Politics

సోనియమ్మనే పొగడాలి…నన్ను కాదు-తాజావార్తలు

సోనియమ్మనే పొగడాలి…నన్ను కాదు-తాజావార్తలు

* కార్యకర్తలకు రేవంత్‌రెడ్డి సీరియస్ వార్నింగ్.టీపీసీసీ బాధ్యతలు చేపట్టిన వెంటనే రేవంత్ రెడ్డి కార్యకర్తలకు షాక్‌ ఇచ్చారు.అట్టహాసంగా సాగుతున్న కార్యక్రమంలో పార్టీ శ్రేణులు చేసిన నినాదాలకు రేవంత్ ఒక్కసారిగా సీరియస్ అయ్యారు.సీఎం రేవంత్ అంటూ వ్యక్తిగత నినాదాలు చేస్తున్న కార్యకర్తలకు వార్నింగ్ ఇచ్చారు.జై సోనియా, జై కాంగ్రెస్ నినాదాలు చేయాలి తప్ప ఇతర వ్యక్తిగత నినాదాలు చేయకూడదని స్పష్టం చేశారు.ఇక నుంచి అలా ఎవరైనా చేస్తే పార్టీ నుంచి బయటకు పంపుతా అని హెచ్చరించారు.

* క్రొత్త కేంద్ర మంత్రులు జాబితా విడుదల

1. నారాయణ రాణే
2. సర్బానంద్ సోనోవాలా
3. డాక్టర్ వీరేంద్ర కుమార్
4. జ్యోతిరాదిత్య సింధియా
5. రామచంద్ర ప్రసాద్ సింగ్
6. అశ్వనీ వైష్ణవ్
7. పశుపతి కుమార్ పారస్
8. కిరణ్ రిజిజు
9. రాజ్ కుమార్ సింగ్
10. హర్దీప్ సింగ్ పూరీ
11. మన్సుఖ్ మాండవ్య
12. భూపేందర్ యాదవ్
13. పురుషోత్తం రూపాలా
14. కిషన్ రెడ్డి
15. అనురాగ్ ఠాకూర్
16. పంకజ్ చౌధురి
17. అనుప్రియా పటేల్
18. సత్యపాల్ సింగ్ బాఘేల్
19. రాజీవ్ చంద్రశేఖర్
20. శోభా కరంద్లాజే
21. భానుప్రతాప్ సింగ్ వర్మ
22. దర్శన విక్రమ్ జర్దోశ్
23. మీనాక్షి లేఖీ
24. అన్నపూర్ణా దేవి
25. నారాయణ స్వామి
26. కౌశల్ కిశోర్
27. అజయ్ భట్
28. బి.ఎల్. వర్మ
29. అజయ్ కుమార్
30. చౌహాన్ దేవూసింగ్
31. భగవంత్ ఖూబా
32. కపిల్ మోరేశ్వర్ పాటిల్
33. ప్రతిమా భౌమిక్
34. భగవత్ కృష్ణారావు
35. సుభాశ్ సర్కార్
36. రాజ్‌కుమార్ రాజన్ సింగ్
37. భారతీ పవార్
38. విశ్వేశ్వర్ తుడు
39. శంతనూ ఠాకూర్
40. మహేంద్ర భాయ్
41. జాన్ బర్లా
42. మురుగన్
43. నితీశ్ ప్రామాణిక్

* శ్రీశైలంలో టూరిజం రోప్ వే మరియు బోట్ షికార్ పునః ప్రారంభం.ఆంధ్రప్రదేశ్ టూరిజం వారు నిర్వహిస్తున్న రోప్ వే మరియు బోట్ షికారు కరోనా వల్ల లాక్ డౌన్ విధించడంతో సుమారు రెండు నెలల పాటు నిలుపుదల చేశారు.

* తెలంగాణ రాష్ట్రానికి సుమారు 740 కోట్ల భారీ పెట్టుబడి.జీనోమ్ వ్యాలీలో సుమారు 100 మిలియన్ డాలర్లు (సుమారు 740కోట్లు) పెట్టుబడి పెడుతున్నట్లు ప్రకటన చేసిన ఇవాన్ హో  కేంబ్రిడ్జ్ అండ్ లైట్ హౌస్ కాంటన్.మంత్రి కేటీఆర్ తో సమావేశమైన కంపెనీ సీనియర్ ప్రతినిధి బృందం.

* జనసేన ప్రధాన లక్ష్యం సగటు ప్రజల కన్నీళ్లు తుడవటమే అని ఆ పార్టీ అధినేత పవన్‌ కల్యాణ్ అన్నారు. మంగళగిరిలోని జనసేన పార్టీ ప్రధాన కార్యాలయంలో ఆ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశమైంది. ఈ సందర్భంగా పవన్‌.. కొవిడ్‌ బారిన పడి మృతిచెందిన వారికి సంతాపం తెలిపారు. నంద్యాలకు చెందిన సోమశేఖర్‌ కుటుంబానికి రూ.5 లక్షల చెక్కు అందజేశారు. అనంతరం మాట్లాడుతూ.. ‘‘కరోనా విపత్తులో తొలి, రెండో దశలో దేశంలో లక్షల మంది చనిపోయారు. జన సైనికులు, వారి కుటుంబ సభ్యులు, నా సన్నిహితులు, బంధువులు చాలా మందిని కోల్పోయాను.

* ‘విలేజ్‌ కుకింగ్‌ ఛానల్‌’.. ఇప్పటికే సుపరిచితమైన పేరు. గత మూడేళ్లుగా ప్రపంచ వ్యాప్తంగా ఎంతో ఆదరణ పొందుతున్న ఈ యూట్యూబ్‌ ఛానల్‌… తాజాగా కోటి మంది సబ్‌స్క్రైబర్లను సొంతం చేసుకుంది. పల్లెదనం ఉట్టిపడేలా, పక్షుల కిలకిలల మధ్య వండుతూ.. రకరకాల వంటకాలను పరిచయం చేయడం ఈ ఛానల్‌ ప్రత్యేకత. ఈ ఛానల్‌ను నడిపిస్తోంది ఎవరో తెలుసా? కేవలం ఆరుగురు రైతులు. యూట్యూబ్‌ ద్వారా సంపాదిస్తూ…ఎన్నో సేవాకార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.

* కరేబియన్‌ దేశమైన హైతి అధ్యక్షుడు జొవెనెల్‌ మొయిసే దారుణ హత్యకు గురయ్యారు. అధ్యక్షుడు జొవెనల్‌ మొయిసే ఇంట్లోకి చొరబడ్డ కొందరు గుర్తుతెలియని దుండగులు అధ్యక్షుడితోపాటు ఆయన భార్యపై తుపాకులతో దాడికి పాల్పడినట్లు ఆ దేశ తాత్కాలిక ప్రధాని క్లౌడే జోసెఫ్‌ వెల్లడించారు. ఈ దాడిలో అధ్యక్షుడు మృతిచెందగా ఆయన భార్య, దేశ మొదటి మహిళ మార్టిన్‌ మొయిసే తీవ్ర గాయాలపాలై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఈ దాడిని జోసెఫ్‌ తీవ్రంగా ఖండించారు. ఇదో దుర్మార్గపు, అమానవీయ చర్యగా అభివర్ణించారు. దేశంలో రాజకీయ, ఆర్థిక స్థిరత్వం లేకపోవడంతో పాటు గ్యాంగ్‌ వార్‌లు పెరిగిపోయాయి. ఈ నేపథ్యంలోనే జోవెనల్‌ మొయిసే హత్యకు గురయ్యారు. అధ్యక్షుడి హత్యతో దేశవ్యాప్తంగా తీవ్ర ఆందోళనలు చెలరేగనున్నట్లు సమాచారం అందుకున్న ఆ దేశ పోలీసు శాఖ.. ప్రస్తుతం పరిస్థితులు అదుపులోనే ఉన్నాయని పేర్కొంది. హత్యపై దర్యాప్తు జరుపుతున్నట్లు తెలిపింది.

* దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి జయంతిని పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం వివిధ రంగాల్లో ప్రతిభ కనబర్చిన వ్యక్తులకు వైఎస్సార్ జీవిత సాఫల్య, వైఎస్సార్ సాఫల్య పురస్కారాలను ప్రకటించింది. బుధవారం రాష్ట్ర ప్రభుత్వం తరఫున అవార్డుల హైపవర్ స్క్రీనింగ్ కమిటీ సభ్యుడు, రాష్ట్ర కమ్యూనికేషన్ల సలహాదారు జీవీడీ కృష్ణమోహన్ అవార్డులను ప్రకటించారు. వ్యవసాయం, కళలు, సంస్కృతి, సాహిత్యం మొదలైన కేటగిరీలకు అవార్డుల్లో ప్రభుత్వం పెద్దపీట వేసింది.

* ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి బుధవారం ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు. తెలంగాణ ప్రభుత్వ వైఖరిపై మరోసారి ఫిర్యాదు చేశారు. తక్షణమే కేంద్రం జోక్యం చేసుకోవాలని లేఖలో కోరారు. ఆ లేఖలో.. ‘‘ తెలంగాణ ప్రభుత్వం చట్టవిరుద్ధంగా ఆపరేషన్‌ ప్రొటోకాల్‌ ఉల్లంఘిస్తోంది. కేఆర్‌ఎంబీ పరిధిని తక్షణమే నోటిఫై చేసేలా… జలశక్తి శాఖకు ఆదేశాలు ఇవ్వాలి. శ్రీశైలంలో నీటిమట్టం పెరగకుండా తెలంగాణ అక్రమంగా నీటిని తోడేస్తోంది. దీని వల్ల పోతిరెడ్డిపాడుకు సాగునీరు రాకుండా తెలంగాణ అడ్డుకుంటోంది.

* భూమా అఖిలప్రియ భర్త భార్గవ్‌రామ్‌, సోదరుడు విఖ్యాత్‌రెడ్డిపై మరో కేసు నమోదైంది. నకిలీ సర్టిఫికెట్లు సమర్పించినట్లు బోయిన్‌పల్లి పోలీసులు కేసు నమోదు చేశారు. విచారణ నుంచి తప్పించుకునేందుకు నకిలీ సర్టిఫికెట్లు సమర్పించినట్లు కేసు నమోదైంది. నకిలీ కోవిడ్‌ సర్టిఫికెట్‌ సమర్పించి ఈనెల 3న కోర్టులో జరగాల్సిన విచారణకు హాజరుకాలేమని జగత్‌విఖ్యాత్‌రెడ్డి, భార్గవ్‌ రామ్‌ చెప్పినట్లు పోలీసులు వెల్లడించారు. భూ వివాదం కిడ్నాప్‌ కేసులో భార్గవ్‌రామ్‌, విఖ్యాత్‌రెడ్డి నిందితులుగా ఉన్న సంగతి తెలిసిందే.