Politics

కేసీఆర్‌ను ఎవరూ అడ్డుకోలేరు-తాజావార్తలు

కేసీఆర్‌ను ఎవరూ అడ్డుకోలేరు-తాజావార్తలు

* సిరిసిల్లలో సీఎం కేసీఆర్ కామెంట్స్? కెసిఆర్ ప్రయాణాన్ని ఎవరూ అడ్డుకోలేరు? గొర్రెల పంపిణీ కి ఎనిమిది వేల కోట్లు.. ఇప్పటికే నాలుగు వేల కోట్ల రూపాయలు ఖర్చు చేశాం ? ప్రొఫెసర్ జయశంకర్, విద్యాసాగర్ లు బతికి ఉన్నప్పుడే తెలంగాణ రాకముందు మిషన్ భగీరథ పథకం పై చర్చించాం ? సన్యాసులకు ఎప్పుడు అనుమానాలు ఉంటాయి? కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తి అవుతుందా అని అనుమానాలు వ్యక్తం చేశారు ? ప్రపంచంలోనే కాలేశ్వరం అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు అని తెలుగు మీడియ ప్రసారం చేయకున్నా ఇంగ్లీష్ మీడియం లిఫ్ట్ ఏ రివర్ పేరిట ప్రసారం చేసింది ? కాళేశ్వరం ప్రాజెక్టు కోసం ఎన్ని వేల కోట్లు కరెంట్ బిల్లు కడతారని సన్యాసులు ప్రశ్నిస్తున్నారని 10 వేల కోట్లు అయినా కట్టేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు ? గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం తో పాటు రైతుల ఇంట్లో బంగారు వర్షం కురిపించేందుకు ఎన్ని కోట్లు అయినా ఖర్చు చేస్తాం ? కరీంనగర్ ను సజీవ జలధార గా మార్చామ్? అప్పర్ మానేరు మే నెలలో నిండుతుందా అని ఎవరైనా అనుకున్నారా ? అప్పర్ మానేరు నుండి గోదావరి వరకు వందలాది చెక్డ్యాంలు నిర్మిస్తున్నాం ? రెండవ జలధార వరద కాలువ? వరద కాలువ రిజర్వాయర్ గా మారుతుంది అని ఎవరూ అనుకోలేదు ? వరద కాలువ తో 110 కిలోమీటర్ల దూరం సజీవ జలధార గా ఉంది ? రామగుండం దగ్గర చిన్న దార కోసం వెతుక్కునే పరిస్థితి ఉండేది ? 180 కిలోమీటర్ల మేర గోదావరి సజీవంగా మారింది? 365 రోజులు నీటితో కళకళలాడుతుంది? తెలంగాణలో 30 లక్షల కరెంట్ మోటర్ లు ఉన్నాయి? ట్రాన్స్ఫార్మర్లు, మోటార్లు కాలి పోయే పరిస్థితి లేకుండా చేసాం ? 24 గంటలపాటు నాణ్యమైన ఉచిత విద్యుత్ ఇస్తున్నాము? మహబూబ్ నగర్ లో 10 లక్షల ఎకరాలు సస్యశ్యామలం చేశాం ? పాలమూరు పూర్తయితే మరో పది లక్షల ఎకరాలకు నీరు? ఇల్లంతకుంట లో చాలామంది దోస్తులు ఉన్నారు చిన్నతనంలో వెళ్తే కరువుతో దుఖం వచ్చేది.. ఇప్పుడు కావాల్సినన్ని నీళ్ళున్నాయి ? మిషన్ భగీరథ తో మంచినీళ్ళ గోస పోయింది? 11 రాష్ట్రాల నుండి బృందాలు వచ్చి మిషన్ భగీరథ ను చూసి వెళ్లారు ? సమైక్య రాష్ట్రంలో చేనేత కార్మికులు రోజు ఆత్మహత్యలు చేసుకునే వారు ? బతుకమ్మ చీరలతో నేతన్నలకు భరోసా ఇచ్చామ్? నిరు పేదలకు చీరలు ఇవ్వడంతోపాటు నేతన్నల జీవితాల్లో వెలుగులు నింపామ్ ? రాష్ట్రంలోని చేనేత కార్మికులందరికీ రైతు భీమా వలె నేతన్నల బీమా గా త్వరలో ప్రకటిస్తాం ? నేతన్న చనిపోతే ఐదు లక్షల రూపాయలు కుటుంబానికి అందిస్తాము ? చిరునవ్వుల తెలంగాణగా మార్చేందుకు కృషి చేస్తున్నాం ? సిరిసిల్లలో కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి 5 కోట్లు మంజూరు ? కరోనా మహమ్మారి అందరినీ పరేశాన్ చేసింది? వైరస్ అనేక రూపాల్లో మనుషులపై దాడి చేస్తోంది? మెడికల్ కాలేజీ అంటే చదువు చెప్పే కళాశాల మాత్రమే కాదు 600 పడకల ఆసుపత్రి ? సిరిసిల్ల కూడా మెడికల్ కాలేజీ వచ్చే ఏడాది ఇస్తాం ? ప్రతి జిల్లా కేంద్రంలో మెడికల్ కాలేజ్ ఏర్పాటు చేస్తాం ? ఆశ వర్కర్లు, ఎఎన్ఎంలు, నర్సులు, వైద్యులకు సెల్యూట్ చేస్తున్నా ? విపత్కర పరిస్థితుల్లో ప్రాణాలకు తెగించి సేవలందించారు ? ద్వారా సర్వే చేసి ఇంటి దగ్గర మెడికల్ కిట్లు అందించడం ద్వారా ఎందరో కరోనా నుండి కోరుకున్నారు ? 13 నర్సింగ్ కాలేజీలు మంజూరు చేసుకున్నం? నర్సింగ్ శిక్షణ తీసుకునే విద్యార్థులకు స్టైఫండ్ పెంచాలని నిర్ణయించాం 1500 నుండి మొదటి సంవత్సరం 5000 రెండో సంవత్సరం 6,000 మూడవ సంవత్సరం ఏడు వేల రూపాయలకు పెంచుతాం ? సిరిసిల్లకు ఇంజనీరింగ్ కాలేజ్ మంజూరు చేస్తమ్? ఇల్లంతకుంట లో రెండు వందల నలభై ఎకరాల ప్రభుత్వ స్థలం ఉంది 40 ఎకరాల ఐల్యాండు ఉంది దాన్ని టూరిజం సర్క్యూట్ గా మారుస్తాం ? రాజన్న దేవాలయం దక్షిణ కాశీగా పేరు పొందింది? రాజన్న దేవాలయం అభివృద్ధి కోసం నిధులు కేటాయిస్తా? యాదవులను, మత్స్యకారులను వేలాది కోట్ల రూపాయలు వెచ్చించి ఆదుకున్నం ? దళిత జాతి అభివృద్ధి కోసం రాబోయే నాలుగేళ్లలో45 వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తాం? ప్రతి నిరుపేద దళిత కుటుంబానికి 10 లక్షల రూపాయలు ఇస్తాము ? దళిత బిడ్డలు కాలర్ ఎగరేసుకుని బతికే విధంగా చేస్తాం ? వచ్చే నెల నుండి 57 సంవత్సరాలు నిండిన వారందరికీ వృద్ధాప్య పింఛన్లు అందిస్తాం ? రాజన్న ప్రజల దేవుడు? అప్పర్ మానేరు ప్రాజెక్టు కు 50 కోట్లు మంజూరు..పాత ఆయకట్టును పునరుద్ధరించాలి? ఆక్సిజన్ కొనుక్కోవడం చూస్తే సిగ్గనిపిస్తోంది? హరితహారం లో భాగంగా ప్రతి ఒక్కరు మొక్కలు నాటి వాటిని సంరక్షించాలి ? యావత్ భారతదేశంలో ఎక్కడా లేని విధంగా 12769 గ్రామ పంచాయతీల్లో ట్రాక్టర్లు, ట్యాంకర్లు ఉన్నాయి ? అన్ని గ్రామాల్లో వైకుంఠ దామాలు నిర్మించాం? ప్రతి సర్పంచ్, ఎంపీటీసీ, మున్సిపల్ చైర్మన్లు హరితహారం విజయవంతానికి కృషి చేయాలి ? పల్లె ప్రగతి, పట్టణ ప్రగతిని అకుంఠిత దీక్షతో చేయాలి ? మండల పరిషత్, జిల్లా పరిషత్తు లకు సైతం నిధులు ఇస్తున్నాం ? సిరిసిల్ల సిరుల జిల్లాగా మారింది

* సిరిసిల్ల డబల్ బెడ్ రూమ్ ల ప్రారంభ కార్యక్రమంలో అధికారుల తీరు పై సీఎం కేసీఆర్ అసహనం…. రిబ్బన్ కట్ చేయడానికి కత్తెర అందుబాటులో ఉంచని అధికారులు, అసహనంతో చేత్తో రిబ్బన్ తెంపేసిన సీఎం.

* కేంద్ర ప్రభుత్వం రూపొందించిన కొత్త ఇన్‌ఫర్మేషన్‌ టెక్నాలజీ (ఐటీ) నిబంధనలకు అంతర్జాతీయ సామాజిక మాధ్యమ సంస్థలు గూగుల్‌, ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌ సహా ఇతర సంస్థలూ తలొగ్గాయి. భారీ స్థాయిలో అభ్యంతరకర కంటెంట్‌ను తమ వేదికల నుంచి తొలగించాయి. ఫిర్యాదుల ఆధారంగా చర్యలు తీసుకొని, తొలి నెలవారీ నివేదికలను ప్రచురించాయి. ఈ పరిణామంపై కేంద్ర ఐటీ శాఖ మంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌ సంతృప్తి వ్యక్తం చేశారు. ‘‘ఫేస్‌బుక్‌, గూగుల్‌, ఇన్‌స్టాగ్రామ్‌.. తదితర సంస్థలు కొత్త ఐటీ నిబంధనల ప్రకారం అభ్యంతరకర పోస్టులను స్వచ్ఛందంగా తొలగించి.. తొలి నెలవారీ నివేదికను ప్రచురించడం సంతోషకరం. పారదర్శకత దిశగా ఇదో పెద్ద ముందడుగు’’ అని రవిశంకర్‌ ప్రసాద్‌ ట్వీట్‌ చేశారు.

* ఒకే రాకెట్‌ ద్వారా పెద్ద సంఖ్యలో ఉపగ్రహాలను ప్రయోగించే కసరత్తును అమెరికాకు చెందిన అంతరిక్ష సంస్థ ‘స్పేస్‌ఎక్స్‌’ కొనసాగిస్తోంది. తాజాగా ‘ట్రాన్స్‌పోర్టర్‌-2’ మిషన్‌లో భాగంగా ఒకేసారి 88 ఉపగ్రహాలను రోదసిలోకి పంపింది. పాల్కన్‌-9 రాకెట్‌ ద్వారా ఫ్లోరిడాలోని కేప్‌ కెనావెరాల్‌ అంతరిక్ష కేంద్రం నుంచి ఈ ప్రయోగం జరిపింది. 2021లో ఈ సంస్థకు ఇది 20వ ప్రయోగం కావడం గమనార్హం. వీటి ద్వారా 900 ఉపగ్రహాలను రోదసిలోకి పంపింది. ప్రస్తుత ప్రయోగంలో భూకక్ష్యలోకి వెళ్లిన ఉపగ్రహాల్లో వాణిజ్య సంస్థలకు చెందినవి 85 ఉండగా, ప్రభుత్వ, ‘స్టార్‌లింక్‌’ ప్రాజెక్టు ఉపగ్రహాలు మూడేసి చొప్పున ఉన్నాయి.

* దివంగత మాజీ సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి సందర్భంగా ఈ నెల 8వ తేదీన వైఎస్ షర్మిల పార్టీని ప్రకటించనున్నారు. ఫిల్మ్‌ నగర్ జేఆర్సీ కన్వెన్షన్ సెంటర్‌లో వైఎస్సార్‌టీపీ ఆవిర్భావ సభ జరగనుంది. ఇప్పటికే ‘వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ’గా పేరును ఖరారు చేసినట్లు ప్రచారం జరుగుతోంది.ఇదిలా ఉంటే దీనికి సంబంధించి రోడ్డు మ్యాప్ తాజాగా ఖరారైంది. ఈ నెల 8వ తేదీన వైఎస్ షర్మిల బెంగళూరు నుంచి బైరోడ్డు ఇడుపులపాయకు చేరుకోనున్నారు. జూలై 8వ తేదీ ఉదయం 8.30 గంటలకు ఇడుపులపాయలో ప్రార్థనలు చేసిన అనంతరం కడప నుంచి ప్రత్యేక చాపర్‌లో 2 గంటలకు బేగంపేట ఎయిర్‌పోర్ట్ చేరుకుంటారుఆ తర్వాత మధ్యాహ్నం 3 గంటలకు పంజాగుట్ట చౌరస్తాలో వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి వైఎస్ షర్మిల పూలమాల వేసి నివాళులు అర్పించనున్నారుఇక సాయంత్రం 4 గంటలకు JRC కన్వెన్షన్‌కు చేరుకొని.. 5 గంటలకు వైఎస్ షర్మిల పార్టీ ఆవిర్భావ ప్రకటన చేయనున్నారు.

* అమరావతి భూకుంభకోణం కేసులో కీలక సాక్షిగా చెరుకూరి శ్రీధర్.చెరుకూరి శ్రీధర్‌ను విచారించిన సీఐడీ అధికారులు .రెవెన్యూ రికార్డుల మాయంపై అధికారులకు వివరణ ఇచ్చిన శ్రీధర్ .సీఐడీకి కీలక విషయాలు వెల్లడించిన సీఆర్డీఏ మాజీ కమిషనర్ శ్రీధర్.2015లో ల్యాండ్ ఫూలింగ్‌కు ముందే 2014 అక్టోబర్‌లో తుళ్లూరు మండలం రికార్డులను రహస్యంగా తెప్పించుకున్నారన్న శ్రీధర్.2015 జనవరిలో ల్యాండ్ ఫూలింగ్ ప్రక్రియ ప్రారంభమైందని వెల్లడి.అసైన్డ్ భూముల సేకరణపై జీవో 41 తీసుకొచ్చారన్న శ్రీధర్ .ఇదంతా మాజీ మంత్రి నారాయణ పర్యవేక్షించారని తెలిపిన శ్రీధర్ .ఏపీ అసైన్డ్ ల్యాండ్ యాక్ట్ 1977కు విరుద్ధంగా ఉన్న అంశాలను మాజీ మంత్రి నారాయణ దృష్టికి తీసుకెళ్లానన్న శ్రీధర్ .చట్ట వ్యతిరేకమని ముందే చెప్పినా నారాయణ వినిపించుకోలేదని వెల్లడి .నారాయణ ఆదేశాలతోనే భూముల వ్యవహారం జరిగిందన్న శ్రీధర్.మాజీ మంత్రి నారాయణ చుట్టూ బిగుస్తున్న ఉచ్చు .విచారణకు అనుమతి కోరుతూ హైకోర్టులో సీఐడీ కౌంటర్ దాఖలు.

* బీజేపీకి బీ-టీమ్ గా, బీజేపీ వ్యతిరేక ఓటును చీల్చే ఓట్ కట్టర్ గా ”ఆలిండియా మజ్లిస్ ఎ ఇతెహాద్ ఉల్ ముస్లిమీన్(ఏఐఎంఐఎం)” చీఫ్ అసదుద్దీన్ ఓవైసీపై విపక్షాలన్నీ విమర్శలు చేయడం సాధారణం అయిపోయింది. ఎవరు ఏరకంగా తిట్టిపోసినా, మజ్లిస్ చీఫ్ మాత్రం హైదరాబాద్ వెలుపల తన పార్టీని విస్తరించుకుంటూ పోతున్నారు. మహారాష్ట్రలో ఎంపీ, ఎమ్మెల్యే సీట్ల సాధనతో మొదలైన ఎంఐఎం విజయపరంపర గతేడాది బీహార్ ఎన్నికల వరకూ సాగింది. ఈ ఏడాది బెంగాల్ సహా ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో మాత్రం ఓవైసీ తుస్సుమన్నారు. అయినాసరే, బీజేపీకి, విపక్ష ఎస్పీ, బీఎస్పీ, కాంగ్రెస్ లకు సవాలు విసురుతూ ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎంఐఎం భారీ ఎత్తున అభ్యర్థులను బరిలోకి దింపుతున్నది. మిత్రుల అంచనాల ప్రకారం హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ యూపీకి ముఖ్యమంత్రి కూడా అయ్యే అవకాశముందట.

* వరంగల్ రూరల్ జిల్లా:- నర్సంపేట అఖిల భారత విద్యార్థి పరిషత్ ఎబివిపి నర్సంపేట శాఖ ఆధ్వర్యంలో విద్యార్థులకు ఆఫ్ లైన్ పరీక్షల నిర్వహణ విధానాన్ని నిరసిస్తూ నర్సంపేట సమీపంలోగల జయముఖి కాలేజీలో ప్రిన్సిపల్ చాంబర్ ఆవరణంలో ధర్నా నిర్వహించడం జరిగింది.

* నల్లజర్ల పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న అనంత పల్లి గ్రామములో హైవే పక్కన నిల్వ ఉంచిన లారీల టైర్లను దొంగతనం చేసే నలుగురు ముఠా సభ్యులను నల్లజర్ల పోలీస్ స్టేషన్ ఎస్ఐ అవినాష్ గారు వారి యొక్క సిబ్బంది అరెస్టు చేసి వారి వద్ద నుండి రెండు లారీ టైర్లను స్వాధీనం చేసుకున్నారు

* ‘పోకిరి’ సినిమాలో ధర్మం చేయమని కోరుతూ అలీ, వేణుమాధవ్‌ అండ్‌ కో బ్రహ్మానందం వెనుకపడటాన్ని తెరపై చూసి నవ్వుకున్నాం. కానీ, ఇప్పుడు అలాంటి ఘటనే హీరోయిన్‌ ప్రగ్యా జైశ్వాల్‌కు ఎదురైంది. సెలూన్‌కి వెళ్లి వస్తోన్న ఆమెను కొంతమంది యాచకులు చుట్టుముట్టారు. భోజనం చేయడానికి డబ్బుల్లేవని.. దానం చేయమని కోరారు. దాంతో ప్రగ్యా ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. వాళ్లకు కొంత డబ్బు ఇచ్చి అక్కడి నుంచి వెంటనే వెళ్లిపోయారు.

* అమరావతిలో దళిత రైతుల నుంచి భూములు లాక్కోవడంలో ప్రమేయమున్న వారిందరినీ వెంటనే అరెస్టు చేయాలని మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి డిమాండ్ చేశారు. అమరావతిలో దళితులెవరూ ఉండకూడదని భావించిన తెదేపా అధినేత చంద్రబాబు.. తన అనుయాయుల ద్వారా పక్కాగా పథకం పన్ని భూములను లాక్కున్నారని ఆరోపించారు. రియల్ ఎస్టేట్ వ్యాపారులను రంగంలోకి దింపిన చంద్రబాబు.. అసైన్డ్‌ భూములు కలిగిన రైతులకు ప్యాకేజీలు రావని మభ్యపెట్టి తక్కువ ధరకు భూములు లాక్కున్నారన్నారు. భూములన్నీ తమవారి చేతుల్లోకి రాగానే ప్యాకేజీలు ఇప్పించుకున్నారని ఆక్షేపించారు. ఈ వ్యవహారంలో మంగళగిరిలోని రియల్ ఎస్టేట్ వ్యాపారి బ్రహ్మానందరెడ్డి ప్రధాన పాత్ర పోషించారని ఆళ్ల తెలిపారు. తుళ్లూరు, మంగళగిరి, తాడేపల్లిలోని అసైన్డ్ భూములను గుర్తించి రైతులను బెదిరించి లాక్కున్నారని వెల్లడించారు. దీనికి సంబంధించిన వీడియోలను ఆళ్ల మీడియా ముందు ప్రదర్శించారు.