Politics

నవరత్నాలు అని నవరత్న ఆయిల్ రాశారు-తాజావార్తలు

నవరత్నాలు అని నవరత్న ఆయిల్ రాశారు-తాజావార్తలు

* మాజీ మంత్రి, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు కొల్లు రవీంద్ర కామెంట్స్.ముఖ్యమంత్రి జగన్ నవరత్నాల పేరుతో ప్రజలకు నవరత్న ఆయిల్ రాశారు.పన్నుల పేరుతో ప్రజలను దోచుకుంటున్నారు.ప్రతిపక్షంలో ఉండగా పెట్రోల్, డీజిల్ ధరలపై అసెంబ్లీలో మొసలి కన్నీరు కార్చారు.మరి ఇప్పుడు ఎలా పెంచారు ? రాష్ట్ర వాటా తగ్గించుకుంటే పెట్రోల్, డీజిల్ రేటు తగ్గించుకోవచ్చు కదా.మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలు ఓట్లు వేసి గెలించారని వారికి పన్నుల బాదుడు బహుమతిగా ఇస్తున్నారా?మంత్రి బొత్స సత్యనారాయణ ఇంటి పన్నులు 15 శాతామేగా పెంచుతున్నామని చెబుతున్నారు.

* కొవిడ్‌పై పోరాటంలో కుటుంబ సభ్యులు కూడా బాధితుల వ‌ద్ద‌కు వెళ్ల‌డం లేద‌ని.. ఇదే స‌మ‌యంలో క‌రోనా బారిన ప‌డిన‌వారికి సేవ‌లు అందిస్తున్న ఫ్రంట్ లైన్ వారియ‌ర్స్‌కు సెల్యూట్ చేస్తున్న‌ట్లు తెదేపా అధినేత చంద్ర‌బాబు నాయుడు అన్నారు. ఎన్టీఆర్ ట్ర‌స్ట్ ద్వారా అందుతున్న వైద్య సేవ‌ల‌పై వివిధ రంగాల నిపుణుల‌తో ఆయ‌న వ‌ర్చువ‌ల్‌గా స‌మావేశ‌మ‌య్యారు. ఈ సంద‌ర్భంగా మాట్లాడుతూ.. ఎన్నో విప‌త్తుల‌ను చూశాన‌ని.. క‌రోనా వంటి సంక్షోభం చూడ‌టం ఇదే తొలిసారి అని అన్నారు. ప్ర‌కృతి విప‌త్తు స‌మ‌యాల్లో ఎన్టీఆర్ ట్ర‌స్టు, తెదేపా అనేక సేవా కార్య‌క్ర‌మాలు చేప‌ట్టింద‌ని ఆయ‌న తెలిపారు.

* హైదరాబాద్‌ వనస్థలిపురం కేంద్రంగా నకిలీ విత్తనాల అక్రమ వ్యాపారం గుట్టు రట్టు చేసిన రెండు రోజుల వ్యధిలోనే మరో ముఠాను రాచకొండ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రాచకొండ కమిషనరేట్‌ పరిధిలో వ్యవసాయ అధికారులు, ఎస్ఓటీ, స్థానిక పోలీసులు సంయుక్తంగా నిర్వహించిన దాడుల్లో రూ. 1.15 కోట్లు విలువైన నకిలీ పత్తి, మిర్చి, వరి విత్తనాలు సహా వివిధ రకాల పరికరాలను స్వాధీనం చేసుకొని సీజ్‌ చేశారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను రాచకొండ సీపీ మహేశ్ భగవత్‌ మీడియాకు వెల్లడించారు.

* ఆంధ్రప్రదేశ్‌లో గడిచిన 24 గంటల్లో 1,08,616 పరీక్షలు నిర్వహించగా.. 6,952 కేసులు నిర్ధారణ అయ్యాయి. తాజా కేసులతో కలిపి ఇప్పటివరకు రాష్ట్రంలో 18,03,074 మంది వైరస్‌ బారినపడినట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ బులెటిన్‌ విడుదల చేసింది. గడిచిన 24 గంటల వ్యవధిలో కొవిడ్‌ వల్ల 58 మంది బాధితులు ప్రాణాలు కోల్పోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా మృతుల సంఖ్య 11,882కి చేరింది. 24 గంటల వ్యవధిలో 11,577 మంది బాధితులు పూర్తిగా కోలుకొని ఇళ్లకు వెళ్లిపోయారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటివరకు 16,99,775 మంది బాధితులు కొలుకున్నట్లు ఆరోగ్య శాఖ తెలిపింది. ప్రస్తుతం రాష్ట్రంలో 91,417 యాక్టివ్‌ కేసులున్నాయి.

* వస్తు, సేవల పన్ను(జీఎస్‌టీ) మండలి 44వ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. కరోనాపై పోరులో ఉపయోగించే ఔషధాలు, వైద్య పరికరాలు సహా ఇతర సామగ్రిపై పన్నులు తగ్గించారు. బ్లాక్ ఫంగస్‌ చికిత్సలో ఉపయోగించే ఔషధాలపైనా పన్నులు కుదించారు. శనివారం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ అధ్యక్షతన వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా మండలి భేటీ అయ్యింది. భేటీలో ఆర్థికశాఖ సహాయ మంత్రి అనురాగ్‌ ఠాకూర్‌, రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ఆర్థిక మంత్రులు, ఇతర సీనియర్‌ అధికారులు పాల్గొన్నారు. కొత్తగా నిర్ణయించిన ఈ పన్ను రేట్లు ఈ ఏడాది సెప్టెంబరు 30 వరకు అందుబాటులో ఉంటాయి.

* కృష్ణా నదీ పరీవాహక ప్రాంతంలో నివసించే అరుదైన జీవులు సముద్ర తాబేళ్లు. మానవాళికి మేలుచేసే సముద్ర జీవుల్లో తాబేళ్లు కీలక పాత్ర పోషిస్తాయి. కృష్ణా నది బంగాళాఖాతంలో కలిసే సాగర సంగమం వద్ద వేలాదిగా ఇవి జీవిస్తున్నాయి. సముద్ర కాలుష్యం, ఇతర కారణాల వల్ల అంతరించిపోతున్న ఈ తాబేళ్లను సంరక్షించాలని పర్యావరణ ప్రేమికులు కోరుతున్నారు. భూమి మీద ఉన్న అతి ప్రాచీనమైన సరీసృపాలు సముద్ర తాబేళ్లు. వీటి జీవితకాలం 100 నుంచి 150 ఏళ్లు. ఇవి సముద్ర సంచార జీవులు. ఆహారం, గుడ్లు పెట్టడం కోసం సుమారు 20 వేల కిలోమీటర్ల వరకు వలస వెళుతూ ఉంటాయి. ప్రపంచవ్యాప్తంగా ఏడు రకాల సముద్ర తాబేళ్ల జాతులున్నాయి. వీటిలో ఐదు రకాలు భారతదేశంలో ఉండగా.. ఆంధ్రప్రదేశ్‌ తీర ప్రాంతానికి ఎక్కువగా వచ్చేవి ఆలివ్‌ రిడ్లీ తాబేళ్లు.

* స్మార్ట్‌ఫోన్‌ పుణ్యమా అని డేటా వినియోగం భారీగా పెరిగింది. ఒక్కోసారి రోజుకు 2జీబీ పైనే అయిపోతుంటుంది కొందరికి. దీంతో ఆ రోజు లిమిట్‌ పూర్తయితే వేగం నెమ్మదిస్తుంది. అంటే మళ్లీ వేరే డేటా ప్లాన్‌ను వేసుకోవాలి. లేదంటే తర్వాతి రోజు వరకూ ఆగాలి. ఈ డైలీ లిమిట్‌కు చెక్‌ పెడుతూ రిలయన్స్‌ జియో సరికొత్త ప్రీపెయిడ్‌ ప్లాన్లను తీసుకొచ్చింది. ఈ ప్లాన్లు రీఛార్జి చేసుకుంటే డైలీ లిమిట్‌ అనే ప్రస్తావన లేకుండా కేటాయించిన మొత్తాన్ని పూర్తయ్యే వరకూ డేటా వినియోగించుకోవచ్చు. జియో కొత్త ప్లాన్లలో గతం మాదిరిగానే అన్‌లిమిటెడ్‌ కాల్స్‌, డైలీ 100 ఎస్సెమ్మెస్‌లతో పాటు జియో యాప్స్‌ ఉచితంగా లభిస్తాయి.

* ఓ వైపు దేశవ్యాప్తంగా చాలా చోట్ల కరోనా వ్యాక్సిన్ల కొరత ఏర్పడుతుండగా.. మరోవైపు ప్రైవేటు ఆసుపత్రుల్లో లక్షల కొద్దీ టీకాలు నిరుపయోగంగా ఉండిపోతున్నాయి. గత నెలల్లో ప్రైవేటు ఆసుపత్రులు కేవలం 17శాతం డోసులను మాత్రమే వినియోగించినట్లు ప్రభుత్వ గణాంకాల ద్వారా తెలుస్తోంది. ఆరోగ్యశాఖ గణాంకాల ప్రకారం.. మే నెలలో దేశవ్యాప్తంగా 7.4కోట్ల డోసులు అందుబాటులో ఉండగా.. ఇందులో 1.85కోట్ల డోసులు ప్రైవేటుకు కేటాయించినవి. వీటిల్లో 1.29 కోట్ల డోసులను మాత్రమే ప్రైవేటు ఆసుపత్రులు కొనుగోలు చేయగా.. కేవలం 22 లక్షల డోసులు మాత్రమే వినియోగించాయి. ప్రభుత్వ ఆసుపత్రులతో పోలిస్తే అధిక ధరల కారణంగానే ప్రజలు ప్రైవేటు ఆసుపత్రులకు వెళ్లడం లేదని నిపుణులు భావిస్తున్నారు.

* ఒకప్పుడు కొలంబియాలో ఆయనో పెద్ద డ్రగ్స్‌ మాఫియా కింగ్‌.. సరదాగా నాలుగు నీటి ఏనుగులను పెంచుకున్నాడు. అప్పుడంతా బాగానే ఉంది. కానీ, ఆయన మృతి చెందిన తర్వాత ఆ నాలుగు నీటి ఏనుగుల్ని ఎవరూ పట్టించుకోలేదు. అవే ఇప్పుడు కొలంబియా వన్యప్రాణులకు ప్రమాదకరంగా మారాయి. ఆ నీటి ఏనుగుల సంతానం ప్రస్తుతం కొలంబియా వృక్ష, జంతుజాలాన్ని నాశనం చేస్తున్నాయి. పాబ్లో ఎస్కోబార్‌.. 1980ల్లో ప్రపంచవ్యాప్తంగా డ్రగ్స్‌ మాఫియాకి డాన్‌గా ఎదిగాడు. అవినీతి డబ్బులే అయినా.. ప్రపంచంలోకెల్లా అత్యంత ధనవంతుడిగా అతడికి పేరుంది. ఆయన కుమార్తె చలికాచుకోవడం కోసం కరెన్సీ నోట్ల కట్టలతో మంట పెట్టాడంటే అర్థం చేసుకోవచ్చు పాబ్లో ఎంత సంపన్నుడో. అయితే, ఓ సారి అమెరికా జూ నుంచి నాలుగు నీటి ఏనుగుల్ని తెప్పించుకున్నాడు.

* జమ్మూకశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్‌ 370 రద్దు అంశం మరోసారి తెరపైకి వచ్చింది. దీనిపై కాంగ్రెస్‌ సీనియర్‌ నేత దిగ్విజయ్‌ చేసిన వ్యాఖ్యలు తాజాగా దుమారం రేపాయి. ఆర్టికల్‌ 370 రద్దు విచారకరమని, తమ పార్టీ అధికారంలోకి వచ్చాక ఈ అంశాన్ని పరిశీలిస్తుందంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు తాజా వివాదానికి కారణమయ్యాయి. దీనిపై అధికార భాజపా మండిపడింది. పాక్‌తో ఆ పార్టీ ఒప్పందం చేసుకుందని విమర్శించింది. క్లబ్‌ హౌస్‌ అనే సోషల్‌మీడియా యాప్‌లో జరిగిన చర్చలో పాకిస్థాన్‌కు చెందిన జర్నలిస్టు అడిగిన ప్రశ్నకు దిగ్విజయ్‌ సమాధానం ఇస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు.

* కొవిడ్‌-19 మహమ్మారి నివారణకు కొవిషీల్డ్‌ వ్యాక్సిన్‌ రూపొందించిన సీరం ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా(ఎస్‌ఐఐ) సీఈవో అదార్‌ పూనావాలా కోరితే తగిన భద్రత కల్పిస్తామని బాంబే హైకోర్టుకు మహారాష్ట్ర సర్కారు శుక్రవారం తెలిపింది. ప్రభుత్వ స్పందన విన్నాక.. పుణెకు చెందిన ఈ పారిశ్రామికవేత్తకు మరింత భద్రత కల్పించాలన్న ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని కోర్టు మూసివేసింది. పూనావాలాకు ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ‘వై’ కేటగిరీ సీఆర్‌పీఎఫ్‌ భద్రత కల్పిస్తోంది. వ్యాక్సిన్‌ సరఫరాకు సంబంధించి బెదిరింపులు ఎదుర్కొంటున్న పూనావాలాకు ఈ భద్రత చాలదని, ‘జడ్‌ ప్లస్‌’ భద్రత కల్పించేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించాలని కోరుతూ న్యాయవాది దత్తా మానె ఈ పిల్‌ దాఖలు చేశారు.