DailyDose

ప్రిన్సిపల్ సెక్రటరీ సంతకం ఫోర్జరీ-నేరవార్తలు

ప్రిన్సిపల్ సెక్రటరీ సంతకం ఫోర్జరీ-నేరవార్తలు

* ఏపీలో ఇసుక రీచుల పేరిట భారీ మోసం.ఇసుక రీచుల్లో తవ్వకాలు లీజుకు ఇస్తామని రూ.3.50 కోట్లు వసూలు చేసిన కేటుగాడు.గనులశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ద్వివేది సంతకం ఫోర్జరీ చేసి నకిలీ డాక్యుమెంట్స్ తయారు.ఏపీలో ఇసుక రీచుల వేలం జేపీ గ్రూప్‍కి ఇచ్చిన ఏపీ ప్రభుత్వం.నిందితుడు కాకినాడకు చెందిన రామకృష్ణగా గుర్తింపు.2018లో సైఫాబాద్‍లో నిందితుడిపై ఫైనాన్స్ సెక్రటరీ సంతకం ఫోర్జరీపై కేసు.ఏడుగురు బాధితుల నుంచి రూ.3.50 కోట్లు వసూలు.బెజవాడ, భవానీపురంలో ఎఫ్‍ఐఆర్ నమోదు.నిందితుడి బ్యాంకు అకౌంట్ నుంచి రూ.2 కోట్లు సీజ్.

* గుంటూరులో నేవి ఉద్యోగి కాకర్ల శ్రీనివాస్ అదృశ్యం మిస్టరీగా మారింది.ఫిర్యాదు చేసినప్పటికీ అరండల్ పేట పోలీసులు తమ పరిధి కాదనడంతో బాధిత కుటుంబం ఆవేదన వ్యక్తం చేస్తోంది.నేడు శ్రీనివాస్ కుటుంబ సభ్యులు అర్బన్ ఎస్పీని కలిశారు.ప్రియురాలు, స్నేహితుడు ప్రవర్తన సరిగా లేదని కుటుంబం సభ్యులు చెబుతున్నారు.ఇద్దరిని విచారించి శ్రీనివాస్ ఆచూకి తెలపాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

* జడ్జి రామకృష్ణ బెయిల్​ పిటిషన్​పై విచారణ చేసిన హైకోర్టు తదుపరి విచారణను ఈ నెల 15కు వాయిదా వేసింది. పిటిషనర్‌ తరఫున సీనియర్‌ న్యాయవాది దమ్మాలపాటి శ్రీనివాస్‌ వాదనలు వినిపించారు.

* లుధియాలో ఇటీవల ఇద్దరు పోలీసు అసిస్టెంట్‌ సబ్‌ ఇన్‌స్పెక్టర్లపై కాల్పులు జరిపి చంపినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న పంజాబ్‌కు చెందిన ఇద్దరు మాదకద్రవ్యాల స్మగ్లర్లు పశ్చిమ బెంగాల్‌ పోలీసుల చేతిలో ఎన్‌కౌంటరయ్యారు.

* నకిలి విత్తనాలను తయారు చేసి అమ్ముతూ అమాయక రైతుల్ని మోసం చేస్తున్న 6 సభ్యుల ముఠాను అరెస్ట్ చేసినట్లు సూర్యాపేట జిల్లా కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డి తెలిపారు