DailyDose

దేవుడు చెప్పాడని బాలికకు తాళి కట్టిన పాస్టర్-నేరవార్తలు

దేవుడు చెప్పాడని బాలికకు తాళి కట్టిన పాస్టర్-నేరవార్తలు

* దేవుడు ఆజ్ఞాపించాడని బాలికకు తాళి కట్టిన పాస్టర్ టెక్నాలజీ ఎంత పెరుగుతున్నా మూఢనమ్మకాలు ప్రజలను వదలట్లేదు.దాన్ని ఆసరాగా తీసుకుంటున్న దొంగ బాబాలు, దొంగ పాస్టర్లు ఇష్టామొచ్చినట్టుగా వ్యవహరిస్తూ అమాయకులను దోచుకుంటున్నారు.తాజాగా దేవుడు తనను ఆజ్ఞాపించాడని చెప్పి బాలికకు ఓ దొంగ పాస్టర్ తాళి కట్టాడు.ఈ ఘటన కర్ణాటకలో జరగగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం……బాలికను వివాహం చేసుకోవాలని తనను దేవుడు ఆజ్ఞాపించాడని చర్చి పాస్టర్ జనప్ప మాయమాటలు చెప్పి మే 14న బాలికకు తాళికట్టాడు.దాంతో షాక్కు గురైన ఆ అమ్మాయి అక్కడే అపస్మారక స్థితిలోకి వెళ్లింది.అక్కడే ఉన్న బాలిక తల్లి కూడా ఇదంతా చూసి షాక్ కు గురైంది.ఈ నెల 16న ఆ ఘటనపై అందిన ఫిర్యాదుతో పోక్సో చట్టం కింద పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.దొంగ పాస్టర్ జనప్ప పరారీలో ఉన్నాడు.

* ఆగి ఉన్న రెండు కార్లను మరో కారులో వస్తున్న వ్యక్తి మద్యం మత్తులో ఢీ కొట్టారు.దీంతో సమీపంలోని ఇంటి ప్రహరీ గోడను ఢీ కొడుతూ కార్లు ఇంట్లోకి దూసుకెళ్లాయి. ఇందులో ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి.ఈ ఘటన మండలంలోని ఘన్‌పూర్‌ బస్టాండ్‌ పరిధిలో ఆదివారం చోటుచేసుకుంది.స్థానికులు, పోలీసుల వివరాల ప్రకారం……..రెండు కార్లను రోడ్డు పక్కన నిలిపి మాట్లాడుకుంటూ నిల్చొన్న ముగ్గురి పైకి మాచారెడ్డి వైపు నుంచి వస్తున్న మరో కారు వచ్చి అమాంతం ఢీ కొట్టడంతో దగ్గరలో ఉన్న ఇంట్లోకి చొచ్చుకుపోయాయి.ఇందులో కాకులగుట్ట తండా సర్పంచి హెమ్ల నాయక్‌, ఉపసర్పంచి నరేశ్‌, గజ్యానాయక్‌ తండాకు చెందిన ఎల్లాగౌడ్‌లకు తీవ్ర గాయాలయ్యాయి.వారిని కామారెడ్డిలో ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు.కారు డ్రైవర్‌ మద్యం మత్తులో ఉండడంతో ఈ ఘటన జరిగిందని స్థానికులు తెలిపారు.

* మొన్న రాత్రి కృష్ణా నది పరివాహక ప్రాంతంలో యువతి పై జరిగిన ఘటన అత్యంత హేయం, బాధాకరం – ఎపి డి‌జి‌పి ఈ ఘటనకు బాధ్యులైన నిందితులను పట్టుకునేందుకు తక్షణ చర్యలు చేపట్టాల్సిందిగా ఇప్పటికే కృష్ణ, గుంటూరు జిల్లా ఎస్పీలు, విజయవాడ కమిషనర్ ల కు ఆదేశాలు జారీ: డి‌జి‌పి ఇటువంటి అమానవీయ చర్యలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించేది లేదు: డిజిపి నేరానికి పాల్పడిన నిందితులు ఎంతటివారైనా ఎట్టి పరిస్థితిలో వదిలిపెట్టే ప్రసక్తి లేదు: డి‌జి‌పి మహిళల భద్రత మా ప్రధమ కర్తవ్యం. ఎన్నో చర్యలు చేపట్టినా, ఇటువంటి ఘటనలు జరగడం దురదృష్టకరం – డీజీపీ ప్రతి మహిళ దిశ యాప్ ను ఖచ్చితంగా వాడేలా చర్యలు – డీజీపీ

* తాడేపల్లి అత్యాచార ఘటన బాధితురాలిని పరామర్శించిన మంత్రులు సుచరిత, తానేటి వనిత….సీఎం జగన్ మోహన్ రెడ్డి ఆదేశాలతో పరామర్శించడానికి వచ్చిన మహిళా మంత్రులు….గుంటూరు జిజిహెచ్ లో చికిత్స పొందుతున్న భాదితురాలితో మాట్లాడిన హోంమంత్రి సుచరిత….ఈ ఘటనను హేయమైన చర్యగా ఖండించిన హోంమంత్రి మేకతోటి సుచరిత…నిందితులకు కఠినమైన శిక్ష పడేలా చర్యలు తీసుకుంటామన్న హోం మినిస్టర్…ఇప్పటికే నిందితుల కోసం మూడు ప్రత్యేక బృందాలు గలిస్తున్నాయన్న హోంమంత్రి…సీఎం గారు భాదితురాలికి తక్షణ సహాయంగా 5 లక్షల నష్టపరిహారం ప్రకటించనట్లు తెలిపిన సుచరిత…మహిళా శిశు సంక్షేమ శాఖ తరుపున 50 వేల సహాయం అందించిన మంత్రి తానేటి వనిత….ఈ ఘటనలకు పాల్పడిన నిందితులపై కఠినచర్యలు తీసుకోవాలని పోలీసులను ఆదేశించిన హోం మినిస్టర్…భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా ప్రత్యేక చర్యలు తీసుకుంటామన్న హోంమంత్రి సుచరిత.