Politics

నాని..నీకు తెలంగాణాలో రెండు ఇళ్లు ఉన్నాయి. ఆలోచించుకో!

నాని..నీకు తెలంగాణాలో రెండు ఇళ్లు ఉన్నాయి. ఆలోచించుకో!

ఏపీ మంత్రి నానికి హైదరాబాద్‌లో రెండు ఇళ్లు ఉన్నాయని, ఇక్కడ వ్యాపారం చేస్తున్నారని తెలంగాణ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. ఆయన కనీసం ఆలోచించి మాట్లాడాలి కదా అని ఆయన ప్రశ్నించారు. సి.రామచంద్రయ్య కూడా వైషమ్యాలు రెచ్చగొట్టేలా మాట్లాడొద్దన్నారు. ఇక్కడ తింటూ అక్కడి మాట మాట్లాడితే ఇక్కడి ప్రజలు మీ గురుంచి ఆలోచన చేస్తే పరిస్థితి ఏంటి? అని శ్రీనివాస్ గౌడ్ ప్రశ్నించారు.‘‘మా పదవులు పోయినా, ప్రాణాలు పోయినా ఏపీ అక్రమంగా కడుతున్న ప్రాజెక్టును అడ్డుకుంటాం. పాలమూరు ఇప్పుడిప్పుడే పచ్చబడుతుంది. పాలమూరు ప్రాజెక్టు పూర్తయితే బతుకులు బాగుపడతాయని ప్రజలు ఆశతో ఉన్నారు. ఆ ఆశలకు పక్క రాష్ట్రం గండికొడుతోంది. పాలమూరు ప్రాజెక్టు పూర్తికావాలని ప్రజలు ఎంతో ఆశతో ఉన్నారు. జగన్ ప్రభుత్వం వరద జలాల పేరుతో నికర జలాలను తరలిస్తోంది. రాయలసీమ ఎత్తిపోతల ప్రాజెక్టును అక్రమంగా నిర్మిస్తున్నారు. కృష్ణా రివర్ బోర్డ్ రాయలసీమ ప్రాజెక్టును ఎందుకు ఆపడం లేదు. హైడల్ ప్రాజెక్టులో విద్యుత్ ఉత్పత్తి ఆపాలని మాకు ఎలా ఆదేశాలు ఇస్తారు.’’ అని శ్రీనివాస్ గౌడ్ ప్రశ్నించారు.