Health

ఏపీలో ఆంక్షల సడలింపు-TNI కోవిద్ బులెటిన్

ఏపీలో ఆంక్షల సడలింపు-TNI కోవిద్ బులెటిన్

* ఏపీలో 8 జిల్లాల్లో కర్ఫ్యూ ఆంక్షలు సడలింపు.కోవిడ్‌ పాజిటివిటీ రేటు 5శాతం కన్నా తక్కువ ఉన్న జిల్లాల్లో సడలింపు.8 జిల్లాల్లో ఉదయం 6 నుంచి రాత్రి 9 గంటలవరకూ కర్ఫ్యూ సడలింపు.రాత్రి 9 నుంచి 10 మధ్య దుకాణాలు, రెస్టారెంట్లు ఇతరత్రా మూసివేత.రాత్రి 9 నుంచి ఉదయం 6 వరకూ కొనసాగనున్న కర్ఫ్యూ.ఉభయగోదావరి, కృష్ణా, చిత్తూరు, ప్రకాశం జిల్లాల్లో సాయంత్రం 6 గంటలవరకే సడలింపు .ఈ జిల్లాల్లో సాయంత్రం 6 నుంచి ఉదయం 6వరకూ కర్ఫ్యూ .ఈజిల్లాల్లో పాజిటివిటీ రేటు 5శాతం కన్నా ఎక్కువగా ఉన్నందున నిర్ణయం.జులై 1 నుంచి జులై 7 వరకూ తాజా నిర్ణయాలు వర్తింపు.పాజిటివిటీ రేటు పరిశీలించాక ఈజిల్లాల్లో సడలింపుపై మళ్లీ నిర్ణయం

* ఆంధ్రప్రదేశ్‌లో కరోనా తీవ్రత తగ్గుముఖం పడుతోంది.గడిచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 71,758 కరోనా పరీక్షలు నిర్వహించగా 2,224 కొత్త కేసులు నమోదయ్యాయి.31 మంది వైరస్‌ కారణంగా మరణించారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో 4,714 మంది కరోనా నుంచి కోలుకున్నారు.ప్రస్తుతం రాష్ట్రంలో 42,252 కరోనా యాక్టివ్‌ కేసులు ఉన్నట్లు వైద్యారోగ్యశాఖ వెల్లడించింది.

* కోవిడ్ నివారణ చర్యలు, వ్యాక్సినేషన్‌పై ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సోమవారం సమీక్ష చేపట్టారు.

* డెల్టాప్లస్‌ వేరియంట్‌, థర్డ్‌వేవ్‌ భయాల నేపథ్యంలో పశ్చిమ బెంగాల్‌ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో జూలై 15 వరకు లాక్‌డౌన్‌ నిబంధనలు పొడిగిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు సోమవారం ప్రకటన విడుదల చేసింది. తాజా నిబంధనల ప్రకారం.. బ్యూటీ పార్లర్లు, సెలూన్లు ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు తెరిచేందుకు అనుమతి ఇచ్చింది. అదే విధంగా కార్యాలయాల్లో 50 శాతం హాజరుతో ఉద్యోగులు విధులు నిర్వర్తించవచ్చు.

* ఆక్సిజన్‌ కొరతతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న కరోనా బాధితుల కోసం మెగాస్టార్‌ చిరంజీవి నడుంబిగించారు. ఇప్పటికే బాధితులను ఆదుకునేందుకు చిరంజీవి ఆక్సిజన్‌ బ్యాంకులను ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ మేరకు తొలి విడతగా గుంటూరు, అనంతపురం జిల్లాలకు ఆక్సిజన్‌ బ్యాంకులు ఎర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. హైదరాబాద్‌ జూబ్లీహిల్స్‌లోని చిరంజీవి బ్లడ్‌ బ్యాంక్‌ నుంచి ఆక్సిజన్‌ సిలిండర్లను తరలిస్తున్న వీడియోను చిరంజీవి ట్విటర్‌లో షేర్‌ చేశారు.