18 ఏళ్లు దాటిన వారు 362మంది ఉన్నట్టు అధికారులు తెలిపారు.

? మధ్యప్రదేశ్‌ ప్రభుత్వం మరోసారి కొవిడ్‌ కర్ఫ్యూని పొడిగించింది. ఈ నెల 15వరకు ఆంక్షలు అమలులో ఉంటాయని సీఎం శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌ స్పష్టంచేశారు. మరోవైపు, యూపీలోని అన్ని జిల్లాల్లో కొవిడ్‌ కర్ఫ్యూని ఎత్తివేశారు. అయితే, రాత్రి 7గంటల నుంచి ఉదయం 7గంటల వరకు నైట్‌ కర్ఫ్యూమాత్రం కొనసాగుతుందని సీఎం యోగి ఆదిత్యనాథ్‌ కార్యాలయం వెల్లడించింది.