DailyDose

బెజవాడ అగ్రహారంలో దారుణ హత్య-నేరవార్తలు

బెజవాడ అగ్రహారంలో దారుణ హత్య-నేరవార్తలు

* అగ్ర‌రాజ్యం అమెరికాలో ఘోర ప్ర‌మాదం జ‌రిగింది. ఫ్లోరిడా రాష్ట్రం మియామీలో ప‌న్నెండు అంతస్తుల భవనంలో కొంతభాగం కుప్పకూలింది.గురువారం తెల్ల‌వారుజామున 1.30 గంట‌ల‌కు(అమెరికా కాల‌మానం ప్ర‌కారం) ఈ ప్ర‌మాదం చోటు చేసుకుంది.ఈ దుర్ఘ‌ట‌న‌లో ఒకరు చనిపోగా, ఇప్ప‌టివ‌ర‌కు 102 మంది ఆచూకీ ల‌భ్య‌మైన‌ట్లు మియామీ డెడ్ కౌంటీ మేయ‌ర్ డానియెల్లా లెవైన్ కావా వెల్ల‌డించారు.మ‌రో 99 మంది వ‌ర‌కు శిథిలాల కింద చిక్కుకుపోయి ఉండొచ్చ‌ని మియామీ డెడ్ పోలీస్ అధికార ప్ర‌తినిధి అల్వెరో జ‌బ‌లెటా తెలిపారు.వారిని రక్షించేందుకు రెస్క్యూ సిబ్బంది సహాయక చర్యలు కొనసాగిస్తున్నాయ‌న్నారు.చాంప్లైన్ ట‌వ‌ర్స్‌ పేరిట పిలువ‌బ‌డే ఈ బ‌హుళా అంత‌స్తుల భ‌వ‌నంలోని మొత్తం 136 యూనిట్ల‌లో 55 యూనిట్లు కుప్ప‌కూలిన‌ట్లు స‌మాచారం.

* జగన్‌ కేసుల్లో ప్రాసిక్యూషన్ ఉపసంహరణపై హైకోర్టులో విచారణ జరిగింది.అడ్మినిస్ట్రేటివ్‌ కమిటీ నివేదికను తమ ముందు ఉంచాలని రిజిస్ట్రీకి ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది.కమిటీ నివేదికను సీల్డ్‌ కవర్‌లో సమర్పించాలని సూచించింది.నివేదిక ఆధారంగా ఉత్తర్వులు ఇస్తామని ధర్మాసనం పేర్కొంది.సీఎం జగన్​పై అనంతపురం, గుంటూరు జిల్లాలో గతంలో దాఖలైన కేసుల్లో ప్రభుత్వం ప్రాసిక్యూషన్ ఉపసంహరించుకోవడాన్ని హైకోర్టు సుమోటోగా తీసుకుంది.

* వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో 19వ రోజు సీబీఐ విచారణ జరుపుతున్నారు.కడప కేంద్ర కారాగారంలోని అతిథి గృహంలో సింహాద్రిపురం మండలానికి చెందిన వైకాపా నాయకుడు సుధాకర్ రెడ్డితో పాటు మరొకరిని అధికారులు ప్రశ్నిస్తున్నారు.గత కొద్ది రోజులుగా సీబీఐ అధికారులు కడప కారాగారంలోని అతిథి గృహంలో అనుమానితులను విచారిస్తున్నారు.

* విజయవాడ దుర్గ అగ్రహారంలో దారుణం.పట్టపగలు నడిరోడ్డుపై కత్తులతో సైరవిహారం.అతి దారుణం ఒక వ్యక్తిని కత్తులతో నరికి చంపిన గుర్తు తెలియని వ్యక్తులు.హతుడు అక్కడక్కడే మృతి.సంఘటన స్థలానికి చేసుకున్న పోలీసులు, క్లూస్ టీం.స్థానికంగా ఉన్న సీసీఫుటేజ్ ను పరిశీలిస్తున్న పోలీసులు.

* ప్రకాశం జిల్లా మండల కేంద్రమైన పుల్లలచెరువు లోని ప్రభుత్య మద్యంషాపులో గురువారం కొందరు మద్యంప్రియులు “మ్యాన్షన్ హౌస్” బాటిళ్లను కొనుగోలు చేశారు.గ్లాసులు, నీళ్లు, స్టఫ్ తీసుకుని తాగేందుకు సమాయత్తమయ్యారు.తీరా మందుబాటిల్ ను ఓపెన్ చేసేందుకు ప్రయత్నించగా అందులో విషాపురుగైన తేలు ( వృచ్చికం) కనిపించింది.దీంతో సదరు మందుబాబులు అవాక్కయ్యారు. తీవ్ర భయాందోళనకు గురయ్యారు.సాధారణంగా కల్తీ మందును చూస్తుంటాం, చెత్తమందును చూసుంటాం, చెత్త బ్రా0డులను చూస్తుంటాం.అయితే ఇలా విషపుగులు వుండటమేమిటని ప్రశ్నిస్తున్నారు.