Movies

“మా”లో విభజనవాదానికి విజయశాంతి మద్దతు

“మా”లో విభజనవాదానికి విజయశాంతి మద్దతు

మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌ (మా) ఎన్నికల్లో తెలంగాణ వాదం వినిపించేందుకు సిద్ధమయ్యారు నటుడు సీవీఎల్‌ నరసింహారావు. త్వరలో జరగనున్న ‘మా’ ఎన్నికల్లో అధ్యక్ష పదవి కోసం పోటీ చేస్తానని ఆయన ఇటీవల ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ‘మా’లో ఇక నుంచి తెలంగాణ, ఆంధ్రా అని రెండు విభాగాలు ఉండాలని, తెలుగు వారికి న్యాయం జరిగేలా చూడాలని సీవీఎల్‌ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. ఇప్పుడాయన వ్యాఖ్యలకు ప్రముఖ నటి, రాజకీయ నాయకురాలు విజయశాంతి మద్ధతు తెలిపారు. సీవీఎల్‌ ఆవేదనలో న్యాయముందని అన్నారు.