NRI-NRT

తానా ఫౌండేషన్‌ సేవలు అభినందనీయం-ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు

TANA Foundation Helps Narasaraopeta Needy - MP Lavu Appreciates

ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా)వారి సేవలు అభినందనీయమని నరసరావుపేట పార్లమెంట్‌ సభ్యులు లావు శ్రీకృష్ణదేవరాయలు కొనియాడారు. తానా ఫౌండేషన్‌ సహకారంతో ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు ఆధ్వర్యంలో నిరుపేదలైన నలుగురు విద్యార్థులకు ₹45వేలు విలువచేసే ల్యాప్‌ట్యాప్‌లు, దివ్యాంగుడికి లక్షన్నర విలువ చేసే ట్రైసైకిల్‌ను పంపిణీ చేశారు. గుంటూరు పట్టణంలోని, జేకేసి రోడ్డులో గల ఎంపీ కార్యాలయంలో పంపిణీ జరిగింది. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ.. తానా ఫౌండేషన్‌ తెలుగువారికి ఎన్నో సేవాకార్యక్రమాలు నిర్వహిస్తుందని అభినందించారు. తానా తరుఫున తాళ్లూరి జయశేఖర్, శృంగవరపు నిరంజన్, సామినేని రవి, రమాకాంత్ కోయ, గోపాల్‌ శీలంనేని, ఉప్పుటూరి రామ్‌చౌదరి తదితరులు ఈ కార్యక్రమానికి సహకరించారు. ఈ కార్యక్రమంలో ఫౌండేషన్‌ తరుఫున రమాదేవి, రోహిత్, వెంకటేశ్వరరావు, వినీత, శ్రీచరణ్‌ పాల్గొన్నారు.
తానా ఫౌండేషన్‌ సేవలు అభినందనీయం-ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు