Movies

నా లాంటి పెద్దలు మాట్లాడుకుంటున్నాము. “మా”లో ఏకగ్రీవమే!

నా లాంటి పెద్దలు మాట్లాడుకుంటున్నాము. “మా”లో ఏకగ్రీవమే!

సీనియ‌ర్ న‌టుడు, మా మాజీ అధ్య‌క్షుడు ముర‌ళీ మోహ‌న్ ‘మా’ ఎన్నికలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈసారి మా ఎన్నికలు ఉండవని.. ఏకగ్రీవమే జరుగుతుందని బాంబు పేల్చారు. గతంలో మా మెంబర్స్‌ తక్కువగా ఉండటంతో చాలా పద్దతిగా ఉండేదని, కానీ ఇప్పుడు అలా లేదంటూ ఆరోపణలు గుప్పించారు. ఎవరికి పడితే వాళ్లకు మా సభ్యత్వం దొరుకుతుందని, దీంతో ఎవరు మా మెంబరో కాదో కూడా తెలియడం లేదని విమర్శించారు. గాడి తప్పిన ‘మా’ ను మళ్లీ పట్టాలెక్కించడానికి తనతో పాటు చిరంజీవి, మోహన్ బాబు, జయసుధ, కృష్ణంరాజు లాంటి సినీ పెద్దలు మాట్లాడుకుంటున్నామని చెప్పుకొచ్చారు.