DailyDose

బెజవాడలో వైకాపా నేత వీరంగం-నేరవార్తలు

బెజవాడలో వైకాపా నేత వీరంగం-నేరవార్తలు

* నరసరావుపేట మండలం రావిపాడులో దారుణ హత్య. రియల్ ఎస్టేట్ వ్యాపారి మల్లిఖార్జునరావును నరికి చంపిన దుండగులు. పోలీసులు దర్యాప్తు. ఆర్ధిక లావాదేవీలా? పాత కక్షలా అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్న పోలీసులు.

* అనకాపల్లిలో ఇంటర్​ఛేంజ్ వంతెన కూలిన ఘటనపై కేసు నమోదైంది.

* కృష్ణలంక బ్రేకింగ్…◆ 16వ డివిజన్ కార్పొరేటర్ రాధిక భర్త దాష్టీకం.◆ వార్డు సచివాలయ ఉద్యోగినులపై పెట్రోల్ పోయించిన మాజీ కార్పొరేటర్ ఉమ్మడిశెట్టి బహుదూర్.◆ అక్రమ నిర్మాణాలను అడ్డుకోవడంతో ఆగ్రహించిన వైసీపీ నేత.◆ అక్రమణదారుల చేత నలుగురు ఉద్యోగినులపై దాడి చేయించిన వైనం.◆ ప్రాణభయంతో హడలిపోయిన సచివాలయ ఉద్యోగినులు.◆ తానే పెట్రోల్ పోయమన్నానంటున్న కార్పొరేటర్ భర్త.◆ గతంలోనూ ఓ మహిళా బిల్డింగ్ ఇన్స్పెక్టరుపై దాడికి యత్నించిన బహుదూర్.

* విశాఖపట్నం 104 ఏరియా అశోక్ పార్క్ దగ్గర నివాసం ఉంటున్న జోతి అనే యువతి (సుప్రీం కోర్ట్ ఆదేశాల మేరకు బాధితరాలు పేరు మార్చడం జరిగినది ) అక్కయ్య పాలెం లో ఒక ప్రైవేట్ ఆఫీసులో పని చేస్తూ, అదే ఆఫీస్ లో అకౌంట్స్ లో జాబ్ చేస్తున్న శ్రీకాకుళం జిల్లా రాజాం దగ్గర సుందరాడ గ్రామంనకు చెందిన జగదీశ్వర రావు మాయమాటలు చెప్పు కొని, ఆమె వెంటపడతూ పెళ్లి చేసుకుంటాను అని పేరు తో 22 ఆగస్టు 2020 రోజున వినాయక చవితి రోజు అమ్మాయిని బలవంతంగా మానభంగం చేసి తన సెల్ ఫోన్ లో వీడియో ఫొటోస్ తీసుకోని బ్లాక్మెయిల్ చేసి అమ్మాయిని వాడు కొనేవాడు. ఈ క్రమంలో మొదటి సారి అమ్మాయికి గర్భం అయితే అమ్మాయి పెళ్లి చేచు కోవాలి అని ఒత్తిడి తీసుకోని రాగ అతని ఫొన్ లో అమ్మాయికి తెలియకుండా తీసిన అసభ్యకరమైన అశ్లీల అశ్లీల వీడియోలు, ఫొటో లు అమ్మాయికి చూపించి భయబ్రాంతులకు గురి చేచి అతను చెప్పినట్లు వినకపోతే పై వీడియోలు సోషల్ మీడియాలో, ఇంటర్నెట్లో పెడతానని అవసరమైతే నీ శవాన్ని కూడా దొరక్కుండా గల్లంతు చేయగలనని బెదిరించి ఆమెను మానసికంగా కృంగదీచుకొని అతను కు పరిచయం ఉన్న మెడికల్ షాప్ నుండి మెడిసిన్ తీసుకొని వచ్చి బలవంతం గా ఆ అమ్మాయి తో ఆ టాబ్లెట్స్ మింగించి బలవంతం గా ఇంట్లో నే అబార్షన్ చేపించాడు.