NRI-NRT

న్యూజెర్సీలో యోగా దినోత్సవం

2021 International Yoga Day In New Jersey Sai Peetham

న్యూజెర్సీలోని సాయి దత్త పీఠం అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని శ్రీ శివ, విష్ణు ఆలయ ప్రాంగణంలో నిర్వహించారు. యోగా శిక్షకురాలు డా.విజయ నిమ్మ యోగా ఆవశ్యకతను వివరించారు. ప్రవాసులతో పలు యోగాసనాలు వేయించారు. సాయి దత్త పీఠం గురుకులంలో యోగా శిక్షకురాలు అంతర్జాతీయ యోగా దినోత్సవం సాయి దత్త పీఠంలో జరపడంతో పాటు నైబర్ హుడ్ హెల్త్ సర్వీసెస్ కార్పొరేషన్‌లో కూడా యోగా దినోత్సవాన్ని చేయడం పట్ల సాయి దత్త పీఠం నిర్వాహకులు రఘుశర్మ శంకరమంచి హర్షం వ్యక్తం చేశారు. యోగా దినోత్సవం నాడు అందరికి యోగాపై అవగాహన కల్పించినందుకు డా.విజయ నిమ్మకు ధన్యవాదాలు తెలిపారు.