NRI-NRT

మాపైన తప్పుడు అభియోగాలు మోపారు:ఎన్నారై డైరక్టర్లు-నేరవార్తలు

మాపైన తప్పుడు అభియోగాలు మోపారు:ఎన్నారై డైరక్టర్లు-నేరవార్తలు

* పిటిషనర్లను అరెస్టు చేయవద్దని హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఎన్‌ఆర్‌ఐ ఆస్పత్రి వ్యవహారంపై హైకోర్టులో హౌస్‌మోషన్‌ పిటిషన్‌ దాఖలైంది.మంగళగిరి ఎన్​ఆర్​ఐ ఆస్పత్రి వ్యవహారంలో డైరెక్టర్లు నిమ్మగడ్డ ఉపేంద్రనాథ్‌, మణి అక్కినేని, రాఘవరావు హైకోర్టును ఆశ్రయించారు. హౌస్‌మోషన్‌ పిటిషన్‌ దాఖలు చేశారు.ఇవాళ్టి బోర్డు మీటింగ్‌కు హాజరుకాకుండా కొందరు డైరెక్టర్లు అడ్డుకున్నారని పేర్కొన్నారు.తమపై తప్పుడు అభియోగాలతో పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేశారని తెలిపారు.ఈ హౌస్‌ మోషన్‌ పిటిషన్‌పై విచారణ జరిపిన హైకోర్టు ధర్మాసనం.. పిటిషనర్లపై అరెస్టు సహా ఎలాంటి తొందరపాటు చర్యలు చేపట్టవద్దని మంగళగిరి పోలీసులను ఆదేశించింది.

* గుంటూరు జిల్లా: ఎన్నారై అకాడమీ ఆఫ్ సైన్సెస్ (ఆసుపత్రి) నందు గురువారం కార్యవర్గ సమావేశం జరిగింది..డాక్టర్ నర్సారాజు చైర్మన్ గా నూతన పాలక వర్గం ఎన్నికైంది.నర్సరాజు కామెంట్స్:నూతనంగా ఎన్నికైన పాలకవర్గం వివాదాల్ని పరిష్కరిస్తుంది.ఆర్ధిక లావాదేవీలకు సంబంధించి వివాదాలను పరిష్కరించుకునేందుకే జనరల్ బాడీ మీటింగ్ కు పిలుపునివ్వటం జరిగింది.దురదృష్టవశాత్తూ మేనేజ్మెంట్ లో ఉన్న వారెవరూ సమావేశానికి హాజరు కాలేదు.ఆర్ధిక పరమైన అంశాలకు సంబంధించి పోలీస్ కంప్లైంట్లు ఉన్నందున పాత కార్యవర్గాన్ని ప్రక్కన పెట్టి క్రొత్త కార్యవర్గం కొనసాగించేందుకు నిర్ణయించాం సమావేశానికి 19 మంది మెజారిటీ సభ్యులు హాజరయ్యారు.

* సంతమాగులూరు మండలం కామేపల్లిలో గ్రామంలో టిడిపి కార్యకర్తలపై వైసిపి వర్గీయుల దాడి.దాడిలో టీడీపీ వర్గీయుడు లక్కీ పోగు సుబ్బారావు మృతి, పలువురికి తీవ్ర గాయాలు.గాయపడ్డ వారిని నరసరావుపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు.అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవి సూచన మేరకు దాడిలో గాయపడిన వారిని హుటాహుటిన వెళ్లి నరసరావుపేట ప్రభుత్వ ఆసుపత్రిలో పరామర్శించిన నరసరావుపేట నియోజకవర్గం టిడిపి నేత డా౹౹చదలవాడ అరవింద బాబు.గ్రామాలలో టిడిపి కార్యకర్తలపై వైసిపి వర్గీయులు దాడులు జరుగుతున్న నేపథ్యంలో గ్రామాలలో శాంతియుత వాతావరణం ఉండే విధంగా పోలీసు అధికారులు చర్యలు చేపట్టాలని డా౹౹చదలవాడ కోరారు.

* తిరుపతి…ఉరి వేసుకొని యువకుడు ఆత్మహత్య.జీవకోన లోని రాజీవ్ గాంధీ నగర్ లో ఘటన.ఆటో డ్రైవర్ రమణ చిన్న కుమారుడు సాయి సందీప్(19) గా పోలీసులు గుర్తింపు.ప్రేమించి పెళ్లి చేసుకున్న యువతితో కుటుంబ గొడవలు.చెడు అలవాట్లకు బానిసై జీవనోపాధి లేక ఆర్థిక ఇబ్బందులు.ఇంటిలో ఎవరు లేకపోవడంతో ఉరివేసుకొని మృతి.మృతదేహాన్ని తిరుపతి రుయా ఆస్పత్రికి తరలింపు.కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న అలిపిరి ఎస్ ఐ పరమేశ్వర నాయక్.

* జగన్ అక్రమాస్తులను ప్రభుత్వ ఖజానాకు జమ చేయాలని తెలుగుదేశం సీనియర్‌ నేత యనమల రామకృష్ణుడు డిమాండ్ చేశారు.

* గుంటూరు జిల్లాకు…తెలంగాణ ప్రాంతం నుండి మద్యం తరలిస్తున్నారని పోలీసులకు సమాచారం.!అతివేగంగా వెళ్తున్న రెండు కార్లను వెంబడించిన పోలీసులు.అచ్చంపేట మండలం చెరుకుంపాలెం వద్ద కార్లు వదిలి అటవీప్రాంతంలోకి పారిపోయిన దుండగులు.రెండు కార్లు స్వాధీనం చేసుకుని దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు.

* అచ్చెన్నాయుడు గారి సోదరుడి పైన,కుటుంబ సభ్యులపైన రౌడి షీట్ లు ఓపెన్ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం:మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి.