కొంతకాలం విరామం అనంతరం టాలీవుడ్‌లో రీ ఎంట్రీ ఇస్తోంది నాయిక తాప్సి. బాలీవుడ్‌లో బాగా బిజీ అయిపోయిన ఆమె ఓ విభిన్న కథతో తెలుగు ప్రేక్షకుల్ని అలరించేందుకు సిద్ధమైంది. ఆ సినిమానే.. ‘మిషన్ ఇంపాజిబుల్’. ‘ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ’ ఫేం స్వరూప్ ఆర్.ఎస్.జె. ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో కీలక పాత్రకి ఎంపికైంది తాప్సి. మంగళవారం ఆమె ఈ సినిమా సెట్‌లో అడుగుపెట్టారు. ఈ విషయాన్ని ప్రకటిస్తూ.. ఓ ఫొటోని విడుదల చేసింది చిత్ర బృందం. తాప్సి ఇందులో ల్యాప్‌టాప్‌ని చూస్తూ కనిపించింది. ‘ఈ స్క్రిప్ట్ నన్నెంతో ఆకట్టుకుంది. కొంత కాలంగా ఓ కథ కోసం ఎదురుచూస్తున్నా. అలాంటి కథే ఇది. మ్యాట్నీ వంటి సంస్థ నిర్మిస్తోన్న చిత్రంలో ఓ భాగం కావడం సంతోషంగా ఉంది’ అని తెలిపిందామె. ఆసక్తికర సబ్జెక్టుతో తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో బాలనటులకి అధిక ప్రాధాన్యం ఉంది.
సరికొత్త కథలో తాప్సీ

Related tags :