Health

రెండు రకాల టీకాలతో మరింత రక్షణ-TNI కోవిద్ బులెటిన్

రెండు రకాల టీకాలతో మరింత రక్షణ-TNI కోవిద్ బులెటిన్

* తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర రెడ్డి చేతుల మీదుగా….దాత జయచంద్రా రెడ్డి ఆధ్వర్యంలో స్విమ్స్ కోవిడ్ సెంటర్ కి ఐదు లక్షల రూపాయల విలువైన స్ట్రెచ్ ర్లు, మాస్క్ లు,
శానిటైజర్స్, వితరణ..

* నమూనా పరీక్షలు :91231.కోవిడ్ పాజిటివ్ :3620.పాజిటివ్ రేట్ : 4.0%.మరణాలు : 41.అధిక మరణాలు చిత్తూరు 7.అత్యధిక కేసులు: తూర్పుగోదావరి 617.కరోనాయాక్టివ్* యాక్టివ్ కేసులు 40074.గత 24 గంటల్లో రికవరీ అయిన వారు 5757.కరోన మృతులు 12671 (0.67%).రికవరీ 18.85 లక్షల్లో 18.32 లక్షల మంది రికవరీ అయ్యారు (97%).

* ►డెల్టా ప్లస్‌కు వ్యాపించే సామర్థ్యం ఎక్కువగా ఉన్నా.. అందుకు మనం ఆస్కారం ఇస్తున్నామా అన్నది ముఖ్యం. లాక్‌డౌన్‌ సడలించారన్న ఉద్దేశంతో జనం గుమిగూడటం, కొవిడ్‌ నిబంధనలు పాటించకుండా ఇష్టమొచ్చినట్టు తిరిగితే అందరినీ ఇన్ఫెక్ట్‌ చేసే అవకాశం ఉంటుంది.►ప్రజలు గుంపులుగా చేరకుండా ప్రభుత్వ పరంగా కఠిన చర్యలు తీసుకోవాలి. ఎవరికైనా కోవిడ్‌ లక్షణాలు కనిపిస్తే.. ఇంట్లో వారిని, ఇతర ప్రైమరీ కాంటాక్టులను విడిగా ఉంచి పరీక్షలు చేయించాలి. వ్యాక్సినేషన్‌ వేగం పెంచాలి. మార్కెట్లు, ఆఫీసులు వంటి చోట్ల పూర్తిగా భౌతికదూరం పాటించడం సాధ్యం కాకపోవచ్చు. కచ్చితంగా మాస్కులు ధరించడం, శానిటైజేషన్‌ పాటించేలా చూడాలి.►ప్రపంచవ్యాప్తంగా కొత్త వేరియంట్లను ఎదుర్కొనేలా కొత్త వ్యాక్సిన్లపై పరిశోధనలు జరుగుతున్నాయి. వాస్తవానికి వైరస్‌ ఉపరితలంపై ఉండే స్పైక్‌ ప్రోటీన్‌తో పోల్చితే.. అంతర్గతంగా ఉండే యాంటీ జెన్లు నెమ్మదిగా మ్యుటేట్‌ అవుతాయి. అందువల్ల స్పైక్‌ ప్రోటీన్‌తోపాటు యాంటీజెన్లపైనా పనిచేసేలా.. భిన్నమైన వేరియెంట్లను ఎదుర్కొనేలా కొత్త వ్యాక్సిన్లను రూపొందిస్తున్నారు. అమెరికాలో ఇలాంటి సూపర్‌ వ్యాక్సిన్‌కు సంబంధించి మార్చిలోనే ట్రయల్స్‌ మొదలయ్యాయి. దీనిపై తదుపరి దశల ట్రయల్స్‌ జరుగుతున్నాయి. ఈ ఏడాది చివరి నాటికి సూపర్‌ వ్యాక్సిన్‌ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. ఇక శాస్త్రవేత్త కేథరిన్‌ జె వూ వెల్లడిస్తున్న వివరాల ప్రకారం.. మల్టీ యాంటీజెన్‌ వ్యాక్సిన్లను పరీక్షిస్తున్నారు. స్పైక్‌ ప్రోట్రీన్, న్యూక్లియో క్యాప్సిడ్, ఇంటీరియర్‌ వైరల్‌ యాంటీజెన్లతో కూడిన ‘ఓఆర్‌ఎఫ్‌–3ఏ’లను సమ్మిళితం చేసి ఆ వ్యాక్సిన్లు తయారు చేస్తున్నారు.

* ప్రపంచ వ్యాప్తంగా ఒకే రకమైన కరోనా వ్యాక్సిన్‌ పంపిణీ జరుగుతున్నప్పటికీ.. మిశ్రమ వ్యాక్సిన్‌లు ఇచ్చే విధానంపైనా అధ్యయనాలు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా ఫైజర్‌, ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్‌లకు చెందిన రెండు వేర్వేరు డోసులను తీసుకున్న వారిలో రోగనిరోధకత ప్రతిస్పందనలు మరింత ఎక్కువగా ఉంటున్నట్లు ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీ జరిపిన అధ్యయనంలో తేలింది. ఈ అధ్యయనానికి సంబంధించిన తాజా నివేదిక అంతర్జాతీయ జర్నల్‌ లాన్సెట్‌లో ప్రచురితమయ్యింది. పలు దేశాలు వ్యాక్సిన్‌ కొరతను ఎదుర్కొంటున్న వేళ.. తాజా ఫలితాలు ఊరట కలిగిస్తున్నాయి.