Politics

రమణ రాజీనామా. కోదండరాం ఆగ్రహం-తాజావార్తలు

రమణ రాజీనామా. కోదండరాం ఆగ్రహం-తాజావార్తలు

* విధుల్లోకి తీసుకోవాలంటూ పొరుగు సేవల నర్సులు చేస్తున్న ఆందోళన కొనసాగుతోంది. హైదరాబాద్ గాంధీభవన్‌ వద్ద నర్సుల ర్యాలీని పోలీసులు అడ్డుకోవడం తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డిని కలిసేందుకు వచ్చిన నర్సులు.. ఆ తర్వాత అక్కడ నుంచి కోఠి డీఎంఈ కార్యాలయం వరకు ర్యాలీగా తరలి వెళ్లేందుకు యత్నించారు. ఈ క్రమంలో నర్సులు, పోలీసుల మధ్య తీవ్ర తోపులాట చోటుచేసుకుంది. నర్సులు చేస్తున్న ఆందోళనకు రాష్ట్ర మహిళా కాంగ్రెస్‌ మద్దతు తెలిపింది. తొలగించిన నర్సులను వెంటనే విధుల్లోకి తీసుకొని జీతాలు చెల్లించాలని రాష్ట్ర మహిళా కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సునీతారావు డిమాండ్ చేశారు. కొవిడ్ సమయంలో సేవ చేసిన వారిపై ఇలా దుర్మార్గంగా వ్యవహరించడం సరైంది కాదన్నారు. 20 మంది నర్సులను అరెస్ట్ చేసి నారాయణగూడ పోలీసు స్టేషన్‌కు తరలించారు. తోపులాటలో మమత అనే నర్సుకు గాయాలైనట్లు తెలుస్తోంది.

* పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో పర్యావరణ అనుమతుల ఉల్లంఘనలపై ఎన్జీటీ చెన్నై ధర్మాసనం నిపుణుల కమిటీని ఏర్పాటు చేసింది. ఆగస్టు 27లోగా నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. పాలమూరు రంగారెడ్డి పథకంలో పర్యావరణ ఉల్లంఘనలు జరిగాయంటూ ముదిరెడ్డిపల్లికి చెందిన వెంకటయ్య అనే వ్యక్తి ఎన్జీటీలో పిటిషన్‌ దాఖలు చేశారు.

* తెలంగాణ జనసమితి(తెజస) కాంగ్రెస్‌ పార్టీలో విలీనం అవుతుందని సామాజిక మాధ్యమాల్లో తప్పుడు ప్రచారం చేస్తున్నారని.. ఈ ప్రచారాన్ని ప్రజలు నమ్మొద్దని ఆ పార్టీ అధ్యక్షుడు ప్రొ.కోదండరాం తెలిపారు. విలీనానికి సంబంధించి రెండు పార్టీల మధ్య ఎలాంటి చర్చలు జరగలేదన్నారు. పొడు భూములు, కృష్ణా నదీ జలాలు, పెట్రోల్, డీజిల్ ధరల పెంపుపై పోరాటం కొనసాగిస్తామని.. పార్టీ అస్తిత్వాన్ని కాపాడుకుంటామని స్పష్టం చేశారు. ప్రజా సమస్యలపై ఏ పార్టీతోనైన కలిసి పోరాటం చేస్తామని పేర్కొన్నారు. కరోనా నేపథ్యంలో ఏడాది పాటు పనులు చేయించుకొన్న నర్సులను ఇప్పటికిప్పుడు తొలగించడం దారణమన్నారు. సమస్యలను చెప్పుకునేందుకు ప్రగతి భవన్‌కు వెళ్తే అరెస్ట్ చేయించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా పోరాటం కొనసాగిస్తామని కోదండరాం స్పష్టం చేశారు.

* జగన్‌ అక్రమాస్తులు, ఓఎంసీ, ఎమ్మార్‌ కేసుల్లో పలు పిటిషన్లపై హైకోర్టులో విచారణ జరిగింది. ఈడీ కేసులు మొదట విచారణ జరపాలన్న సీబీఐ కోర్టు నిర్ణయంపై విజయసాయిరెడ్డి, జగతి పబ్లికేషన్స్‌ పిటిషన్లు దాఖలు చేశాయి. మొదట సీబీఐ కేసులు కుదరకపోతే రెండూ సమాంతరంగా విచారణ జరపాలని విజయసాయిరెడ్డి తరఫు న్యాయవాది కోరారు. మొదట విచారణ జరిపి అవసరమైతే తీర్పు వాయిదా వేయాలని ఈడీ తరఫు న్యాయవాది ప్రతిపాదించారు. సీబీఐ, ఈడీ కేసుల్లో మొదట ఏది విచారణ జరపాలన్న అంశంపై స్పష్టత లేదని ఇరువైపుల న్యాయవాదులు పేర్కొన్నారు. వివిధ కోర్టు తీర్పులు పరిశీలించి సమగ్ర విచారణ జరుపుతామని హైకోర్టు తెలిపింది.

* రాష్ట్రంలో ఉద్యోగాల భర్తీకి కీలకమైన నూతన జోనల్ విధానానికి ఇటీవలే అడ్డంకులు తొలగిన నేపథ్యంలో, ఖాళీల భర్తీ ప్రక్రియను ప్రారంభించాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అధికారులను ఆదేశించారు. ఈ మేరకు అన్నిశాఖల్లో కలిపి దాదాపు 50,000 (యాభై వేలు) ఉద్యోగాలను మొదటి దశలో భర్తీ చేయాలని, ఇందుకు సంబంధించిన ప్రక్రియను తక్షణమే ప్రారంభించాలని అధికారులను సిఎం ఆదేశించారు. ప్రమోషన్లు చేపట్టడం ద్వారా ఏర్పడే ఉద్యోగ ఖాళీలను గుర్తించి రెండవ దశలో భర్తీ చేయాలన్నారు. రాష్ట్రంలో నూతన జోన్లను ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి ఇటీవలే రాష్ట్రపతి ఆమోద ముద్ర లభించింది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో ఉద్యోగ ఖాళీల భర్తీ అంశం పై ముఖ్యమంత్రి అధ్యక్షతన ఉన్నతస్థాయి సమావేశం జరిగింది.

* హైదరాబాద్ లో ఉన్న డేటా బేస్ సర్వర్లు మంగళగిరి ఆటోనగర్ కు తరలింపు..హైదరాబాదులో ఉన్న డేటా బేస్ సర్వర్లు తరుచూ సాంకేతిక పరమైన సమస్యలు వస్తున్నాయి..ఫలితంతో సబ్ రిజిస్టర్ కార్యాలయాలు రోజుల తరబడి రిజిస్ట్రేషన్ నిలిచిపోతుంది..వాటిని అధిగమించడం కోసం మంగళగిరి లో ఏర్పాటుచేసి సెంట్రల్ ఏసి సర్వర్ సామర్థ్యం పెంచనున్నారు..భవిష్యత్తులో సాంకేతిక సమస్య తలెత్తకుండా చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు.దానిలో భాగంగా శని, ఆదివారం లో సామర్థ్య టెస్టులు చేస్తారు..సోమవారం నుంచి యథావిధిగా రిజిస్ట్రేషన్లు పనిచేస్తాయని అధికారులు వెల్లడి.

* తెలంగాణ తెదేపా అధ్యక్షుడు ఎల్‌ రమణ పార్టీ పదవికి రాజీనామా చేశారు.ఈ మేరకు రాజీనామా లేఖను పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబుకు పంపారు.తెరాసలో చేరాలని నిర్ణయించుకున్నట్లు రమణ తెలిపారు.

* తెలంగాణలో కొలువుల జాతర మొదలు కానుంది. రాష్ట్రంలో ఉద్యోగాల భర్తీకి కీలకమైన నూతన జోనల్‌ విధానానికి ఇటీవలే అడ్డంకులు తొలగిన నేపథ్యంలో ఖాళీల భర్తీ ప్రక్రియను ప్రారంభించాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ అధికారులను ఆదేశించారు. ఈమేరకు అన్ని శాఖల్లో కలిపి దాదాపు 50వేల ఉద్యోగాలను మొదటి దశలో భర్తీ చేయాలని, ఇందుకు సంబంధించిన ప్రక్రియను తక్షణమే ప్రారంభించాలని అధికారులను సీఎం ఆదేశించారు. ప్రమోషన్లు ఇవ్వడం ద్వారా ఏర్పడే ఉద్యోగ ఖాళీలను గుర్తించి రెండో దశలో భర్తీ చేయాలన్నారు. రాష్ట్రంలో నూతన జోన్లను ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి ఇటీవలే రాష్ట్రపతి ఆమోదముద్ర లభించింది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో ఉద్యోగ ఖాళీల భర్తీ అంశంపై ప్రగతి భవన్‌లో ముఖ్యమంత్రి అధ్యక్షతన ఉన్నత స్థాయి సమావేశం జరిగింది.

* దేశంలో కరోనా రెండో దఫా విజృంభణ ఇంకా ముగియలేదని, వైరస్ మన మధ్య నుంచి తొలగిపోయిందనే భ్రమలో బతకొద్దని శుక్రవారం కేంద్ర ఆరోగ్య శాఖ హెచ్చరించింది. అలాగే ఉత్తరాఖండ్‌లోని కెమ్టీ జలపాతం వద్ద వెలుగుచూసిన దృశ్యాలపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఆ వైఖరితో కరోనాకు మరోసారి ఆహ్వానం పలుకుతున్నారంటూ అసహనం వ్యక్తం చేసింది. ఇది సమూహ వ్యాప్తితో ముడిపడి ఉందని పేర్కొంది. ప్రజలంతా కచ్చితంగా కొవిడ్ నియమావళిని పాటించాలని తేల్చిచెప్పింది. ప్రపంచ వ్యాప్తంగా డెల్టా వేరియంట్‌ విజృంభిస్తుండగా.. యూకే, రష్యా, బంగ్లాదేశ్‌లో వైరస్ కేసులు పెరుగుతోన్న విషయాన్ని గుర్తుచేసింది. బంగ్లాదేశ్‌ రెండో దశతో పోల్చుకుంటే మూడో దశలో ఎక్కువ కేసుల్ని చవిచూసిందని వెల్లడించింది. దాంతో అక్కడి ప్రభుత్వం లాక్‌డౌన్ విధించినట్లు చెప్పింది. అలాగే యూరో 2020 ఫుట్‌బాల్‌ టోర్నీ కారణంగా యూకేలో కేసులు పెరుగుతున్నాయనే వాస్తవాలను కళ్లకు కట్టింది.

* ఆంధ్రప్రదేశ్‌లో గడిచిన 24 గంటల్లో 1,00,103 పరీక్షలు నిర్వహించగా.. 3,040 కేసులు నిర్ధారణ అయ్యాయి. తాజా కేసులతో కలిపి ఇప్పటివరకు రాష్ట్రంలో 19,17,253 మంది వైరస్‌ బారినపడినట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ బులెటిన్‌ విడుదల చేసింది. గడిచిన 24 గంటల వ్యవధిలో కొవిడ్‌ వల్ల 14 మంది బాధితులు ప్రాణాలు కోల్పోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా మృతుల సంఖ్య 12,960కి చేరింది. 24 గంటల వ్యవధిలో 4,576 మంది బాధితులు కోలుకోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా కోలుకున్న వారి సంఖ్య 18,73,993కి చేరినట్లు వైద్యారోగ్య శాఖ తెలిపింది. ప్రస్తుతం రాష్ట్రంలో 30,300 యాక్టివ్‌ కేసులున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 2,27,99,245 నమూనాలను ఆరోగ్య శాఖ పరీక్షించింది.

* తూర్పు గోదావరి జిల్లా రౌతులపూడిలో తెదేపా బృందాన్ని పోలీసులు అడ్డుకున్నారు. విశాఖ మన్యంలో లేటరైట్‌ తవ్వకాలను పరిశీలించేందుకు తెదేపా నేతలు అయ్యన్నపాత్రుడు, చినరాజప్ప, నక్కా ఆనందబాబు, కిడారి శ్రావణ్‌, అనిత, ఈశ్వరి, రాజేశ్వరీ, మాజీ ఎమ్మెల్సీ సంధ్యారాణిలతో కూడిన బృందం గిరిజనులతో మాట్లాడి వివరాలు తెలుసుకుంది. రౌతులపూడి మండలం జల్దామ్‌ నుంచి విశాఖ జిల్లా సిరిపురం వరకు రోడ్డు విస్తరణ జరిగినట్లు గర్తించిన తెదేపా నేతలు.. కేవలం లేటరైట్‌ తరలింపునకే రోడ్డు వేశారని ఆరోపించారు. రోడ్డు విస్తరణలో తమ పొలాలు, చెట్లు పోయాయని గిరిజనులు ఆవేదన వ్యక్తం చేసినట్లు చెప్పారు. లేటరైట్‌ ముసుగులో బాక్సైట్‌ తవ్వకాలకు జగన్‌ ప్రభుత్వం మరోసారి తెరలేపిందన్నారు. రిజర్వు ఫారెస్టులో నిబంధనలకు విరుద్ధంగా రోడ్డు వేశారన్నారు.