Movies

ఈమె ఎవరో తెలుసా?

ఈమె ఎవరో తెలుసా?

ఈ రోజుల్లో సెల‌బ్రిటీలు వారి ఫ్యామిలీ అంద‌రు ఆరోగ్యంపై చాలా దృష్టి పెడుతున్నారు. స‌రైన ఆహారం తీసుకోవ‌డ‌మే కాక జిమ్‌లో రెగ్యుల‌ర్‌గా ఎక్స‌ర్‌సైజ్‌లు చేయ‌డం, యోగస‌నాలు చేస్తూ బాడీని ఫిట్‌గా ఉంచుకోవ‌డం చేస్తున్నారు. అల్లు అర్జున్ సతీమ‌ణి స్నేహా రెడ్డి కూడా కొన్నాళ్లుగా యోగాలో ప్ర‌త్యేక శిక్ష‌ణ తీసుకుంటుంది. అయితే త‌ల‌కిందకు పెట్టి గాల్లో వేలాడుతూ చేసే యోగాస‌నంపై కొన్నాళ్లుగా క‌స‌ర‌త్తులు చేస్తుంది. ఎట్ట‌కేల‌కు అది సాధించింది. త‌న సోష‌ల్ మీడియాలో స్నేహా రెడ్డి ఫీట్‌కు సంబంధించిన ఫొటో పోస్ట్ చేయ‌గా, దీనిపై క‌ళ్యాణ్ దేవ్ స్పందించారు. మొత్తానికి సాధించావు అని రిప్లై ఇచ్చారు. గ‌తంలో ఇలాంటి ఫీట్స్ ఆదాశ‌ర్మ‌తో పలువురు స్టార్ హీరోయిన్స్ కూడా చేశారు. కాగా, సోష‌ల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండే స్నేహా రెడ్డి ఇటీవ‌ల 4మిలియ‌న్స్ ఫాలోవ‌ర్స్ మార్క్ చేరుకుంది. ఇండ‌స్ట్రీలో ఏ సెల‌బ్రిటీ భార్య కూడా ఫీట్ సాధించ‌క‌పోవ‌డంతో అయామ్ ది క్వీన్ అంటుంది స్నేహా రెడ్డి.