Movies

ఈ 14మంది నన్ను లైంగికంగా వేధించారు

ఈ 14మంది నన్ను లైంగికంగా వేధించారు

మలయాళ చిత్ర పరిశ్రమలో క్యాస్టింగ్‌ కౌచ్‌ వివాదం మరోసారి తెరపైకి వచ్చింది. పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు తనని మానసికంగా, లైంగికంగా వేధింపులకు గురి చేశారంటూ యువ కథానాయిక రేవతి సంపత్‌ తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ మేరకు ఆమె తాజాగా సోషల్‌మీడియా వేదికగా తనని ఇబ్బంది పెట్టిన 14మంది పేర్లను బయటపెట్టారు. దర్శకుడు రాజేశ్‌ టచ్‌రైవర్, నటుడు సిద్దిఖీతోపాటు పలువురు అధికారుల పేర్లు ఇందులో ఉండటంతో మలయాళీ ఇండస్ట్రీ ఒక్కసారిగా షాకయ్యింది.

‘రాజేశ్‌ టచ్‌రైవర్‌(దర్శకుడు), సిద్దిఖీ(నటుడు), ఆషిఖ్‌ మహి(ఫొటోగ్రాఫర్‌), షిజు(నటుడు), అభిల్‌దేవ్‌(కేరళ ఫ్యాషన్‌ లీగ్‌ ఫౌండర్‌), అజయ్‌ ప్రభాకర్‌(వైద్యుడు), ఎంఎస్‌ పధుష్‌, సురభ్‌ కృష్ణన్‌, నందు అశోకన్‌, మ్యాక్స్‌వెల్‌ జోస్‌(షార్ట్‌ ఫిల్మ్‌ డైరెక్టర్‌), షానుబ్‌ (యాడ్‌ ఫిల్మ్‌ డైరెక్టర్‌), రగేండ్‌ పాయ్‌(క్యాస్టింగ్‌ డైరెక్టర్‌), బిను(ఎస్సై), శరన్‌ లీ (బ్యాంక్‌ ఏజెంట్‌).. వీళ్లందరూ నన్ను మానసికంగా, శారీరకంగా, లైంగికంగా వేధింపులకు గురిచేశారు. ఈరోజు వీళ్ల పేర్లు బయటపెట్టడానికి కూడా నేను ఎంతో భయపడుతున్నాను’ అని రేవతి పోస్ట్‌ పెట్టారు.

2019లో విడుదలైన ‘పట్నాఘర్‌’ అనే మలయాళీ చిత్రంతో రేవతి సంపత్‌ నటిగా ఎంట్రీ ఇచ్చారు. ‘వాఫ్ట్‌’ అనే షార్ట్‌ ఫిల్మ్‌లో ఆమె నటనకు మంచి మార్కులు పడ్డాయి. రేవతి కేవలం నటిగా మాత్రమే కాకుండా ఒక సామాజిక కార్యకర్తగా, మనస్తత్వవేత్తగా కూడా అక్కడి ప్రేక్షకులకు చేరువయ్యారు.