Health

ఇండియాలో 32కోట్ల డోసుల వితరణ-TNI కోవిద్ బులెటిన్

ఇండియాలో 32కోట్ల డోసుల వితరణ-TNI కోవిద్ బులెటిన్

* దేశంలో కొత్తగా 50వేల కేసులు.. 58వేల రికవరీలు..దేశంలో కొవిడ్‌ రోజువారీ కేసుల సంఖ్య 50 వేలకు నమోదైంది.గత 24 గంటల్లో 50,040 కొత్త కేసులు బయటపడగా.. 1,258 మంది మృతి చెందారు.దీంతో మొత్తం కేసుల సంఖ్య 3,02,33,183కి చేరగా.. ఇంతవరకు 3,95,751 మంది మహమ్మారికి బలైపోయారు.క్రియాశీలక కేసుల సంఖ్య 5,86,403కు తగ్గింది.తాజాగా 57,944 మంది కొవిడ్‌ నుంచి కోలుకోగా.. ఇంతవరకు 2,92,51,029 మంది కొవిడ్‌ను జయించారు.రికవరీ రేటు 96.75%కి చేరింది.శనివారం 17,77,309 కొవిడ్‌ నిర్ధరణ పరీక్షలు జరిపారు.దేశవ్యాప్తంగా ఇంతవరకు 32,17,60,077 కొవిడ్‌ టీకా డోసులు వేశారు.

* ఏపీకి చేరుకున్న మరో 97,410 కోవాగ్జిన్‌ డోసులు.గన్నవరం టీకా నిల్వ కేంద్రానికి తరలించిన అధికారులు.గన్నవరం నుంచి జిల్లాలకు తరలించనున్న అధికారులు..

* కరోనా వ్యాక్సిన్‌కు ఉన్న గిరాకీని సొమ్ము చేసుకునేందుకు కోల్‌కతాలో ఏకంగా నకిలీ టీకా కేంద్రాలే ఏర్పాటవుతున్నాయి. మూడుచోట్ల ఇలాంటివి బయటపడ్డాయి. యాంటీ బయోటిక్‌ మందుల్లో శరీరానికి పడనివి ఏమైనా ఉన్నాయా లేదా అనేది కూడా చూడకుండా దేవంజన్‌ దేవ్‌ అనే వ్యక్తి ఇలా నకిలీ కేంద్రాల్లో దాదాపు 2000 మందికి వాటిని కరోనా టీకాలుగా వేయించినట్లు పోలీసులు తెలిపారు. ఈ వ్యక్తి తనను ఐఏఎస్‌ అధికారిగా, కోల్‌కతా నగరపాలక సంస్థ సంయుక్త కమిషనర్‌గా పేర్కొంటూ పలువురిని మోసగించినట్లు గుర్తించారు. నిర్వాహకులపై హత్యాయత్నం కింద కూడా అభియోగాలు చేర్చాలని పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆదేశించారు.