NRI-NRT

అమెరికా వచ్చే విద్యార్థులకు కోవిద్ సూచనలు

అమెరికా వచ్చే విద్యార్థులకు కోవిద్ సూచనలు

విదేశాల నుంచి వచ్చే విద్యార్థులకు కొవిడ్‌ నిబంధనల నుంచి కొన్ని మినహాయింపులను యూఎస్‌ సెక్రటరీ ఆఫ్‌ స్టేట్‌ ప్రకటించింది. ఈ సందర్భంగా అమెరికా వెళ్లే విద్యార్థులు గుర్తుంచుకోవాల్సిన కొన్ని విషయాల గురించి తెలుసుకుందాం.

* తమ ఎకడమిక్‌ ప్రోగ్రామ్‌ (ఆప్షనల్‌ ప్రాక్టికల్‌ ట్రెయినింగ్‌తో పాటు) ను ఆగస్టు 1, 2021న గానీ, ఆ తర్వాత గానీ ప్రారంభించే విద్యార్థులు ఎన్‌ఐఈ (నేషనల్‌ ఇంటరెస్ట్‌ ఎక్సెప్షన్‌)కు అర్హులవుతారు. ఆగస్టు 1న గానీ, ఆ తర్వాత గానీ కోర్సును ఆరంభించటానికీ గానీ, కొనసాగించటానికి గానీ ప్రణాళిక వేసుకునే విద్యార్థులు ప్రయాణానికి ఎన్‌ఐఈ కోసం ఎంబసీ/ కాన్సులేట్‌ కార్యాలయాన్ని సంప్రదించాల్సిన అవసరం లేదు.

* ఆగస్టు 1, 2021కి ముందు కోర్సులో చేరే విద్యార్థులు అందుబాటులో ఉండే ఆప్షన్ల కోసం సంబంధిత విద్యా సంస్థలను సంప్రదించాలి.

* యూఎస్‌ సెంటర్స్‌ ఫర్‌ డిసీజ్‌ కంట్రోల్‌ అండ్‌ ప్రివెన్షన్‌ నిబంధనల ప్రకారం విదేశాల నుంచి వచ్చిన విద్యార్థులు 3-5 రోజుల లోపల వైరల్‌ పరీక్ష చేయించుకోవాలి. వారంపాటు సెల్ఫ్‌ క్వారంటైన్‌లో ఉండాలి.
వాక్సినేషన్‌ వేయించుకున్నట్టుగా రుజువు చూపించమని యూఎస్‌ ప్రభుత్వం కోరడం లేదు. కానీ అమెరికాలోని కొన్ని కళాశాలలు విదేశీ విద్యార్థులకు వ్యాక్సినేషన్‌ తప్పనిసరి అంటున్నాయి. దీనికి తగినట్టుగానే భారత ప్రభుత్వం కూడా విదేశాలకు వెళ్లే విద్యార్థులకు ముందుగా వాక్సిన్‌ వేయడానికి ప్రాధాన్యమిస్తోంది.