Sports

ఒలంపిక్స్ స్వర్ణం తెస్తే ₹6కోట్లు

ఒలంపిక్స్ స్వర్ణం తెస్తే ₹6కోట్లు

ఈ నెల 23 నుంచి జరగనున్న టోక్యో ఒలింపిక్స్‌లో తమ రాష్ట్రం నుంచి పాల్గొనే క్రీడాకారులకు ఒడిశా సీఎం నవీన్‌ పట్నాయక్‌ ప్రోత్సహకాలు ప్రకటించారు. పతకాలు సాధించిన క్రీడాకారులకు భారీ నగదు ప్రోత్సాహకం ఇవ్వనున్నట్టు తెలిపారు. బంగారు పతకం సాధించిన వారికి రూ.6కోట్లు, రజతం సాధిస్తే రూ.4కోట్లు, కాంస్య పతకం సాధించిన వారికి రూ.2.5 కోట్లు చొప్పున బహుమతిగా ఇవ్వనున్నట్టు వెల్లడించారు. అలాగే, ఒలింపిక్స్‌లో పాల్గొన్న క్రీడాకారులందరికీ రూ.15లక్షలు చొప్పున ఇస్తామన్నారు. క్రీడలకు సన్నద్ధమయ్యేందుకు ఈ నగదు ఇవ్వనున్నట్టు పేర్కొన్నారు. ఒలింపిక్స్‌కు ఎంపికైన క్రీడాకారులతో ఆయన ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఒలింపిక్స్‌కు వెళ్లాలనేది ప్రతి క్రీడాకారుడి కల అన్నారు. తమ రాష్ట్రం నుంచి ఒలింపిక్స్‌కు వెళ్తున్న ద్యుతి చంద్‌, ప్రమోద్‌ భగత్‌, దీప్‌ గ్రేస్‌ ఎక్కా, నమిత టొప్పో, వీరేంద్ర లక్రా, అమిత్‌ రోహిదాస్‌లకు నవీన్‌ పట్నాయక్‌ అభినందనలు తెలిపారు.