Politics

కేసీఆర్‌పై నేను పోరాడుతా…

కేసీఆర్‌పై నేను పోరాడుతా…

సూర్యాపేట జిల్లా పర్యటనకు వచ్చిన వైఎస్ షర్మిల మేడారంలో నిరుద్యోగులతో ముఖాముఖి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సీఎం కేసీఆర్ సిగ్గుతో తలదించుకోవాలన్నారు. ఉద్యమంలో 1200 మంది ప్రాణాలు కోల్పోతే ప్రస్తుతం వందలమంది ఉద్యోగాల కోసం మళ్లీ ప్రాణాలు కోల్పోతున్నారని అన్నారు. రాష్ట్రంలో లక్షకు పైగా ఖాళీలు ఉన్నా ప్రభుత్వం ఎందుకు ఉద్యోగాల నోటిఫికేషన్ ఇవ్వడం లేదని ప్రశ్నించారు. ఎమ్మెల్యే సీటు ఖాళీ అయితే స్వార్థ రాజకీయాల కోసం శ్రద్ద చూపుతూ…. ఏడేళ్లుగా నిరుద్యోగుల కడుపు మీద కొడుతున్నారని తీవ్రస్థాయిలో విమర్శించారు. లక్షా 91 వేల ఉద్యోగాల నోటిఫికేషన్‌లను సీఎం కేసీఆర్ వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. పోరాటాల తెలంగాణ గడ్డపై కేసీఆర్‌తో కలిసి పోరాడుతానని.. ఎవరూ ఆత్మహత్యలు చేసుకోవద్దని షర్మిల పిలుపు ఇచ్చారు.