Devotional

జియ్య జియ్యరు చినజియ్యరు పెద్దజియ్యర్లకు తేడా ఏమిటి?

Auto Draft

శాసనాలంటే శాసనాలే,ఇంతేతప్ప వాటి గురించి అవగాహన సామాన్యజిజ్ఞాసులకు లేదు. తెలుగు శాసనాలను తేదీలవారీగా ఇస్తూ ప్రచరింపచేయడం చాలా గొప్పవిషయం. ఇలా చేయడం వలన అభిలాషిక్తులు శాసనాలపై అవగాహన పెంచుకొంటారు. ఇలాంటి తలంపురావడమే చాలా గొప్ప విషయం. ఇలా తేదీలవారిగా సమకూర్చి నలుగురికి అందచేయడం మరో కఠిన పరిశ్రమ, శ్లాఘనీయం కూడా.
ఆ శ్లాఘతకు హేతువైన శ్రీ. మునిరత్నం రెడ్డి గారు, శ్రీ. సూర్యకుమార్ గారు అభినందనీయులు.

ఈ తారీకు సంబంధించి వారు పంపిన శాసనాలు.

స్నేహితులకు శుభోదయం!!
నేడు తారీఖు జులై 1.
(1) క్రీ.శ 1299 జులై 1 నాటి ఈదుమూడి (ప్రకాశంజిల్లా)శాసనంలో కాకతీయ ప్రతాపరుద్రుని ప్రధాని పుతావరి కామబొప్పనింగారు తమ తండ్రి దేవగారికిన్ని,తల్లి వున్నవలక్ష్మికిన్ని పుణ్యంగా కందమూడి రామాజోస్యులకు దానమిచ్చినట్లు చెప్పబడ్డది.శాసన శిల శిధిలమైనందున యితర దాన వివరాలు తెలియరావడం లేదు. [నెల్లూరు జిల్లా శాసనాలు II ong 49].

(2) అట్లే క్రీ.శ 1322 జులై 1 నాటి మోటుపల్లి శాసనంలో కాకతీయ ప్రతాపరుద్రుని కాలంలో ధర్మరామిసెట్టి ప్రతిష్ట చేసిన శ్రీగోపీనాథునికి గొల్ల చూరయ పెట్టిన దీపము ఒక్కటికి 20 గొర్రెలకు ప్రతి సంవత్సరము ఒక మాడ చొప్పున పెట్టునట్లుగా చెప్పబడ్డది.[ద.భా.దే.శా. X నెం 532].

(3) అట్లే క్రీ.శ 1555 జులై 1 నాటి పోరుమామిళ్ళ (కడప జిల్లా)శాసనంలో సదాశివరాయల కాలంలో పోరుమామిళ్ళ ప్రతినామమైన గోపీనాథపట్నంలో 12 మంది ఆళ్వారుల,శ్రీవైష్ణవుల ఆరగింపుకు శ్రీమన్మహామండలేశ్వర వరదరాజయ్య దేవ మహారాజులు నారాయణజియ్యకు వరి మడులు, తోటలు సమర్పించినట్లుగా చెప్పబడ్డది. [కడప జిల్లా శాసనాలు II నెం 243].

వివరణలు.
(అ) ఆళ్వారులు అంటే ‘ వైష్ణవదైవ భక్తి లోమునిగి ఉన్నవారు’ అని అర్థం. వారు శ్రీమన్నారాయణుని ఆరాధనా సంకీర్తనాదులలో పరవశించి ఉన్నందున వారికి ఆళ్వారులు అన్న పేరు వచ్చింది. అళ్వారులు 12 మంది. అందులో గోదాదేవనే స్త్రీ కూడా వుంది. వీరు మహవిష్ణువును గానం చేస్తూ పాశురాలను రచించారు. వీటికే నాలాయిర దివ్యప్రబంధాలని పేరు.
ఇలాంటి వారే ఆచార్యులు కూడా. ఉదా॥ విశిష్టాద్వైత సృష్టికర్త రామానుజాచార్యులు, ద్వైత సిద్ధాంతకర్త మధ్వాచార్యులు మొదలైనవారు. వీరు వైష్ణవమత ప్రచారకులు.

(ఆ) శ్రీవైష్ణవులంటే విష్ణుభక్తులు, పరమభక్తులు. వైష్ణవముద్రలను శంఖుచక్రాలను భుజంపై ముద్రగా ధరిస్తారు. మనకు తాతాచారి ముద్రకథ తెలుసు కదా !

(ఇ) ఆరగింపు ..అంటే దేవుడికి నైవేద్యం పెట్టడం. అళ్వారులు శ్రీవైష్ణవులు దేవుడికి నైవేద్యం పెట్టడానికి వరిమడులు, తోటలు నారాయణ జియ్యకు వరదరాజయ్యదేవ మహరాజులు ఇచ్చారని నా అభిప్రాయం.

ఆరగింపు అంటే భోజనాలు చేయడం. అళ్వారులు మరియు శ్రీవైష్ణవుల భుక్తిని ఏర్పాటు చేయమని వరదరాజయ్య దేవ మహారాజులు నారాయణజియ్యకు వరిమడులు తోటలు దానమిచ్చాడేమో విజ్ఞులు చెప్పాలి.
వారికి భుక్తి ఏర్పాటు చేయాల్సిన అవసరమే వుంటే ఆ మహారాజు అళ్వారులకు శ్రీవైష్ణవులకే నేరుగా దానం చేయవచ్చుకదా! మధ్యలో ఈ నారాయణజియ్యకు ఎందుకు దానం చేస్తాడు.
నాకో సందేహం 16వ శతాబ్దిలో భక్తిపరంపరలో విష్ణువును కీర్తిస్తూ గానంచేసిన అళ్వారులు ఉన్నారా ?
లేక ఆరోజులలో విష్ణుభక్తిని ప్రచారం చేస్తుా కొంతకాలంపాటు ఒకవూరిలో నివసిస్తూ సాగిపోయేవారా ? అటువంటి భక్తుల భుక్తికొరకు చేసినా ఏర్పాటా ఇదైమైనా ?

(ఈ) జియ్య అంటే శివాలయం పూజారి. జియ్యరు అంటే వైష్ణవ సన్యాసి. ఈ శాసనంలో జియ్య అనివుంది. శైవవైష్ణవాల మధ్య తగాదాలు వివాదాలు వున్న ఆ రోజులలో వైష్ణవభక్తులకు శైవపూజారి అరగింపులు పెట్టి వుంటాడంటారా ?
శాసనంలో జరిగిన ముద్రారాక్షసం వలన జియ్యరు కు బదులుగా జియ్య అని పడిందేమో.

జియ్య గురించి వివరణ South Indian inscription V,589 లో వుంది. శాసనకాలం శకసంవత్సరం 1269.

జియ్యరు గురించి వివరణ Nelluru & Ongolu inscriptions 51 లో వుంది. శాసనకాలం శకసంవత్సరం 1077.

(ఉ) మాడ… ఆ రోజులలోవున్న ద్రవ్య చలామణిలో ఒక నాణేనికి వున్నపేరు.
తిరుమాడ వీధులలో శ్రీవారి పల్లకి పూరేగింపు జరిగింది. ఉత్తరమాడ వీధులలో శ్రీవారి రథాన్ని ఊరేగించారు. ఇందులోని మాడ అనగా వీధి అనిఅర్థం. వాస్తవానికి తిరుమాళిగె అనాలి. మాళిగెలు అంటే ఇండ్లు అని అర్థం, ఎవరిండ్లు అంటే శ్రీవైష్ణవుల ఇండ్లని భావం.