Politics

నానీ…నోటికి ఏమి తింటున్నాడో-నేరవార్తలు

నానీ…నోటికి ఏమి తింటున్నాడో-నేరవార్తలు

* మంత్రి కొడాలి నానీ మాట తీరు, ప్రవర్తన, నడవడిక చూసిన వారంతా ఆయనకు పిచ్చిపట్టిందేమోనని అనుకుంటున్నారని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి దివ్యవాణి అన్నారు. నారా లోకేశ్ మాటతీరు, శరీర తీరు, చూశాక నానీకి మతిపోయినట్టుందని ఎద్దేవా చేశారు. ఏపీ ప్రజలైతే సరికొత్త లోకేశ్‌ను చూసి, స్వర్గీయ ఎన్టీఆర్‌లా ఉన్నాడంటున్నారని ఆమె పేర్కొన్నారు. తండ్రి వయసున్న చంద్రబాబుని, లోకేశ్‌ని విమర్శిస్తే, బూతులు తిడుతున్న నానీ, ముందు తానేం తింటున్నాడో తెలుసుకోవాలని నానీకి దివ్యవాణి హితవు పలికారు. హూ కిల్డ్ బాబాయి అనే ప్రశ్నకు, కోడికత్తి ఘటనకు సమాధానం చెప్పగల ధైర్యం కొడాలికి ఉందా అని ఆమె ప్రశ్నించారు. వివేకా హత్యకేసు విచారణ వేగవంతమైన తరుణంలోనే, కేసుతో సంబంధమున్నవారంతా ఆసుపత్రుల్లో ఎందుకు చేరుతున్నారో నానీ చెప్పాలని దివ్యవాణి డిమాండ్ చేశారు. వివేకానందరెడ్డి కుమార్తె సునీత ఈ రాష్ట్రంలో తనకు రక్షణ లేదన్న వ్యాఖ్యలపై నానీ ఏం చెబుతాడని ఆమె నిలదీశారు. గతంలో చంద్రబాబునాయుడు రూ.6లక్షల కోట్ల అవినీతికి పాల్పడ్డాడని మొరిగిన వారంతా ఇప్పుడెందుకు నోరెత్తడం లేదో నానీకి తెలుసా అని ఆమె సూటిగా ప్రశ్నించారు. పోలవరంలో అవినీతి, అమరావతి భూముల్లో ఇన్‌సైడ్ ట్రేడింగ్ అన్నగొంతులు ఇప్పుడెందుకు మూగబోయాయో నానీయే చెప్పాలని దివ్యవాణి డిమాండ్ చేశారు.

* ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం రేగళ్లపాడు గ్రామ శివార్ల లోని ఆటవి ప్రాంతం లో అటవీ జంతువుల కోసం వేటగాళ్లు అమర్చిన విద్యుత్ తగిలి రెండు అడవి దున్నులు మృతి చెందాయి.అయితే అడవి దున్నలు మృతి చెందిన విషయాన్ని బయటకు తెలియకుండా కార్పొరేషన్ అధికారులు గోప్యంగా ఉంచుతున్నారు అని స్థానికులు ఆరోపిస్తున్నారు.విషయం అధికారులకు తెలిసినప్పటికీ విచారణ చేపట్టకుండా కార్పొరేషన్ అధికారులు అలసత్వం వహిస్తున్నారు.

* కర్నూలు జిల్లా పోలీసులు నకిలీ పత్తి విత్తనాలు, వాటికి సంబంధించిన కవర్లు తయారుచేసే ముఠాను అరెస్టు చేసినట్లు జిల్లా ఎస్పీ పకీరప్ప జిల్లా పోలీసు కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో ఎస్పీ మాట్లాడుతూ ఆదోని మండలం చిన్న పెండేకల్ గ్రామం చెందిన వెంకటేష్, జయరాముడు నకిలీ పత్తి విత్తనాలను తరలిస్తుండగా ఆదోని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారించగా. గోనెగండ్ల మండలం చెందిన సుబ్బారెడ్డి నకిలీ పత్తి విత్తనాల కవర్లను అమ్ముతున్నారని విచారణలో తెలుసుకొని వారిని అరెస్ట్ చేయగా హైదరాబాద్ కు చెందిన కపిశ్వర్ రోటో ప్యాకింగ్ ప్రైవేట్ లిమిటెడ్ పేరు బయటకు వచ్చింది. ఆ కంపెనీ సీఈవో బోడుగ సురేష్ ను అరెస్ట్ చేసి. ఇలాంటి వ్యక్తులు రైతులను మోసం చేస్తూ నకిలీ పత్తి విత్తనాలు తయారుచేసి ఇలాంటి వారిపై పి.డి యాక్ట్ కింద కేసు నమోదు చేసి రిమాండ్కు తరలిస్తున్నట్లు తెలిపారు.

* తాడేపల్లి మండలం ఉండవల్లి కరకట్ట MSR ఆశ్రమం సమీపంలో మందడం నుండి విజయవాడ వైపు వెళుతున్న కార్ లోటస్ హోటల్ నుండి మందడం వైపు వెళుతున్న స్కూటీని ఢీకొట్టడంతో సంఘటన స్థలంలో ఇద్దరుచనిపోయారు,మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది వారిని 108 అంబులెన్స్ ద్వారా విజయవాడ గవర్నమెంట్ హాస్పిటల్ కి తరలించారు. తాడేపల్లి పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు.

* భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట రాష్ట్రీయ చెక్ పోస్ట్ వద్ద బొలెరో వాహనంలో ఆంధ్రా నుంచి తెలంగాణ కు తరలిస్తున్న సుమారు కోటి 20 లక్షల రూపాయల విలువగల ఆరున్నర క్వింటాళ్ల గంజాయిని స్వాధీనం చేసుకొని నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు.