ScienceAndTech

వాటర్‌ప్రూఫ్ సిమెంట్ గురించి తెలుసా?

సొంత ఇళ్లు అనేది మధ్య తరగతి ప్రజల కలల సౌధం. నెలనెల పొదుపు చేసో లేదా హోం లోన్లు తీసుకునో చెమటోడ్చి ఇంటిని నిర్మించుకుంటారు. అంతేకాదు లక్షలు వెచ్చించి ఇంటిలోపల ఇంటీరియర్​ డిజైన్​ చేసుకుంటారు. ఇంటికి వచ్చిన గెస్టుల అభినందనలు అందుకునేలా నేటికి ట్రెండ్​కి తగ్గట్టు ఫాల్స్​ సీలింగ్​ కూడా చేయిస్తున్నారు. అయితే వాతావరణ మార్పులు, చిన్న చిన్న లోపాల కారణంగా వర్షకాలం వచ్చిందంటే చాలు చినుకు పడితే కొత్త సమస్యలు తలెత్తుతుంటాయి. సాధారణంగా రూఫ్‌ వాలుగా కాకుండా చదునుగా ఉండే విధంగానే ఎక్కువ మంది ఇళ్లను నిర్మిస్తారు. రూఫ్​ చదునుగా ఉండటం వల్ల అక్కడక్కడ నీరు నిలిచిపోయి సీపేజ్​లు వస్తుంటాయి. పైగా ఎండ, చలి, వానల కారణంగా వాతావరణంలో వచ్చే మార్పుల వల్ల లీకేజీలు ఏర్పడుతుంటాయి.

వర్షకాలం వస్తే లీకేజీలు ఉన్న ఇళ్లలో పై కప్పు నుంచి నీరు కురవడం, చెమ్మ రావడం వంటి సమస్యలు తలెత్తుతాయి. లక్షలు వెచ్చించి కట్టుకున్న ఇంటికి , వాటర్​ లీకేజీలు ఇబ్బంది పెడతాయి. ఇక ఇంటి పైకప్పుతో పాటు గోడలు కూడా చెమ్మ వస్తూ ఉంటుంది. ఈ చెమ్మ రావడం వల్ల ఇంటి గోడల ధృడత్వం దెబ్బతినడంతో పాటు ఎంతో ముచ్చటపడి ఇంటిలోపలి వైపు చేసుకున్న ఇంటీరియర్​ కూడా పాడైతోంది. ఫాల్స్​ సీలింగ్​కి మరకలు కూడా వస్తుంటాయి. ఈ సమస్యలకు చెక్​పెట్టడం ఇప్పుడు ఎంతో ఈజీ.

ఇంటి పైకప్పు నుంచి లీకేజీ, చెమ్మ సమస్యలు రాకుండా ఉండాలంటే ముందస్తుగా వాటర్​ ప్రూఫింగ్​ చేయించడం ఉత్తమం. గతంలో వాటర్​ ప్రూఫింగ్​ చేయాంటే అయితే మోర్టారు సున్నం వేయడం లేదంటే డాంబర్​ షీట్లు పరిచేయడం అనే పద్దతులే అందుబాటులో ఉండేవి. అయితే వీటి మన్నిక తక్కువ కావడంతో సమస్య మళ్లీ తిరగబెడుతుంది. ఈ సమస్యకు తెర దించుతూ కొత్త టెక్నాలజీ అందుబాటులోకి వచ్చింది. అధునాతన వాటర్​ ప్రూఫింగ్​ పద్దతులు అందుబాటులోకి వచ్చాయి, గోడలకు పెయింట్​ వేసినంత సుళువుగా వాటర్​ ప్రూఫింగ్​ చేసుకోవచ్చు. తద్వారా వాటర్​ లీకేజీ సమస్యల నుంచి గట్టెక్కవచ్చు.

సిమెంట్​కు కొన్ని రసాయనాల మిశ్రమాలను కలిపి, కొత్త రకం వాటర్​ ప్రూఫింగ్​ పద్దతులు మార్కెట్​లో అందుబాటులో ఉన్నాయి. వీటిని ఇంటి పైకప్పుకు వేయడం ద్వారా లీకేజీ సమస్య నుంచి గట్టెక్కవచ్చు. అయితే రసాయనాల నాణ్యతపై ఆధారపడి ఈ ప్రూఫింగ్​ మన్నిక ఉంటుంది. ముఖ్యంగా ఆక్రిలిక్​ రసాయనం కలిపిన వాటర్​ ప్రూఫ్​ సిమెంట్​ తో ఉత్తమమైన ఫలితాలను పొందవచ్చు. ఇక ఏషియన్​ పెయింట్‌ అయితే ఆక్రిలిక్ రసాయనంతో పాటు ‘ఫైబర్’ కంటెంట్‌తో కూడిన సిమెంట్​ని రూపొందించింది. వీటిని డాంప్​ ప్రూఫ్​, డాంప్​ ప్రూఫ్​ ఆల్ట్రా పేరుతో వాటర్​ ప్రూఫింగ్​ సొల్యూషన్స్​గా అందిస్తోంది. పైగా వీటితో వాటర్​ ప్రూఫింగ్​ చేసుకోవడం చాలా సులువు.