NRI-NRT

అమెరికా అభిమానులతో కలిసి బాలయ్య జన్మదిన వేడుకలు

Nandamuri Balakrishna Celebrates Birthday Online With USA Fans

అమెరికాలో నందమూరి బాలకృష్ణ పుట్టిన రోజు వేడుకలు నాట్స్ మాజీ అధ్యక్షులు, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు మన్నవ మోహన్ కృష్ణ అద్వర్యం లో న్యూజెర్సీలో ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో భారీ సంఖ్యలో అభిమానులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బాలయ్య జూమ్ కాల్ లో అభిమానులతో తన ఆనందాన్ని పంచుకున్నారు. బాలయ్య తన అభిమానులను ఉదేశించి మాట్లాడుతూ అమెరికా అంతటా అభిమానులు ఎప్పుడు తన పట్ల చూపే అభిమానానికి కృతజ్ఞతలు తెలిపారు. తన సినిమాలకి మరియు బసవతారకం క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ కి అమెరికాలోని అభిమానులు అందించిన సహాయ సహకారాలకి ఎప్పుడు మరవలెను అన్నారు. అభిమానులు తన ప్రాణ సమణులు అని వాళ్ళ కోసం తాను చివర వరకు నటిస్తూనే ఉంటానని వెల్లడించారు. ఈ సమావేశంలో బాలకృష్ణ ప్రతి అభిమానితోనూ వ్యక్తిగతంగా మాట్లాడి వారి యోగ క్షేమాలు, వివరాలు తెలుసుకున్నారు.

మన్నవ మోహన్ కృష్ణ మాట్లాడుతూ హిందూపూర్ ఎంమ్మెల్యే గా, ఇటు బసవతారకం కాన్సర్ హాస్పిటల్ చైర్మన్ గా ఎన్నో సేవ కార్యక్రమాలు చేస్తూ, ప్రతి పేదవాడికి బాసటగా నిలిచారు అని కొనియాడారు. ఈ సందర్భంగా న్యూజెర్సీలో పెద్ద సంఖ్యలో హాజరైన అభిమానులు కేక్ కట్ చేశారు. బాలయ్య నటించిన సినిమాల్లోని డైలాగులు, పాటలు అభిమానుల్ని ఆహ్లాదపరిచాయి. శ్రీహరి మందాడి, వంశీ వెనిగళ్ల, రమేష్ నూతలపాటి, మోహన్ కుమార్ వెన్నిగళ్ల, రాధా కృష్ణ నల్లమల, ప్రతాప్ చింతపల్లి, శ్రీనివాస్ ఓరుగంటి, శ్రీ చౌదరి, రంజిత్ చాగంటి, రామకృష్ణ వాసిరెడ్డి ఈ కార్యక్రమం విజయవంతం చేయటంలో కృషి చేశారు.
అమెరికా అభిమానులతో కలిసి బాలయ్య జన్మదిన వేడుకలు
అమెరికా అభిమానులతో కలిసి బాలయ్య జన్మదిన వేడుకలు
అమెరికా అభిమానులతో కలిసి బాలయ్య జన్మదిన వేడుకలు
అమెరికా అభిమానులతో కలిసి బాలయ్య జన్మదిన వేడుకలు