Movies

సోనూ సూద్‌ను ప్రశంసించిన చంద్రబాబు

నటుడు సోనూ సూద్‌ సేవలను చంద్రబాబు ప్రశంసించారు. ఆయనను స్ఫూర్తిగా తీసుకుని పని చేయాలని పిలుపునిచ్చారు. వలస కార్మికులను ఇళ్లకు చేర్చడంలో ఆయన సేవలు మరువలేనివన్నారు. ‘మిమ్మల్ని చూసి దేశం గర్విస్తోంది. త్వరలో మనం కలుద్దాం, కలిసి పని చేద్దాం’ అని సోనూ సూద్‌తో చెప్పారు. ‘ఎంతో మంది ప్రాణాలు కాపాడిన ఫ్రంట్‌లైన్‌ యోధులకు వందనం. కొవిడ్‌ సమయంలో ఎన్టీఆర్‌ ట్రస్టు ఆధ్వర్యంలో ఎకో సిస్టమ్‌ అభివృద్ధి చేశాం. వైద్య సాయం అందించాం. దీన్ని కొనసాగిస్తాం’ అని తెలిపారు.