DailyDose

బెంగుళూరు వాసులను భయపెట్టిన భారీ శబ్ధాలు-నేరవార్తలు

బెంగుళూరు వాసులను భయపెట్టిన భారీ శబ్ధాలు-నేరవార్తలు

* కర్ణాటక బెంగళూరులోని పలు ప్రాంతాల్లో శుక్రవారం మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో భారీ శబ్ధాలు వినిపించాయి.భారీ శబ్ధంతో భయాందోళనకు గురైన బెంగళూరు వాసులు పరుగులు తీశారు.శబ్ధం ధాటికి పలు నివాసాల్లో కిటికీలు కొట్టుకున్నట్లు స్థానికులు తెలిపారు. శబ్ధానికి కారణాలపై ఆరా తీస్తున్నారు పోలీసులు.మరోవైపు.. హాల్​ ఎయిర్​పోర్ట్​ నుంచి రోజూ మాదిరిగానే ఫైటర్​ జెట్స్​, ట్రైనీ ఎయిర్​క్రాఫ్ట్​లు బయలుదేరినట్లు చెప్పారు హిందూస్థాన్​ ఏరోనాటిక్స్​ లిమిటెడ్​ ప్రతినిధి గోపాల్​ సుతార్​.బెంగళూరు నగరంలో శుక్రవారం మధ్యాహ్నం వినిపించిన భారీ శబ్ధంపై ఎలాంటి విషయాలు వెల్లడించలేమని పేర్కొన్నారు.

* విజయవాడ నగరంలో సంచలనం కలిగించిన హత్య కేసులో‌ ఏడుగురు అరెస్టు.డీసీపీ విక్రాంత్ పాటిల్….దుర్గా అగ్రహారం లో హత్య జరిగింది.కండ్రిగ కు చెందిన రామారావుగా మృతుడిని గుర్తించాం.సాంకేతిక ఆధారాలతో ఏడుగురిని అరెస్టు చేసాం.గత నెల 16న ఒక ప్రేమ పంచాయితీ జరిగింది.మైనర్ బాలిక బాబాయి మురళి పంచాయితీ చేసారు.కొరుకూరి రవీంద్ర రెండు సార్లు రామారావుకి ఫోన్ చేసి బెదిరించాడు.రామారావు తనను చంపేస్తాడని భయంతో హత్య చేసారు.ఏడుగురికి పాత కేసులు ఉన్నాయి.కోతల‌‌ శివ, కొరుకూరి రవీంద్ర, అశోక్ కుమార్, కరీం, మురళి, వినయ్ కుమార్, నిహాంత్ లను రిమాండ్ కు పంపాం.ఒక వారం రౌడీ షీటర్లు కోతల శివ, కొరుకూరి రవీంద్ర, అశోక్ కుమార్ కౌన్సిలింగ్ కు హాజరు కాలేదు.తదుపరి విచారణలో ఇంకెవరైనా ఉన్నారా అనేది తేలుతుంది.ఇప్పుడు అరెస్టు అయిన వారిపైన కూడా రౌడీషీట్ ఓపెన్ చేస్తాం.

* పదేళ్ల పాటు జైలు శిక్ష అనుభవించిన హరియాణా మాజీ ముఖ్యమంత్రి ఓం ప్రకాశ్ చౌతాలా శుక్రవారం తీహార్ జైలు నుంచి విడుదలయ్యారు.ఇప్పటికే పెరోల్​పై బయట ఉన్న చౌతాలా(86) శుక్రవారం ఉదయం తీహార్ జైలుకు వెళ్లి విడుదల ప్రక్రియను అధికారికంగా పూర్తి చేసినట్లు అధికారులు వెల్లడించారు.కొవిడ్​ దృష్ట్యా తొమ్మిదిన్నర ఏళ్ల పాటు జైలు జీవితం గడిపిన ఖైదీలకు ఆరు నెలలు ఉపశమనం ఇస్తున్నట్లు గతంలో దిల్లీ ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది. ఈ నేపథ్యంలో చౌతాలాకు పెరోల్​ లభించింది.ఉపాధ్యాయ నియామకం కుంభకోణం కేసుకు సంబంధించి 2013లో చౌతాలా జైలు పాలయ్యారు.2020 మార్చి 26న ఆయనకు ఎమర్జెన్సీ పెరోల్​ లభించింది. 2021 ఫిబ్రవరి 21న మళ్లీ జైలుకు రావాల్సిందిగా ఆదేశాలిచ్చారు అధికారులు.తర్వాత ఆయనకు పెరోల్​ గడువు పొడిగిస్తూ హైకోర్టు ఆదేశాలిచ్చింది.ఓపీ చౌతాలా, ఆయన కుమారుడు అజయ్ చౌతాలా, మరో 53 మంది ఈ కేసుకు సంబంధించి శిక్ష అనుభవించారు.ఇందులో ఐఏఎస్ అధికారి సంజీవ్​ కుమార్​ కూడా ఉన్నారు. 2000 సంవత్సరంలో 3,206 మందిని అక్రమంగా ఉపాధ్యాయులుగా నియమించడంలో వీరు కీలక పాత్ర పోషించారు.

* బైక్‌ను లారీ ఢీ కొట్టడంతో ఓ వ్యక్తి మృత్యువాత పడ్డ సంఘటన జిల్లాలోని రామాయంపేట బైపాస్‌ రోడ్‌ వద్ద చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. చేగుంట మండలం పులిమామిడి గ్రామానికి చెందిన మందాపురం రాజయ్య(55) తన కొడుకు పెండ్లి కోసం రామాయంపేటలో పుస్తె మట్టెలు కొనుగోలు చేశాడు. తిరుగు ప్రయాణంలో బైక్‌పై దామరచెర్వు బైపాస్‌ మీదుగా వెళ్తుండగా ఎదురుగా వస్తున్న లారీ బైక్‌ను ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో రాజయ్య అక్కడికక్కడే మృతి చెందాడు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు

* రాజేంద్రనగర్ లో డ్రగ్స్ పట్టివేత. సుడాన్ యెమెన్ దేశస్థుల అరెస్ట్.ఉప్పర్ పల్లి వద్ద మంత్రా మాల్ లో డ్రగ్స్ విక్రయిస్తూ రెడ్ హ్యాండెడ్ గా పోలీసులకు పట్టుబడ్డ ఇద్దరు విద్యార్థులు.యువతను టార్గెట్ చేసి వారికి డ్రగ్స్ విక్రయిస్తున్నారని పక్కా సమాచారం మేరకు మంత్రా మాల్ వద్ద మాటు వేసిన శంషాబాద్ ఎస్ఓటి బృందం.బంజారా హిల్స్ లో నివాసం వుండే విదేశీయులు వారి వద్ద వున్న డ్రగ్స్ ను తీసుకొని రాజేంద్రనగర్ కు చేరుకున్న విద్యార్థులు.మంత్రా మాల్ లో యువతకు విక్రయిస్తుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న పోలీసులు.ఇద్దరి అరెస్ట్……వారి వద్ద వున్న ముద్ద లాంటి డ్రగ్స్ స్వాధీనం. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు.

* విశాఖ…భారీగా గంజాయిని అక్రమంగా తరలిస్తున్న కంటైనర్ ను పెందుర్తిలో స్పెషల్ ఎన్-ఫోర్స్-మెంట్ పోలీసులు పట్టుకున్నారు.కంటైనర్ డ్రైవరుతో పాటు మరో ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు.సుమారుగా 2652 కేజీల గంజాయిని కంటైనర్ లో తరలిస్తుండగా పట్టుకున్నారు.ఉత్తరప్రదేశ్ ప్రాంతానికి చెందిన ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకొని పోలీసులు విచారణ చేయగా విశాఖపట్నానికి చెందిన మరో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు.నలుగురు ముద్దాయిలను కరోనా టెస్టులు చేయించి రిమాండ్ కు తరలించారు.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం సుమారు 60 లక్షలు ఉంటుందని స్పెషల్ ఇన్ ఫోర్స్ మెంట్ జాయింట్ డైరెక్టర్ శ్రీనాథులు అన్నారు.