Fashion

వరిగడ్డితో చెప్పుల తయారీ

వరిగడ్డితో చెప్పుల తయారీ

మ‌నం ధ‌రించే చెప్పుల‌ను తోలుతో త‌యారు చేస్తార‌ని తెలుసు. అలాంటి పాద‌ర‌క్ష‌ల‌ను విరివిగా వాడుతున్నాం. అలా మ‌న‌కు తోలు చెప్పుల గురించే తెలుసు. కానీ వ‌రిగ‌డ్డితో కూడా చెప్పుల‌ను త‌యారు చేస్తార‌న్న‌ విష‌యం కూడా తెలుసుకోవాలి. వ‌రిగ‌డ్డి చెప్పుల గురించి తెలుసుకోవాలంటే జ‌మ్మూక‌శ్మీర్ వెళ్లాల్సిందే. క‌శ్మీర్‌లో ఒక‌ప్పుడు వ‌రిగ‌డ్డితో చెప్పుల‌ను త‌యారు చేసేవార‌ట‌. ఆ సంప్ర‌దాయాన్ని స‌జీవంగా ఉంచేందుకు అబ్దుల్ స‌మ‌ద్(110) అనే వృద్ధుడు కృషి చేస్తున్నాడు. వ‌రిగ‌డ్డితో పాద‌ర‌క్ష‌ల‌ను త‌యారు చేసి భ‌విష్య‌త్ త‌రాల‌కు ఈ సంప్ర‌దాయాన్ని కొన‌సాగించాల‌ని మార్గ‌ద‌ర్శ‌నం చేస్తున్నాడు. ఈ చెప్పుల‌ను క‌శ్మీర్‌లో పూల్‌హార్ అని పిలుస్తారు. ఈ సంద‌ర్భంగా అబ్దుల్ స‌మ‌ద్ మాట్లాడుతూ.. వ‌రిగ‌డ్డితో చెప్పులు త‌యారు చేయ‌డం క‌శ్మీరీ సంప్ర‌దాయం. దీన్ని స‌జీవంగా కాపాడ‌ట‌మే త‌న ల‌క్ష్య‌మ‌ని చెప్పుకొచ్చారు. లెద‌ర్‌తో త‌యారు చేసిన పాద‌ర‌క్ష‌లు కొన‌లేని ప‌రిస్థితుల్లో.. ఇవి ఉప‌యోగ‌ప‌డుతాయ‌న్నారు. ఈ చెప్పుల వ‌ల్ల ప‌ర్యావ‌ర‌ణానికి ఎలాంటి హానీ క‌ల‌గ‌ద‌ని, తేలిక బ‌రువులో ఉంటాయ‌న్నారు.