Editorials

స్థిరాస్తి చరాస్తి తేడా ఏమిటి? చట్టాలు ఏమి చెప్తున్నాయి?

స్థిరాస్తి చరాస్తి తేడా ఏమిటి? చట్టాలు ఏమి చెప్తున్నాయి?

చరాస్తి స్థిరాస్తి లలో ఏయేవి చేరివుంటాయి. చట్టాలు ఏం చెబుతున్నాయి.
—————————————————
ఆస్తులలో రెండు రకాలున్నాయాని ఒకటోదేమో స్థిరాస్తి అని రెండోదేమో చరాస్తని మనకు బాగా తెలుసు. చరాస్తి (Movable property) అనగానే అటువంటి ఆస్తిని ఒక ప్రదేశంనుండి మరోప్రదేశానికి తరలించటానికి వీలయ్యేదని అటువంటి వాటిలో పశుసంపదలు, వాహనాలు, ఇంటి సామానులు, పరికరాలు, ఆభరణాలు వగైరాలని, ఇక స్థిరాస్తి (immovable propety) అనగానే భూములు భవనాలు వంటివి అనగా కదిలించటానికి వీలుకానివని కూడా మనకు తెలుసు.

అయితే చట్టా స్థిరచరాస్తుల గురించి ఏం తెలియచేస్తున్నాయో వాటిపైన మనకేం అధికారాలున్నాయో తెలుసుకొందాం.

మనదేశంలో స్థిరచరాస్తుల గురించి నిర్వచించటానికి ఏయే చట్టాలున్నాయంటే ట్రాన్స్ ఫర్ ఆఫ్ ప్రాపర్టీ యాక్ట్ 1882 Trasnfer of Property Act 1882),

ఇండియన్ స్టాంప్ యాక్ట్ 1899
(Indian stamps Act 1899),

రిజిస్ట్రేషన్ యాక్ట్ 1908 (Registration Act 1908),

సెంట్రల్‌ సేల్స్ ట్యాక్స్ యాక్ట్ 1956 (Central sales tax Act 1956),

కేంద్ర ఆదాయపుపన్ను చట్టం 1961 (Income tax Act 1961)

ఆస్తని చెప్పుకోటానికి కొంత భూమో లేక తులం బంగారమో ఉదాహరణలు కావు. ఆస్తి అనేది మానవుడి ఉనికిని అస్తిత్వానికి జీవితానికి ముడిపడి సమాజంలో గుర్తింపును హోదాను ఇచ్చేదిగా వుండాలి. సమాజం ఒహో ఇది ఫలానా వ్యక్తికి చెందిన వస్తువు దీనివలన ఆ వ్యక్తి సంఘంలో గుర్తింపు కలుగుతోందని భావించాలి.

ఆస్తులలో కొన్ని స్పష్టంగా గుర్తించటానికి భౌతిక అనుభూతిని ( Feeling of Touch) ఇచ్చేటివిగా వుంటాయి.వీటినే Tangible properties అంటారు. ఉదా॥ భూమి, కర్మాగారం, TV, వంటపాత్రలు మొదలైనవి.

మరికొన్నింటిని ముట్టుకోలేము చూడలేము. ఇలాంటి వాటిలో మేధోసంపద, పేటెంట్లు, ట్రేడుమార్కులు, బ్రాండ్ ఇమేజులు, కంప్యూటర్ సాఫ్ట్ వేర్ లు, వైఫైలు మొ॥నవి వుంటాయి.వీటిని un tangible properties అంటారు.

అలాగే కదిలించటానికి వీలైన ఆస్తుల గురించి చెప్పుకొన్నాం కదా ! మరి కదిలించటానికి వీలులేని వస్తువులలో కేవలం భూములు భవనాలు మొదలైనవే కాకుండా భూమిపై అతుక్కొని శాశ్వితంగా వున్న గనులు, చెరువులు,నదులు, సముద్రాలు, అడవులు మొదలైనవి ఉంటాయి.

మరైతే భూమిపైన అతుక్కొని వున్న కాపునిచ్చే కొన్నిరకాల ఉద్యానవనాలు ఉదా॥ బొప్పాయి పంట, వేరుశేనగ, వరి మొదలైన పంటలు మొదలైనవి స్థిరాస్తుల జాబిబితాలోనికి రావు. ఎందుకంటే వాటిని ఆర్థికలాభం మనం పెంచుతున్నాం. వీటిని శాశ్విత ప్రయోజనాల కొరకు ఉపయోగించం. ఇవి శాశ్వితంగా భూమిపై నుండవు.

ఇక స్వంత లేదా ప్రభుత్వ ఆస్తులు అక్రమాస్తులు, బినామీఆస్తులు, లేని ఆస్తులు వున్నట్లుగా భ్రమింప చేసే ఆస్తులు అనగా స్టాంప్ పేపర్ల పైన మాత్రమే వుండే ఆస్తులు, నల్లధనం, మొదలైన ఆస్తులున్నాయి.
వీటిల్లో ప్రభుత్వ ఆస్తుల గురించి ఇబ్బందేమి లేదు. ప్రైవేట్ వ్యక్తిగత ఆస్తులను తగినంత సరైన డాక్యూమెంట్లతో భద్రపరచుకోవాలి.

మిగిలిన దొంగఆస్తులు ఎక్కడున్నా ఎలావున్నా ఎప్పుడైనా ప్రమాదమే.

ఈ సమాచారం కేవలం అవగాహన కొరకు మాత్రమేనని మనవి. మరింత సమాచారం కొరకు నవీన చట్టాలు అధ్యయనం చేయండి.
………………………………………………………..