Health

తిరుపతిలో డెల్టా ప్లస్ కేసు-TNI కోవిద్ బులెటిన్

తిరుపతిలో డెల్టా ప్లస్ కేసు-TNI కోవిద్ బులెటిన్

* హైదరాబాద్ ఖాజాగూడాలో డాక్టర్ అభినవ్ రావు తంగెడ అధునాతన హంగులతో నెలకొల్పిన “శంతను “డయాగ్నిస్టిక్ క్లినిక్‌ను శ్రీ శ్రీ శ్రీ త్రిదండి చినజీయర్ స్వామి శుక్రవారం ప్రారంభించారు . ప్రతీరోజు వ్యాయామం , సమతుల ఆహారం తీసుకుంటే మన శరీరాన్ని , మనసును ప్రశాంతంగా ఉంచుకోవచ్చునని చిన్నజీయర్‌స్వామి ఈ సందర్భంగా అన్నారు. అందరి ఆరోగ్యం కోరి లాభాపేక్ష లేకుండా డాకర్ అభినవ్‌రావు చక్కటి క్లినిక్ ఏర్పాటు చేయటం అభినందనీయమని చిన్నజీయర్ స్వామి ప్రశంసించారు.

* ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో వైఎస్ షర్మిల పర్యటిస్తున్నారు. అల్మాస్‌పురాలో కోవిడ్ బాధిత కుటుంబాలను వైఎస్‌ షర్మిల శుక్రవారం పరామర్శించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. కోవిడ్ చికిత్సను ఆరోగ్యశ్రీలో చేర్చాలని డిమాండ్‌ చేశారు. తెలంగాణలో పేదలకు ఆరోగ్యశ్రీ అందడంలేదని ఆరోపించారు. పేదల ఆరోగ్యంపై ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని విమర్శించారు. కోవిడ్ మృతుల కుటుంబాలకు రూ.5లక్షల పరిహారం ఇవ్వాలని డిమాండ్‌ చేశారు.

* తిరుపతిలో ఒక డెల్టా ప్లస్ కేసు గుర్తించామని మంత్రి ఆళ్ల నాని తెలిపారు.బాధితునికి చికిత్స కూడా పూర్తైందని ఆయన అన్నారు.రాష్ట్రంలో కొవిడ్ పరిస్థితిపై చర్చించామని లాక్‌డౌన్‌ అంశంపై వచ్చే సమావేశంలో నిర్ణయం తీసుకుంటామని పేర్కొన్నారు.కొవిడ్‌ థర్డ్‌ వేవ్‌ వచ్చినా సిద్ధంగా ఉండాలని సీఎం ఆదేశించారని వెల్లడించారు.బ్లాక్ ఫంగస్, డెల్టా ప్లస్ కేసుల పట్ల అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు.

* బ్లాక్ ఫంగస్ మెడిసిన్ ను బ్లాక్ లో విక్రయించే ముఠా గుట్టురట్టు చేసిన తిరుపతి పోలీసులు.పది మందికి అరెస్ట్ చేసి 50 లిపోసోమల్ అంఫోతెరిసిన్ ఇంజెక్షన్లు సీజ్ .విలేకర్ల సమావేశంలో అర్బన్ జిల్లా ఎస్పీ వెంకట అప్పలనాయుడు.పదిమంది మెడికల్ డిపార్ట్మెంట్ అనుబంధం ఉన్నవారే…చెన్నై నుంచి ఇంజక్షన్లు సరఫరా అవుతున్నాయి ..ఈలింకు కోసం విచారణ చేపడుతాం.తమిళనాడు డ్రగ్ కంట్రోల్ అధికారులతో చర్చించి అప్రమత్తం చేశాం.పది మందికి రిమాండ్ కు తరలిస్తున్నామని..వీరిని కస్టడీ కి తీసుకొని మరింత లోతుగా విచారణ చేపడుతాం.వీరిని పట్టుకోవడంలో శ్రద్ద చూపిన పోలీసులకు అవార్డులు ప్రకటిస్తాం.