Health

ఆగష్టులో మూడో దశ తప్పదు-TNI కోవిద్ బులెటిన్

ఆగష్టులో మూడో దశ తప్పదు-TNI కోవిద్ బులెటిన్

* కరోనా వైరస్‌ సెకండ్‌ వేవ్‌ ప్రభావంతో వణికిపోయిన భారత్‌లో పరిస్థితులు ఇప్పుడిప్పుడే కుదుటపడుతున్నాయి. అయినప్పటికీ మూడో ముప్పు తప్పదని ఇప్పటికే ఆరోగ్యరంగ నిపుణులు స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో వచ్చే నెలలోనే (ఆగస్టు) థర్డ్‌ వేవ్‌ ప్రభావం మొదలయ్యే అవకాశం ఉందని ఎస్‌బీఐ నివేదిక హెచ్చరించింది. సెప్టెంబర్‌ నెలలో ఇది గరిష్ఠానికి చేరుకోవచ్చని అంచనా వేసింది. దేశంలో కరోనా వైరస్‌ ఉద్ధృతి, బ్యాంకింగ్‌, ఆర్థిక వ్యవస్థలపై ప్రభావం వంటి అంశాలపై భారతీయ స్టేట్‌ బ్యాంక్‌ నిపుణుల బృందం ఎప్పటికప్పుడు అంచనా వేస్తోంది. ఇందులో భాగంగా ‘కొవిడ్‌19: ది రేస్‌ టు ఫినిషింగ్‌ లైన్‌’ పేరుతో తాజాగా పరిశోధనాత్మక నివేదికను విడుదల చేసింది. దేశంలో కరోనా వైరస్‌ సెకండ్‌ వేవ్‌ ప్రభావం ఎక్కువగానే ఉందని అభిప్రాయపడిన నివేదిక, మే 7వ తేదీన గరిష్ఠానికి చేరుకున్నట్లు తెలిపింది. ప్రస్తుత గణాంకాలను బట్టి చూస్తే జులై రెండో వారానికి రోజువారీ కేసుల సంఖ్య 10వేలకు తగ్గుతుందని పేర్కొంది. అయినప్పటికీ ఆగస్టు రెండో పక్షం నుంచి కేసుల సంఖ్య క్రమంగా పెరిగే అవకాశం ఉన్నట్లు హెచ్చరించింది.

* భారత్‌లో కొవిడ్‌-19 మూడో దశ ఉద్ధృతి ఆగస్టు నుంచి ప్రారంభం కావొచ్చని, సెప్టెంబరులో అత్యంత తీవ్రం కావొచ్చని స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా(ఎస్‌బీఐ) రీసెర్చ్‌ నివేదిక అంచనా వేసింది. ప్రస్తుత గణాంకాలను చూస్తే జులై రెండో వారానికి దేశవ్యాప్తంగా రోజువారీ కొత్త కేసుల సంఖ్య దాదాపు 10,000కు దిగిరావచ్చని పేర్కొంది. కొవిడ్‌ రెండో దశలో కేసుల గరిష్ఠ తీవ్రత మే 7న నమోదైందని వెల్లడించింది. ఆగస్టు ద్వితీయార్థం నుంచి కొవిడ్‌ కేసుల వ్యాప్తి మళ్లీ పెరగడం ప్రారంభం కావొచ్చని అభిప్రాయపడింది. ‘పూర్వ ధోరణుల’ ఆధారంగా ఈ అంచనాలను వెలువరించినట్లు నివేదిక స్పష్టం చేసింది. రెండో దశతో పోలిస్తే మూడో దశలో గరిష్ఠ కేసులు సగటున రెండింతలు లేదా 1.7 రెట్లు అధికంగా నమోదైనట్లు అంతర్జాతీయ గణాంకాలు చెబుతున్నట్లు వివరించింది. కొవిడ్‌ మూడో దశ కూడా రెండోదశ మాదిరే తీవ్రంగా ఉన్నా మరణాలు తక్కువగా ఉండొచ్చని పేర్కొంది.

* దేశంలో క‌రోనా సెకండ్ వేవ్ ఇంకా కొన్ని ప్రాంతాల్లో స్వ‌ల్ప స్థాయిలో కొన‌సాగుతోంద‌ని కేంద్ర ఆరోగ్య‌శాఖ సంయుక్త కార్య‌ద‌ర్శి ల‌వ్ అగ‌ర్వాల్ తెలిపారు.ఇవాళ ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ సేద తీరేందుకు కొండ ప్రాంతాల‌కు వెళ్తున్న వారంతా కోవిడ్ ప్ర‌వ‌ర్త‌నా నియ‌మావ‌ళిని ఉల్లంఘిస్తున్న‌ట్లు ఆయ‌న అన్నారు.ఒక‌వేళ స‌రైన ప్ర‌వర్త‌నా నియ‌మావ‌ళిని పాటించ‌కుంటే అప్పుడు మ‌ళ్లీ ఆంక్ష‌ల‌ను విధిస్తామ‌ని ఆయ‌న హెచ్చ‌రించారు.ఉత్త‌రాది రాష్ట్రాల్లో ఎండ‌లు మండుతున్న నేప‌థ్యంలో చాల మంది ప‌ర్యాట‌కులు హిల్ స్టేష‌న్ల‌కు వెళ్తున్న విష‌యం తెలిసిందే.

* మంగ‌ళ‌వారం రాష్ట్ర ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కే తారక రామారావును ప్రగతిభవన్‌లో మ‌ర్యాద‌పూర్వ‌కంగా క‌లిశారు.ఈ సందర్భంగా సోనూసూద్ నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాలను మంత్రి కేటీఆర్ అభినందించారు.దేశవ్యాప్తంగా నలుమూలల నుంచి వస్తున్న విజ్ఞప్తులకు ఎప్పటికప్పుడు స్పందిస్తు సోనుసూద్ పనిచేస్తున్న తీరుపై మంత్రి వివరాలు అడిగి తెలుసుకున్నారు.ప్రస్తుతం దేశవ్యాప్తంగా నెలకొన్న కరోనా సంక్షోభ కాలంలో ఒక ఆశాజ్యోతిగా, వ్యక్తిగత స్థాయిలో ఇంత భారీ ఎత్తున సేవా కార్యక్రమాలు చేయడం గొప్ప విషయమన్నారు.ఈ సందర్భంగా సోనూసూద్ తన సేవా కార్యక్రమాలకు సంబంధించిన వివరాలను, సేవారంగంలో తన భవిష్యత్తు ప్రణాళికలను కేటీఆర్‌తో పంచుకున్నారు.

* రాష్ట్రంలో కొత్తగా 3,042 కరోనా కేసులు, 28 మరణాలు.రాష్ట్రంలో కొత్తగా 3,042 కరోనా కేసులు, 28 మరణాలు.రాష్ట్రంలో కరోనా నుంచి కోలుకున్న మరో 3,748 మంది బాధితులు.రాష్ట్రంలో ప్రస్తుతం 33,230 కరోనా యాక్టివ్‌ కేసులు.రాష్ట్రంలో 24 గంటల్లో 88,378 మందికి కరోనా పరీక్షలు.

* హైదరాబాద్‌-ఒకే రోజు వైద్య ఆరోగ్య శాఖలో 16 వేల మంది తొలగింపు.-గాంధీ, ఉస్మానియా, నిలోఫర్‌, టిమ్స్‌ తదితర ఆస్పత్రుల్లో పని చేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగుల తొలగింపు.