DailyDose

శ్రీశైలంలో అర్ధరాత్రి ద్రోన్ల కలకలం-నేరవార్తలు

శ్రీశైలంలో అర్ధరాత్రి ద్రోన్ల కలకలం-నేరవార్తలు

* శ్రీశైలంలో డ్రోన్ల కలకలం.నాలుగు రోజులుగా అర్ధరాత్రి చక్కర్లు.. ఏం జరుగుతోంది?ప్రముఖ శైవక్షేత్రం శ్రీశైలంలో డ్రోన్లు కలకలం రేపుతున్నాయి.నాలుగు రోజులుగాఅర్ధరాత్రి వేళ డ్రోన్లు శ్రీశైలం ఆకాశవీధుల్లో చక్కర్లు కొట్టడం సంచలనంగా మారింది.రాత్రివేళల్లో డ్రోన్లు తిరగడం అనుమానాలురేకెత్తిస్తోంది.ఇప్పటికే ఏపీ, తెలంగాణ మధ్య జలవివాదం.. మరోవైపు హైదరాబాద్లో ఉగ్రవాదుల కదలికల నేపథ్యంలో అధికారులు అప్రమత్తమయ్యారు.శ్రీశైలంలో గుర్తుతెలియని వ్యక్తులు ఎవరైనా మకాం వేశారా? లేక గుప్తనిధుల ముఠా పని అయి ఉంటుందా? అనే కోణాల్లో విచారణ జరుపుతున్నారు.డ్రోన్లు తిరుగుతున్న సమయంలో పట్టుకునేందుకు దేవస్థానం, భద్రతా సిబ్బంది ప్రయత్నించినా దొరకలేదు.ఆకాశంలో బాగాఎత్తుగా.. వేగంగా ఎగిరిపోతుండడంతో పట్టుకోవడం పోలీసులకు సవాల్ గా మారింది.గతంలో శ్రీశైలం ఆలయానికి ముంపు పొంచి ఉందన్న ఇంటెలిజెన్స్ హెచ్చరికల నేపథ్యంలో అధికారులు అప్రమత్తమయ్యారు..

* బ్యాంకాక్‌లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఈ పేలుడు ధాటికి ఎయిర్ పోర్టు టెర్మినల్ పరిసరాలు కంపించాయి. ఈ ఘటనతో సుమారు 11 మందికి గాయపడ్డారు.

* సీబీఐ కోర్టులో ఓబుళాపురం గనుల కేసు విచారణ.డిశ్చార్జ్ పిటిషన్ పై వాదనల కోసం మరోసారి గడువు కోరిన ఐఏఎస్ శ్రీలక్ష్మి.దర్యాప్తు పూర్తయినట్లు లిఖితపూర్వకంగా తెలపాలని ఇటీవల సీబీఐని హైకోర్టు ఆదేశిందన్న శ్రీలక్ష్మి.హైకోర్టులో ఈనెల 9న విచారణ ఉన్నందున వారం రోజులు వాయిదా వేయాలని సీబీఐ కోర్టును కోరిన శ్రీలక్ష్మి.విచారణ పూర్తయిందని గతేడాది అక్టోబరులో దర్యాప్తు అధికారి కోర్టుకు తెలిపారన్న సీబీఐ కోర్టు.మరో రూ.3వేలు చెల్లిస్తే వాదనలు వాయిదా వేస్తామని శ్రీలక్ష్మికి తెలిపిన సీబీఐ కోర్టు.గత నెల 29న రూ.వెయ్యి చెల్లించాలని శ్రీలక్ష్మిని ఆదేశించిన సీబీఐ కోర్టు.తదుపరి విచారణలో వాదించకపోతే తగిన ఆదేశాలు జారీ చేస్తామన్న సీబీఐ కోర్టు.ఓఎంసీ కేసు విచారణ ఈనెల 12కి వాయిదా వేసిన సీబీఐ కోర్టు.

* ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానంలో ఓటుకు నోటు కేసు విచారణ.ఏసీబీ కోర్టులో విచారణకు హాజరైన ఉదయ్ సింహా, సెబాస్టియన్.స్టీఫెన్ సన్ గన్ మెన్ల సాక్షి వాంగ్మూలాలు నమోదు చేసిన ఏసీబీ కోర్టు.రేపు రేవంత్ రెడ్డి అప్పటి గన్ మెన్లను విచారించనున్న ఏసీబీ కోర్టు.

* మాన్సస్‌లో ప్రారంభమైన ఆడిట్‌. ఆడిట్‌ అంశంపై గత కొన్నాళ్లుగా కొనసాగుతోన్న వివాదం. మాన్సస్‌ కార్యాలయానికి చేరుకున్న జిల్లా ఆడిట్‌ అధికారి డాక్టర్‌ హిమబిందు. మాన్సస్‌ రికార్డ్స్‌ను ఆడిట్‌ చేసేందుకు సిద్ధమైన జిల్లా ఆడిట్‌ అధికారులు.