Health

ఇండియాలో వ్యాప్తి చెందుతున్న డెల్టా వేరియంట్-TNI కోవిద్ బులెటిన్

ఇండియాలో వ్యాప్తి చెందుతున్న డెల్టా వేరియంట్-TNI కోవిద్ బులెటిన్

* కరోనా వైరస్‌ బారిన పడిన కొందరు బాధితులు చికిత్స పొందుతూ ఆస్పత్రుల నుంచి పారిపోయిన వార్తలను చూశాం.అయితే తాజాగా కోవిడ్‌ పాజిటివ్‌గా నిర్ధారణ అయి చికిత్స పొందుతున్న ఓ ఖైదీ ఆస్పత్రి నుంచి పారిపోవటం అస్సాంలోని కర్బీ జిల్లాలో కలకలం రేపుతోంది.వివరాల్లోకి వెళ్తే……….అస్సాంలోని కర్బీ జిల్లాలో ఓ ఖైదీకి కరోనా వైరస్‌ సోకడంతో గురువారం మధ్యాహ్నం డిఫు మెడికల్ కాలేజీ ఆస్పత్రిలో చేర్పించారు.అతనికి ఆస్పత్రి వైద్యులు కోవిడ్‌ వార్డులో కరోనా చికిత్స అందిస్తున్నారు.ఈ క్రమంలో శుక్రవారం రాత్రి కోవిడ్‌ వార్డులో ఆ ఖైదీ కనిపించలేదు.దీంతో అనుమానం వచ్చిన వైద్యులు పోలీసులకు సమాచారం అందించారు.ఆస్పత్రికి చేరుకున్న పోలీసులు ఆ ఖైదీ కోవిడ్‌ వార్డు నుంచి పారిపోయినట్ల తెలిపారు.

* రాబోయే కాలంలో రానున్న గొప్ప సినిమా టైటిల్స్

1. అక్కడ కోవీషీల్డ్ ఇక్కడ కోవాగ్జిన్
2. ఆ ఒక్క డోస్ అడక్కు
3. కృష్ణగాడి వీర వ్యాక్సిన్ గాథ
4. హలో గురు వ్యాక్సిన్ కోసమే
5. వ్యాక్సిన్ కేంద్రానికి దారేది
6. మళ్లీ మళ్లీ ఇది దొరకని డోసు
7. రారండోయ్ వ్యాక్సిన్ వేయించుకుందాం
8. సర్కారివారి పాట..లక్ష డోసులు
9. అల వుహాన్ పురంలో
10. జోంబీ వైరస్
11. వైరస్ చిన్నోడు..వ్యాక్సిన్ చిన్నది
12. వాళ్ళిద్దరికీ ఒకటే మాస్క్
13. మిడిల్ క్లాస్ వ్యాక్సిన్ ముచ్చట్లు
14. ఆక్సిజన్ లేని ప్రేమలు
15. కలర్ ఫంగస్
16. వ్యాక్సిన్ లో వైకుంఠం
17. నమో వేక్సినాయ
18. కోవిడ్ పిలిచింది.
19. క్వారంటైన్ పార్క్
20. వ్యాక్సిన్ దూత

* రాష్ట్రంలో కోటి డోసులు అందించిన వైద్యారోగ్య శాఖకు గవర్నర్‌ తమిళిసై సౌందర్‌ రాజన్‌ శుభాకాంక్షలు తెలిపారు.రాష్ట్రంలో లక్ష్యం మేరకు టీకా కార్యక్రమం కొనసాగుతున్నదని చెప్పారు.నగరంలోని వెంగళ్‌రావునగర్‌లో ఏర్పాటు చేసిన కొవిడ్‌ కమాండ్‌ సెంటర్‌ను గవర్నర్‌ తమిళిసై సందర్శించారు.కొవిడ్‌ కమాండ్‌ సెంటర్‌ ఏర్పాటు ప్రభుత్వ గొప్ప ఆలోచన అని ప్రశంసించారు.ఇందులో ఉన్న వార్‌ రూమ్‌, కాల్‌ సెంటర్‌ ద్వారా అవసరమైనవారికి వైద్య సేవల సాయం అందిస్తున్నారని చెప్పారు.కరోనా మూడో దశను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలని సూచించారు.

* ఒడిశాలో కోవిడ్-19 డెల్టా ప్లస్ వేరియంట్‌కు సంబంధించిన‌ మొదటి కేసు డియోఘర్ జిల్లాలో వెలుగు చూసింది.ఈ నేప‌ధ్యంలో కరోనా వైరస్ క‌ట్ట‌డి నియ‌మాల‌ను ఉల్లంఘించ‌వ‌ద్ద‌ని ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ప్రజలను హెచ్చరించారు.డియోఘర్ జిల్లాలోని కరోనా డెల్టా ప్లస్ వేరియంట్‌ కేసు న‌మోదు గురించి నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ (ఎన్ సీడీసీ) ఒడిశా ప్రభుత్వానికి సమాచారం అందించిందని రాష్ట్ర వైద్య విద్య, శిక్షణ డైరెక్టరేట్ (డీఎంఈటీ) హెడ్‌ ప్రొఫెసర్ సీబీ కె మొహంతి తెలిపారు.